"విజయ నరేష్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
| grammyawards =
}}
'''[[విజయ నరేష్]] ''' లేదా '''నరేష్ ''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతను ప్రముఖ నటి [[విజయ నిర్మల]] కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
==నేపధ్యము==
బాలనటుడిగా 1972లో [[పండంటి కాపురం]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. 1982 లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ''ప్రేమ సంకెళ్ళు ''' చిత్రంలో కథానాయకుడిగా నటించాడు, కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకిడిగా నటించిన చిత్రం [[జంబలకిడి పంబ]] తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
 
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము మూడుసార్లు జరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన [[ఎన్. రఘువీరా రెడ్డి|రఘువీరారెడ్డి]] సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3 న [[హిందూపురం]]లో [[వివాహం]] చేసుకున్నాడు.ముగ్గురు కొడుకులు.<ref>http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html</ref><ref>[http://www.telugu.indiontv.com/movies-news.php?title=tollywood-senior-actor-naresh-changed-his-name-as-vijaya-naresh నటుడు నరేష్ పేరుకు ముందు విజయ]</ref>
 
==రాజకీయ జీవితము==
==భావాలు,అనుభవాలు==
*"పాజిటివ్ థింకింగ్ నా బలం. ఆ బలంతోనే కిందపడ్డ ప్రతిసారీ లేవగలిగాను. ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించగలగడం నా మరో బలం. అందుకే నాకు శత్రువులు ఉండరు.
*[[రాయలసీమ]] దుర్భిక్షం నన్ను కలచివేసింది. వెంటనే నా కార్యాచరణను మొదలుపెట్టాను. చిన్నగా మొదలైన సంస్థలో ఇప్పుడు 19 వేల మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత రాయలసీమ వికాసాంధ్ర కమిటీని ప్రారంభించాం.నా అనుభవాలతో త్వరలో 'అంతఃపురం అనంతపురం' అనే పుస్తకాన్ని ప్రచురిస్తాను.ఎన్నికల్లో డబ్బున్న వారు తప్ప కళాకారులు, సామాజిక సేవకులు పోటీ చేసే పరిస్థితి లేదనిపిస్తోంది. సర్వత్రా అయోమయం కనిపిస్తోంది. ఎప్పటికైనా వాగులను పూడిక తీయించి, చెరువులను పునరుద్దరించాలని, రాయలసీమలో కళాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించాలనీ ఉంది.
*ప్రస్తుతం అవార్డులను కొనుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నాకు అవంటే అసహ్యం. ఒకవేళ ప్రతిభను నిజంగా గుర్తించి అవార్డు ఇస్తే మాత్రం తప్పకుండా స్వీకరిస్తాను. నా దృష్టిలో ప్రజల చప్పట్లను మించిన అవార్డులు లేవు.
*అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల నేను నా పేరు ముందు విజయ అనే పేరును జత చేసి గెజిట్‌లో కూడా నమోదు చేశాను. నా పిల్లలు కూడా వాళ్ల మదర్ పేర్లను పెట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ విషయంలో నాకు చంద్రగుప్తమౌర్యుడే స్ఫూర్తి. సినిమాల్లో నపుంసకుడిగా చేయాలనేది నా డ్రీమ్.<ref>ఆంధ్రజ్యోతి 16.12.2013</ref>
1,89,206

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2298236" నుండి వెలికితీశారు