స్వయంవరం (1982 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== కథ ==
ధర్మారావు బావమరిది (రావు గోపాలరావు)సుబ్బారావు ఒక అగ్ని ప్రమాదంలో భార్యతో సర్వస్వాన్ని కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతన్నిసుబ్బారావును ధర్మారావు తన భార్య నగలమ్మి తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటాడు. ధర్మారావు కొడుకు శేఖర్, అతని బావమరిదిసుబ్బారావు కూతురు ప్రియ చిన్నప్పటి నుంచీ ఒకరినొకరు వదలకుండా ఉంటారు. ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారం బాగా కలిసి వచ్చి ఇద్దరూ ధనవంతులవుతారు. కొత్తగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తుంటారు. ఏ నిర్ణయమైనా కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. శేఖర్ ను చదువు కోసం విదేశాలకు పంపిస్తారు. ప్రియను కూడా పంపించాలనుకుంటారు కానీ వీసా సమస్యతో పంపలేరు.
 
వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. గుమాస్తా భర్తను కోల్పోయిన తన చెల్లెలి ప్రేమను ఎరగా వేసి సుబ్బారావును మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు. బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతాడు. గుమాస్తా ప్రోద్భలంతో సుబ్బారావు తన కూతురు పేర వ్యాపారాలు ప్రారంభిస్తాడు. అవి బాగా కలిసివస్తాయి. ధర్మారావును ఒప్పించి అతని కొడుకు పేరు మీద కూడా వ్యాపారం ప్రారంభింప జేస్తాడు. కానీ అందులో నష్టం వచ్చి వ్యాపారం పూర్తిగా దివాలా తీస్తుంది. దాంతో లెక్కలు చూసుకుని ఇద్దరూ విడిపోతారు. ధర్మారావు తన సొంత ఇంటిని కూడా అమ్ముకుని ఆ నష్టం పూడ్చవలసి వస్తుంది. విదేశాల్లో ఉన్న శేఖర్ అర్ధాంతరంగా భారతదేశానికి తిరిగి వస్తాడు. తల్లి ద్వారా జరిగింది తెలుసుకుని సుబ్బారావును నిలదీస్తాడు. సుబ్బారావుకు కూడా కోపం వచ్చి తన కూతురుకు వేరే సంబంధాలు చూడ్డం మొదలు పెడతాడు. భార్య సలహాతో ధర్మారావు సుబ్బారావు ఇంటికి వెళ్ళి శేఖర్ కు, ప్రియకు పెళ్ళి చేయమని చెబుతాడు. కానీ సుబ్బారావు అందుకు అంగీకరించడు. పైగా ఓ జమీందారు కుటుంబానికి చెందిన రాజశేఖరం అనే అతనితో తొందరగా పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ప్రియ ఎలాగైనా తనను తీసుకెళ్ళమని శేఖర్ కు ఉత్తరం రాసి తన నౌఖరికి ఇచ్చి పంపిస్తుంది. కానీ అతను తిరిగి వచ్చేసరికి అతనికి సుబ్బారావు ఎదురై శేఖర్ ఆమెను అసహ్యించుకున్నాడని అబద్ధం చెప్పమంటాడు. అతను అలాగే చెబుతాడు. మనసు విరిగిపోయిన ప్రియ తండ్రి నిర్ణయించిన రాజశేఖరాన్ని పెళ్ళి చేసుకుంటుంది.
వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు.
 
అదే సమయానికి ధర్మారావు గుండెపోటుతో మరణిస్తాడు. కర్మకాండలు జరిపించిన వెంటనే ప్రియ ఇంటికి వెళ్ళిన శేఖర్ నౌకరు ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధ పడతాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/స్వయంవరం_(1982_సినిమా)" నుండి వెలికితీశారు