లయ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
===సంగీతం - నృత్యం===
5వ తరగతి నుంచే సంగీతం, [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నృత్యం]] నేర్చుకోవడం కూడా మొదలుపెట్టింది. అంత చిన్న వయసులోనే ఈమె దినచర్య ఎలా వుండేదంటే పొద్దున్నే సంగీతం క్లాసు, తరువాత స్కూలు, సాయంకాలం డాన్స్ ప్రాక్టీసు ముగించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ వెంటనే చెస్ ప్రాక్టీసుకి వెళ్ళడం తిరిగి రాగానే మళ్ళీ హోమ్ వర్కూ. 5వ తరగతినుంచే ఇలా బిజీగా ఉండేది. వారాంతాలలో, సెలవు రోజుల్లోనూ మాత్రమే చుటుపక్కల పిల్లలతో కలిసి ఆడుకునేది. 8వ తరగతినుంచీ కూచిపూడి మానేసి భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. విజయవాడలో జోస్యుల రామచంద్రమూర్తి వద్ద, ఐదేళ్ళ క్రిందట హైదరాబాదు వచ్చాక పసుమర్తి రామలింగశాస్త్రి వద్ద భరతనాట్యం నేర్చుకున్నది. మరొక చిన్నప్పటి జ్ఞాపకం ఏమిటంటే ఈవిడ నాలుగో తరగతిలో వుండగా, హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కినేని కుటుంబరావు ఆయన తీయబోయే బాలల చిత్రం [[భద్రం కొడకో]]లో సినిమాలో నటించడం కోసం పిల్లల్ని వెదుకుతూ వీరి బృందాన్ని చూడడం, అందులో చలాకీగా వున్న లయను చూసి సినిమాల్లో వేషానికి గానూ ఎంపిక చేసుకోవడం జరిగింది<ref name="మొదటి సినిమా-లయ">{{cite web |url= http://www.koumudi.net/books/modaticinema_koumudi.pdf|title= మొదటి సినిమా-లయ|last1= |first1=లయ|last2= |first2= |date= |website= కౌముది.నెట్|publisher=కౌముది.నెట్ |accessdate=సెప్టెంబరు 1, 2015}}</ref>.
 
==మొదటి సినిమా అవకాశం==
"https://te.wikipedia.org/wiki/లయ_(నటి)" నుండి వెలికితీశారు