ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Bijapur-sultanate-map.svg|250px|thumb|right|1620లో [[రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా]] పాలనలో బీజాపూర్ రాజ్యము]]
'''[[ఆదిల్‌షాహీ వంశము]]''' [[1490]] నుండి [[1686]] వరకు [[బీజాపూరు]] కేంద్రంగా [[దక్కన్ పీఠభూమి]] యొక్క పశ్చిమ ప్రాంతాన్ని యేలిన షియా ముస్లిం<ref name="Farooqui">Salma Ahmed Farooqui, ''A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century'', (Dorling Kindersley Pvt Ltd., 2011), 174.</ref> సుల్తానుల వంశము. [[బీజాపూరు]] 1347 నుండి 1518 వరకు బహుమనీ సుల్తానుల రాజధానిగా ఉన్నది. 15వ [[శతాబ్దం]] చివరలో ఈ సామ్రాజ్యం క్షీణించి, తుదకు 1518లో అంతరించిపోయింది. బహుమనీ సుల్తానుల సామంతులుగా ఉన్న ఆదిల్‌షాహీలు [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సామ్రాజ్య]] పతననము తరువాత స్వతంత్ర రాజులైనారు. 'ఆదిల్‌షాహీ వంశపు స్థాపకుడు యూసుఫ్ ఆదిల్‌షా. బీజాపూరు సల్తనత్ 1686, [[సెప్టెంబరు 12]]న [[ఔరంగజేబు]]తో యుద్ధంలో ఓడిపోయి, [[మొఘల్ సామ్రాజ్యం]]లో కలిసిపోయింది.<ref>The Peacock Throne by Waldemar Hansen. ISBN 978-81-208-0225-4. Page 468.</ref>
 
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు [[యూసఫ్ ఆదిల్ షా]] (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని [[కొడుకు]] ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే [[పర్షియన్]], [[మంగోలియన్]] భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. యూసఫ్ మనవడు ఇబ్రహిం ఆదిల్ షా 1 (1534–1558), తో "ఆదిల్ షా" బిరుదు సామాన్య వాడుకలోకి వచ్చింది.
 
బీజాపూర్ సుల్తానుల సరిహద్దులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఈ రాజ్య ఉత్తరపుటెల్లలు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుత దక్షిణ [[మహారాష్ట్ర]] నుంచి ఉత్తర [[కర్ణాటక]] వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉంది. [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతాన్ని గెలవడంతో వారి [[దక్షిణం]] వైపు విస్తరణ ప్రారంభమైంది. 1565లో తలికోట యుద్ధంలో గెలుపుతో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యాన్ని]] గెలుచుకుని ఇంకా దక్షిణానికి జరిగారు. మొహమద్ ఆదిల్ షా (1627–1657), తరువాతి దండయాత్రలతో బీజాపూర్ అధికారపు సరిహద్దు మరింత దక్షిణంలో ఉన్న [[బెంగళూరు]] వరకూ వచ్చాయి. పశ్చిమాన పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న [[గోవా]], తూర్పున [[కుతుబ్ షాహీ వంశం]] పాలిస్తున్న [[గోల్కొండ|గోల్కొండ రాజ్యం]] వరకూ బీజాపూర్ రాజ్యం విస్తరించి ఉంది.
 
బహామని ప్రావిన్సు రాజధాని అయిన బీజాపూర్ నే వీరు కూడా చివరి వరకూ రాజధానిగా కొనసాగించారు. ఇబ్రహిం ఆదిల్ షా I (1534–1558), అలీ ఆదిల్ షా I (1558–1579) బీజాపూర్ నగరాన్ని పునర్నిర్మించారు. వీరిద్దరి పరిపాలనా కాలంలో నగరానికి ప్రహారీ, కాంగ్రిగేషన్ [[మసీదు]], రాజభవనాలు, ప్రధాన నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టారు. వారి వారసులు అయిన ఇబ్రహం ఆదిల్ షా II (1580–1627), ఆదిల్ షా (1627–1657), అలీ ఆదిల్ షా II (1657–1672)లు బీజాపూర్ ను సుందరమైన రాజభవనాలు, మసీదులు, సమాధులు, ఇతర కట్టడాలతో మరింత అలంకరించారు. దక్కన్ సుల్తనేట్, ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణాలలో ఒకటిగా నిలిచింది బీజాపూర్ నగరం.
 
బహమనీ సామ్రాజ్యం పతనం కావడంతో బీజాపూర్ లో అస్థిరత నెలకొంది. [[విజయనగర సామ్రాజ్యం]], ఇతర దక్కన్ సుల్తానేట్ లతో నిరంతర యుద్ధాల కారణంగా రాజ్యంలో అభివృద్ధి క్షిణించింది. దక్కన్ సుల్తానేట్ మిత్ర రాజ్యాలన్నీ కూటమిగా కలసి 1565లో తలికోటలో విజయనగర రాజుల్ని ఓడించి, సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. బీజాపూర్ ఎన్నో ప్రయత్నాల తరువాత ఆఖరుకి పొరుగు సుల్తనేట్ అయిన [[బీదర్]]ను 1619లో గెలుచుకున్నారు. పోర్చుగీస్ సామ్రాజ్యం గోవాలోని ఆదిల్ షాహికి చెందిన రేవు పట్టణంపై తీవ్ర ఒత్తిడి కొనసాగించేవారు. ఈ రేవుపై పోర్చుగీస్ వారు పెత్తనం చెలాయించేవారు. ఆఖరుకి ఇబ్రహిం II పరిపాలనాకాలంలో ఆ రేవు పట్టణాన్ని పోర్చుగీస్ వారు గెలుచుకున్నారు. [[ఛత్రపతి శివాజీ]] తిరుగుబాటుతో కొంత ఇబ్బంది ఎదుర్కున్నా, కొన్నాళ్ళు బీజాపూర్ రాజ్యం స్థిరంగానే కొనసాగింది. శివాజి తండ్రి షాజీ బోన్స్ లే ఆదిల్ షా పాలనలో మరాఠా ప్రాంతానికి ప్రధాన సేనాధిపతిగా పనిచేశాడు. తరువాతి కాలంలో శివాజీ మరాఠా ప్రాంతాన్ని గెలుచుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. [[బ్రిటీష్]] సామ్రాజ్యానికి ముందు మరాఠా సామ్రాజ్యం భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. 16వ శతాబ్దం చివరి భాగంలో బీజాపూర్ సామ్రాజ్యానికి [[మొఘల్ సామ్రాజ్యం]] దక్కన్ ప్రాంతంలో విస్తరణ ప్రారంభం వల్ల అతిపెద్ద ముప్పు మొదలైంది. నిజానికి శివాజీ తిరుగుబాటుతో బలహీనపడిన బీజాపూర్ సామ్రాజ్యంపై మొఘల్ రాజులు సులువుగా అదుపు సంపాదించగలిగారు. ఆదిల్ షాహీ సామ్రాజ్యంపై వివిధ ఒప్పందాలు విధించడం ద్వారా మొఘలులు బీజాపూర్ లో విదేశీ పరిపాలన చేయడం ప్రారంభించారు. కొన్ని దశల అనంతరం 1636లో బీజాపూర్ రాజ్యం అధికారికంగా మొఘలుల అధీనంలోకి పాక్షికంగా వెళ్ళిపోయింది. 1686లో బీజాపూర్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ముందు నుంచీ ఆదిల్ షాహీల ఖజానాను ఖాళీ చేస్తూ వచ్చారు మొఘలులు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు