తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''[[తొలిప్రేమ]]''' 1998లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. దీనికి కథ దర్శకత్వం [[ఎ.కరుణాకరన్]] చేకుర్చారు.
 
==కథ==
జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి [[యువకుడు]] బాలు ([[పవన్ కళ్యాణ్]]). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను ([[కీర్తి రెడ్డి]]) ఒక విమాన దుర్ఘటనలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో [[హైదరాబాదు]]లో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితంలో[[జీవితం]]<nowiki/>లో యౌవ్వన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తూ ఉంటుంది అను. [[దీపావళి]] రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతున్న బాలుకి ఒకసారి ఆలయంలో[[ఆలయం]]<nowiki/>లో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది.
 
ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యక ఓ పసి పాపను భారీ దుర్ఘటన నుండి రక్షిస్తాడు బాలు. అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కాని, విఫలం అవుతుంది. తన చెల్లెలు ప్రియ ([[వాసుకి]]) ద్వారా అనుని కలుస్తాడు బాలు. అను పైన ప్రేమని పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. కాని చెల్లెలి సలహా మేరకు అనుతో ముందు స్నేహాన్ని పెంచుకోవటానికి నిర్ణయించుకుంటాడు. [[ఊటీ]] వెళుతున్న అను కారు ప్రమాదానికి గురి అవుతుంది. ఆ ప్రమాదంలో లోయలో పడుతున్న అనుని రక్షించి తాను లోయలో పడతాడు బాలు. ఒక లారీ డ్రైవర్ బాలుని ఆస్పత్రి చేరుస్తాడు.
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు