పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
న్యాయశాస్త్ర పట్టభద్రుడైన తరువాత [[1992]]లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]]లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993 లో [[హైదరాబాద్]] లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించాడు. రెండేళ్ళు ఆంధ్రభూమిలో పనిచేసిన తరువాత [[ఇండియా టుడే]] [[తెలుగు]] పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యాడు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబరు వరకు పద్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
 
2008 నవంబరు చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ [[హెచ్ ఎమ్ టివి|హెచ్.ఎం.టి.వి]] లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరాడు. ఆ తరువాత 2011 ఆగస్టు నెలలో V6 న్యూస్ ఛానెల్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసి, చానల్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. 2012 సెప్టెంబరులో V6 న్యూస్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ హెచ్.ఎం.టి.విలో చేరాడు.<ref name="V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై...">{{cite web|last1=ఏపి మీడియా కబుర్లు|title=V 6 కు పసునూరి శ్రీధర్ బాబు గుడ్ బై...|url=http://apmediakaburlu.blogspot.in/2012/10/v-6.html|website=apmediakaburlu.blogspot.in/|accessdate=30 November 2017}}</ref>
 
హెచ్.ఎం.టి.విలో ప్రోగ్రెస్ డిబేట్ వంటి స్ఫూర్తిదాయక చర్చలను నిర్వహించాడు. 2013 డిసెంబరులో హెచ్.ఎం.టి.వి నుంచి వైదొలగాడు. ఆ తరువాత దాదాపు ఏడాది పాటు ETV తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చానల్ల్లో ప్రైమ్ టైమ్ షో "ప్రతిధ్వని" కార్యక్రమాన్ని, ఇతర లైవ్ షోస్ ను ప్రజెంట్ చేశాడు. అదే సమయంలో హైదరాబాద్ లోని పుడమి పబ్లికేషన్స్ నుంచి [[విద్యార్థులు]], యువతరానికి [[రాజకీయాలు|రాజకీయ]], [[సామాజిక శాస్త్రం|సామాజిక]], శాస్త్రీయ అంశాల మీద సులువుగా అవగాహన కల్పించే లక్ష్యంతో "Young Zone" అనే మాసపత్రికను ప్రారంభించాడు.