స్వయంవరం (1982 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 18:
వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. గుమాస్తా భర్తను కోల్పోయిన తన చెల్లెలి ప్రేమను ఎరగా వేసి సుబ్బారావును మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు. బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతాడు. గుమాస్తా ప్రోద్భలంతో సుబ్బారావు తన కూతురు పేర వ్యాపారాలు ప్రారంభిస్తాడు. అవి బాగా కలిసివస్తాయి. ధర్మారావును ఒప్పించి అతని కొడుకు పేరు మీద కూడా వ్యాపారం ప్రారంభింప జేస్తాడు. కానీ అందులో నష్టం వచ్చి వ్యాపారం పూర్తిగా దివాలా తీస్తుంది. దాంతో లెక్కలు చూసుకుని ఇద్దరూ విడిపోతారు. ధర్మారావు తన సొంత ఇంటిని కూడా అమ్ముకుని ఆ నష్టం పూడ్చవలసి వస్తుంది. విదేశాల్లో ఉన్న శేఖర్ అర్ధాంతరంగా భారతదేశానికి తిరిగి వస్తాడు. తల్లి ద్వారా జరిగింది తెలుసుకుని సుబ్బారావును నిలదీస్తాడు. సుబ్బారావుకు కూడా కోపం వచ్చి తన కూతురుకు వేరే సంబంధాలు చూడ్డం మొదలు పెడతాడు. భార్య సలహాతో ధర్మారావు సుబ్బారావు ఇంటికి వెళ్ళి శేఖర్ కు, ప్రియకు పెళ్ళి చేయమని చెబుతాడు. కానీ సుబ్బారావు అందుకు అంగీకరించడు. పైగా ఓ జమీందారు కుటుంబానికి చెందిన రాజశేఖరం అనే అతనితో తొందరగా పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ప్రియ ఎలాగైనా తనను తీసుకెళ్ళమని శేఖర్ కు ఉత్తరం రాసి తన నౌఖరికి ఇచ్చి పంపిస్తుంది. కానీ అతను తిరిగి వచ్చేసరికి అతనికి సుబ్బారావు ఎదురై శేఖర్ ఆమెను అసహ్యించుకున్నాడని అబద్ధం చెప్పమంటాడు. అతను అలాగే చెబుతాడు. మనసు విరిగిపోయిన ప్రియ తండ్రి నిర్ణయించిన రాజశేఖరాన్ని పెళ్ళి చేసుకుంటుంది.
అదే సమయానికి ధర్మారావు గుండెపోటుతో మరణిస్తాడు. కర్మకాండలు జరిపించిన వెంటనే ప్రియ ఇంటికి వెళ్ళిన శేఖర్ నౌకరు ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధ పడతాడు. ప్రియ భర్త రాజశేఖరం విలాస ప్రియుడు. మొదటి రాత్రికి కూడా ఇంటికి రాడు. తనకున్న అలవాట్ల గురించి, సంబంధాల గురించి బాహాటంగా ప్రియతో చెప్పి ఆమెకు కూడా ఇష్టమైతేనే కాపురం చేయమంటాడు. తల్లి బలవంతం మీదనే పెళ్ళి చేసుకున్నాననీ చెబుతాడు. ప్రియకు మాత్రం ఇంకా శేఖర్ కళ్ళలోనే మెదలుతుంటాడు. ప్రియ ఇంట్లో పనిచేసే టీచర్ రమాదేవి సాయంతో శేఖర్ ప్రియను కలిసి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ప్రియ ఇంకా అతని పట్ల ద్వేషంతోనే ఉంటుంది. రమాదేవి శేఖర్ నుంచి నిజం తెలుసుకుని ప్రియకు చేరవేస్తుంది.
== తారాగణం ==
|