జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=జడ్చర్ల||district=మహబూబ్ నగర్
| latd = 16.7667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.1500
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline23.png|state_name=తెలంగాణ|mandal_hq=జడ్చర్ల|villages=20|area_total=|population_total=102766|population_male=51240|population_female=51526|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.29|literacy_male=69.51|literacy_female=46.71|pincode = 509301
}}
'''జడ్చర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్: 509301.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
*ఇది 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉన్న ముఖ్య కూడలి. [[హైదరాబాదు]] నుంచి [[కర్నూలు]], [[బెంగుళూరు]] వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది [[బడేపల్లి|బాదేపల్లి]] జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి [[పురపాలక సంఘం]] చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.
== చరిత్ర ==
19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఈ పట్టణంలో తన [[కాశీయాత్ర]]లో భాగంగా మజిలీచేసిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ పట్టణాన్ని గురించి తన [[కాశీయాత్రచరిత్ర]]<nowiki/>లో వ్రాశారు. ఆయన వర్ణించినదాని ప్రకారం 1830నాటికే ఇది చక్కని బస్తీగా ఉండేది. రమణీయమైన కొలను, చుట్టూ మండపాలతో మంచి దేవాలయం ఉండేదన్నారు. పట్టణంలో సంపన్న వర్తకులైన కోమటి కులస్తులు ఉండేవారని వ్రాశారు. అప్పటికే జడ్చర్లలో సకల పదార్థాలూ దొరికేవన్నారు. ఆ ఊరు ఆరువేల నియోగి [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కులస్థుడైన రాజగోపాలరావు అనే వ్యక్తికి తరతరాలుగా జమీందారీ కింద ఉండేదన్నారు. అయితే అతని వయస్సు అప్పటికి 12 సంవత్సరాలు కావడంతో ఆయన తల్లి పరిపాలన చేసేవారు. 3 లక్షల వరకూ సంవత్సరానికి నవాబుకు కట్టుకునే ఆ సంపన్న జమీందారీ పాలకులు ధర్మపాలన చేసేవారని పేరున్నట్టు వీరాస్వామయ్య వ్రాశారు. వారికి రాచూరు అనే గ్రామం రాజధానిగా ఉండేదన్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
 
.....
''ఆయూరున్ను ఇంకా36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు12 [[సంవత్సరము]]<nowiki/>ల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.''
**https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Kasiyatracharitr020670mbp.pdf/89
 
==జనాభా==
జనాభా (2011) - మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.
 
అక్షరాస్యుల సంఖ్య 61056.<ref>Census of India 2011,
 
Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref> మండలంలో పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.
 
==రవాణా సౌకర్యాలు==
7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున [[దేవరకొండ]], [[నల్గొండ]] వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో [[సికింద్రాబాదు]] నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
==వినోదం==
జడ్చర్ల పట్టణంలో 4 సినిమా థియేటర్లు ఉన్నాయి.
* శ్రీనివాస థియేటర్
* దేవి థియేటర్
* వెంకట రమణ థియేటర్
* రాఘవేంద్ర థియేటర్
 
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ( స్థాపన: [[1982]]-[[1983|83)
* ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ( స్థాపన : 1982-83)
* మాస్టర్స్ జూనియర్ కళాశాల ( స్థాపన : [[1997]]-[[1998|98]])
* సెయింట్ ఆగ్నస్ బాలికల హై స్కూల్
* జిల్లా ప్రజా పరిషత్తు బాలుర హై స్కూల్
Dr B R R govt degree college
 
==దేవాలయాలు==
*[[శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం (బాదేపల్లి)]].
*హనుమాన్ దేవాలయం, పాతబజార్ (బాదేపల్లి).
*వేంకటేశ్వర స్వామీ దేవాలయం, కొత్త బస్సుస్టాండు రోడ్డు ( జడ్చెర్ల )
*రంగనాయక స్వామీ దేవాలయం ( గుట్ట, బాదేపల్లి )
*శివాలయం, గంగాపురం రోడ్డు, బాదేపల్లి
*రాఘవేంద్రస్వామి దేవాలయం, సిగ్నల్ గడ్డ రోడ్డు, బాదేపల్లి
*సాయిబాబా దేవాలయం, బాదేపల్లి చౌరస్తా
*మైసమ్మ దేవాలయం, పాతబస్టాండ్ రోడ్డు చైతన్య నగర్. బాదేపల్లి
==నీటిపారుదల, భూమి వినియోగం==
మండలంలో 9 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 766 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.<ref>Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{col-begin}}
{{col-3}}
* [[గొల్లత్తగుడి]]
*[[వల్లూర్ (జడ్చర్ల)|వల్లూర్]]
*[[కిష్టారం (జడ్చర్ల మండలం)|కిష్టారం]]
*[[అంబతాపూర్]]
*[[గొల్లపల్లి (జడ్చర్ల)|గొల్లపల్లి]]
*[[ఈర్లపల్లి (జడ్చర్ల)|ఈర్లపల్లి]]
*[[కొడ్గల్]]
*[[పెద్ద అదిర్యాల్]]
*[[చిన్న అదిర్యాల్]]
*[[కొందేడ్|కొండేడ్]]
*[[గోపాల్‌పూర్ (కలాన్)|గోపాల్‌పూర్]]
{{col-3}}
*[[నెక్కొండ (జడ్చర్ల మండలం)|నెక్కొండ]]
*[[అమ్మాపల్లి (జడ్చర్ల)|అమ్మాపల్లి]]
*[[కోడుపర్తి]]
*[[గంగాపూర్ (జడ్చర్ల)|గంగాపూర్]]
*[[మాచారం (జడ్చర్ల)|మాచారం]]
*[[పోలేపల్లి (జడ్చర్ల)|పోలేపల్లి]]
*[[ఉద్దండాపూర్ (జడ్చర్ల)|ఉద్దండాపూర్]]
*[[శంకరాయపల్లి]]
*జడ్చర్ల
*[[బూరెడ్డిపల్లి]]
{{col-3}}
*[[మల్లెబోయినపల్లి]]
*[[చింతబోయినపల్లి]]
*[[ఆలూర్ (జడ్చర్ల)|ఆలూర్]]
*[[బూరుగుపల్లి (జడ్చర్ల మండలం)|బూరుగుపల్లి]]
*[[కిష్టారం (జడ్చర్ల మండలం)|కిష్టారం]]
*[[నాగసాల]]
*[[నస్రుల్లాబాద్]]
*[[అల్వాన్‌పల్లి]]
*[[బడేపల్లి|బాదేపల్లి]]
{{col-3}}
{{col-end}}
 
==ఇవి కూడా చూడండి==
*[[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం]]
 
==మూలాలు==
 
==గణాంకాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
{{మూలాలజాబితా}}
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
{{జడ్చర్ల మండలం లోని గ్రామాలు}}
{{మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా పట్టణాలు]]
[[వర్గం:జడ్చర్ల]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=జడ్చర్ల||district=మహబూబ్ నగర్
| latd = 16.7667
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు