మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''[[మద్దెల నగరాజకుమారి]]''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ '''కుమారి'''గా పేరుతెచ్చుకున్నారు.<ref name="వాహిని కుమారి , Vahini Kumari">{{cite web|last1=టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్|title=వాహిని కుమారి , Vahini Kumari|url=http://tollywoodphotoprofiles.blogspot.in/search/label/Vahini%20Kumari%20-%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%20%20%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF|website=tollywoodphotoprofiles.blogspot.in|accessdate=13 June 2017}}</ref> [[తెలుగు]] చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో 'మునిపల్లె సుబ్బయ్య'గా ప్రఖ్యాతి పొందిన వి.వి.సుబ్బారావు [[రావణుడు]], [[ఇంద్రజిత్తు|ఇంద్రజిత్]] పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిమణుల్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి. నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె.
 
==ప్రస్థానం==
ఎందరో కళాకారులను చలనచిత్రరంగానికి అందించిన [[తెనాలి]]లో [[1921]]లో జన్మించిన మద్దెల నగరాజకుమారికి చిన్నతనం నుండి నటన అంటే ఆసక్తి. అయితే తల్లిదండ్రుల చాటుపిల్ల కావడంతో వారి అభీష్టానికి విరుద్ధంగా ప్రవర్తించలేకపోయారు. అదీగాక ఆ రోజులలో సినిమాలలో నటిస్తే అందం కరిగిపోతుందని, ఎక్కువ కాలం బతకరని అపోహలు ఉండేవి. అందుకే నాజూకుగా, ఎంతో ఆకర్షనీయంగా కనిపించే నగరాజకుమారికి అవకాశాలు ఎక్కువ సంఖ్యలోనే వచ్చినా ఆమె తల్లి అంగీకరించలేదు. '[[శ్రీకృష్ణతులాభారం]]', '[[సీతాకళ్యాణం]]' తదితర చిత్రాలలో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చినా ఈ కారణం వల్లే ఆమె తల్లి అంగీకరించలేదు. అయితే కూతురికి [[సంగీతం]] నేర్పించి, ఇంట్లో తిరుగుతూ కమ్మని స్వరంతో నగరాజకుమారి హాయిగా అలా పాడుతుంటే విని ఎంతో ఆనందించేది ఆమె తల్లి. కూతురు కళ్ళ ముందు అలా కనిపిస్తే చాలుననుకునేదామె.
 
==తొలి సినిమా==
ఇదిలా ఉంటె పువ్వుల అంజయ్య రూపంలో సినిమాలలో నటించే అవకాశం నగరాజకుమారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కన్నాంబ నాటక సమాజంలో వయోలినిస్టుగా పనిచేస్తుండేవారు. పూర్ణా యాత్రా స్పెషల్ నిర్వహించే జి.కె.మంగరాజు [[క్వాలిటి పిక్చర్స్]] పతాకంపై ఆ రోజులలోనే [[దశావతారాలు (1937 సినిమా)|దశావతారాలు]] (1937) చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాడు. నటీనటుల ఎంపిక కోసం [[బెజవాడ]] (ఈ నాటి విజయవాడ) వచ్చారు. అంజయ్య నగరాజకుమారికి దూరపుబంధువు కావడంతో ఆమె తల్లిని ఒప్పించి ఇంటర్వ్యూ నిమిత్తం [[బెజవాడ]]కు పంపించారు. నగరాజకుమారిని చూసీచూడగానే ఎంపిక చేయడమే కాకుండా మూడు పాత్రలను ఆమెకి ఇచ్చారు. ఆచిత్రంలో [[సీత]], [[లక్ష్మి|లక్ష్మీ]], యశోధర పాత్రలను రాజకుమారి పోషించారు. [[కలకత్తా]]లో ఈ చిత్రం నిర్మితమైంది. ఈ చిత్రం విజయవంతమవడంతో మరిన్ని అవకాశాలు ఆమెని వరించాయి.
 
==[[అమ్మ (1939 సినిమా)|అమ్మ]]తో హీరోయిన్==
పంక్తి 39:
 
==చేజారిన వేషం==
ఒప్పందం ప్రకారం వాహిని వారి నాలుగవ చిత్రం, దర్శకుడు [[కె.వి.రెడ్డి]] తొలి చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)లో కుమారి నటించాల్సి ఉంది. అయితే అదే సమయంలో 'తులసీదాసు' చిత్రం షూటింగు నిమిత్తం వాహినీ వారి అనుమతితో కుమారి [[బొంబాయి]] వెళ్ళడంతో [[భక్త పోతన]]లో అవకాశం చేజారింది. [[తులసీదాసు]] చిత్రం కోసం ఆరు నేలలు బొంబాయిలోనే కుమారి ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి నాయకుడు [[కె.ఎస్.ప్రకాశరావు]], దర్శకుడు రమణారావు. ఆరు నెలలు అక్కడే ఉన్నా షూటింగు సజావుగా సాగక ఆగిపోవడం కుమారిని మానసికంగా కుంగదీసింది. ఈ తప్పటడుగు పడకుండా ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది.
 
==అయిదేళ్ళ విరామం==
పంక్తి 45:
 
==[[మాయపిల్ల]]లో ద్విపాత్రాభినయం==
మరో నాలుగేళ్ళు తెర వెనకున్న కుమారికి [[మాయపిల్ల]] (1951) చిత్రంతో మంచి అవకాశం లభించింది. ఇందులో దొంగల రాణి 'మాయపిల్ల' (అసలు పేరు ఆశ) గా, రూపగా ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కోసం ఆమె పడిన శారీరక కష్టం అంతాఇంతా కాదు. కత్తి యుద్ధాలు, కొండచిలువతో[[కొండ చిలువ|కొండచిలువ]]<nowiki/>తో యుద్ధం ఇలాంటివి చాలా చేశారు. ఆ రెండు పాత్రల కోసం ఆమె వాడిన దుస్తులు ఆ రోజులలో కుర్రకారుని వెర్రెత్తించాయి. 1951లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు [[రఘుపతి సూర్యప్రకాష్‌]]కు చివరి చిత్రం కావడం గమనార్హం. కుమారి ఇంత కష్టపడినా ఈ చిత్రం మాత్రం విజయం సాధించలేదు.
 
==చివరి అవకాశాలు==
"https://te.wikipedia.org/wiki/మద్దెల_నగరాజకుమారి" నుండి వెలికితీశారు