మల్లంపల్లి సోమశేఖర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

+{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Mallampalli Somasekhara Sarma.jpg|right|thumb]]
'''[[మల్లంపల్లి సోమశేఖర శర్మ]]''' (''Mallampalli Somasekhara Sarma'') సుప్రసిద్ధ [[తెలుగు]] చారిత్రక పరిశోధకుడు. ప్రసిద్ధి చెందిన పురాలిపి శాస్త్రజ్ఞుడు. [[విజ్ఞాన సర్వస్వం]] ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పోడూరు]] మండలంలోని [[మినిమించిలిపాడు]]లో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు [[1891]] జన్మించాడు . శర్మగారి గృహ నామమైన మల్లంపల్లి అనే గ్రామం తెలంగాణలోని "పాలకూరు"కి "బమ్మెర"కు సమీపమున నున్న గ్రామం కాకతీయ పతనానంతరం శర్మ గారి పూర్వీకులు అక్కడ నుంచి గోదావరి మండలానికి తరలి వచ్చారని9 తెలుస్తుంది ''సోమశేఖర శర్మ డిగ్రీలు లేని పండితుడే అయినా నాటికీ నేటికీ ఆంధ్ర చరిత్రకారుల్లో అగ్ర తాంబూలానికి అర్హత సాధించిన పరిశోధక శిఖామణి''సాహిత్యరంగంలోను, రాజీకీయ రంగంలోను ప్రసిద్ధి గాంచాఈ. [[బిపిన్ చంద్రపాల్]] ప్రసంగాల ప్రాభావం శర్మ గారి మిద వుండి [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో విద్యార్థులు వందేమాతర ఉద్యమం చెప్పట్టిరి <ref name="BSL">డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు వ్యాఖ్య. ''బౌద్ధము-ఆంధ్రము'' అనే వ్యాస సంకలనం నుండి</ref>.
 
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో[[మెట్రిక్యులేషన్]] పరీక్షలో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించాడు. కథలు, నాటకాలు, నవలలు, [[పద్యాలు]] వివిధ పత్రికలలో ప్రచురించాడు. తరువాత శర్మ కార్యాచరణ స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని [[మద్రాసు]] నగరానికి మారింది. ఆరోజులలో ''చరిత్ర చతురాననుడు''గా ప్రసిద్ధి చెందిన [[చిలుకూరి వీరభద్రరావు]]తో శర్మకు పరిచయమైంది. అతనికి సాయంగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు వ్రాశాడు. అనంతరం [[విజ్ఞాన సర్వస్వం]] కృషిలో [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]], [[గాడిచెర్ల హరిసర్వోత్తమరావు]], [[ఆచంట లక్ష్మీపతి]], మరియు [[రాయప్రోలు సుబ్బారావు]] వంటివారులకు తోడు నిలచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతలలో ఒకడైనాడు.
 
అప్పటికి ఆంధ్ర దేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలైన శాసనాలను రక్షించి, వెలుగులోకి తెచ్చి విశ్లేషించే బృహత్తర బాధ్యతను శర్మ తలకెత్తుకొన్నాడు. ఒంటరిగాను, మిత్రుడు [[నేలటూరి వెంకట రమణయ్య]]తో కలిసీ [[నెల్లూరు]] జిల్లాలోను, [[రాయలసీమ]] ప్రాంతంలోనూ అన్వేషణా యాత్రలు సాగించాడు. ఇతనిని ''శాసనాల శర్మ'' అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ [[అన్వేషణ]] ఫలితంగా [[అశోకుడు|అశోకుని]] ఎర్ర గుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు చోడ, [[రెడ్డి]], విజయనగర రాజుల కాలంనాటి ఇతర [[శాసనాలు]] వెలుగులోకి వచ్చాయి.
 
తాము సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ ''ఎపిగ్రాఫియా ఇండియా'', [[భారతి]], [[శారద]], [[ఆంధ్ర పత్రిక]] వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. [[ఘంటసాల]] ప్రాకృత శాసనాల గురించి శర్మ వ్రాసిన వ్యాసం అతని మరణానంతరం ప్రచురితమయ్యింది. శాసనాల లిపిని పరిశోధించడంలోనూ అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు శర్మ మాత్రమే అనవచ్చును. ఏ సమస్యనైనా భిన్న దృక్కోణాల నుండి పరిశిలించి సమన్వయ శాస్త్రీయ దృష్టితో చర్చించిన తరువాతనే నిర్ణయాలు వెల్లడించేవాడు<ref name="BSL"/>. అహదహనకర శాసనంలోని ఒక అక్షరాన్ని శర్మ "ఱ"గా గుర్తించగా [[వేటూరి ప్రభాకర శాస్త్రి]] దానిని "ష+జ" ('ష' క్రింద 'జ' వత్తు) అని అన్నాడు. ఈ విషయమై వారిద్దరికీ ఆసక్తికరమైన వాదోపవాదాలు నడచాయి. అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు.