ఎస్. వి. కృష్ణారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
'''ఎస్వీ కృష్ణారెడ్డి''' (S. V. Krishna Reddy) తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన వ్యక్తి.<ref name=businessoftollywood>{{cite web|last1=IVS|title=Director S V Krishna Reddy Birthday Today|url=http://businessoftollywood.com/director-s-v-krishna-reddy-birthday-today/|website=businessoftollywood.com|publisher=Business of Tollywood|accessdate=18 October 2016}}</ref> దర్శకత్వంతో బాటు కథారచన, [[సంగీతము|సంగీత]] దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. [[కె. అచ్చిరెడ్డి]]తో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు. కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.
 
== వృత్తి ==
మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో ''పగడాల పడవ'' అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.
 
== సినిమాలు ==