జయభేరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==సంక్షిప్త చిత్రకథ==
విశ్వనాథుడు (నాగయ్య) సంగీత శాస్త్ర కోవిదుడు. వారివద్ద సంగీతవిద్య నభ్యసించి అగ్రస్థానంలో నిలిచిన వాడు కాశీనాథ్ (అక్కినేని). అతనికి అన్న విశ్వనాథ్ (గుమ్మడి), వదిన (శాంతకుమారి) అంటే ఎంతో గౌరవం, అభిమానం. బచ్చెన భాగవతులు ఇచ్చిన ప్రదర్శన చూడడానికి వెళ్ళిన కాశీనాథ్ అందులో ప్రధాన పాత్ర వహించి, సవాలు చేసిన మంజుల (అంజలీదేవి)తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరి మధ్యా జరిగిన సంగీత సాహిత్యపరమైన వివాదం ప్రణయానికి దారితీస్తుంది. వారి జానపద కళల్లో కూడా మానవీయ విలువలున్నాయని కాశీనాథ్ గ్రహిస్తాడు. మంజులతో వివాహానికి కుల పెద్దలు అడ్డుచెబుతారు. కాశీనాథ్ ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అన్నగారికి దూరమై, ఇల్లు వదలి మంజులను దేవాలయంలో వివాహం చేసుకుంటాడు.
 
అక్కడినుంచి వారిద్దరూ, వారి బృందం (రమణారెడ్డి, కమలాబాయి)తో చేరి దేశ సంచారం చేస్తూ కళారూపాల్ని ప్రదర్శిస్తారు. చివరకు విజయనగర సామ్రాజ్యం చేరుతారు. ఆ దేశపు రాజు విజయానందుడు (యస్.వి.రంగారావు) మారువేషంలో వీరి ప్రదర్శన తిలకించి ముగ్ధుడై తన కొలువుకు ఆహ్వానిస్తాడు. నిండుసభలో సరికొత్త రాగంలో 'రసికరాజ తగువారము కామా' అనే పాటతో సభికుల్ని మెప్పిస్తాడు కాశీనాథ్. రాజనర్తకి (రాజసులోచన) కాశీనాథ్ ని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు రాజగురువు (ముక్కామల) సహకరిస్తాడు. ఫలితంగా కాశీనాథ్ మధ్యానికి బానిస కావడంతో అతని పతనం ప్రారంభమౌతుంది. అంతటి పతనావస్థలోనూ హరిజనుడి
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జయభేరి" నుండి వెలికితీశారు