కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''[[కుంటాల జలపాతం]]''' [[తెలంగాణ]] లోనే అతి ఎత్తయిన జలపాతం.
 
==ఉనికి==
ఇవి [[ఆదిలాబాదు]] జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో [[కడెం నది]]పైనదిపై [[కుంటాల]] గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ [[జాతీయ రహదారి]]పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు, మండల కేంద్రము నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ [[జలపాతం]] ఉంది<ref>మన ఆదిలాబాదు, [[మడిపల్లి భద్రయ్య]] రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ సంఖ్య 52</ref>.
 
==విశేషాలు==
45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, [[సహ్యాద్రి]] పర్వత శ్రేణిలో [[గోదావరి]]కి [[ఉపనది]] అయిన '''కడెం''' నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన [[ఆదిలాబాద్|ఆదిలాబాదు]] నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.<ref>http://www.hindu.com/2005/07/10/stories/2005071001360200.htm</ref>
 
జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. 2000 సంవత్సరపు వర్షాకాలము నుండి 2006 వర్షాకాలము వరకు 35 మంది కుంటాల జలపాతాల వద్ద ప్రమాదానికి గురై మరణించారు<ref>http://www.hindu.com/2006/09/12/stories/2006091203250200.htm</ref>
పంక్తి 28:
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం [[శివరాత్రి]] రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
 
జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల [[వృక్షాలు]] కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఛాంపియన్ / సేథి అటవీ వర్గీకరణ ప్రకారము సమూహము 5నకు చెందినది. ఈ అడవిలో చాలా రకాల అటవీ [[జంతువులు]] మరియు [[పక్షులు]] ఉన్నాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు