కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| residence = హైదరాబాదు
}}
'''[[స్వాతి]]''' ఒక ప్రముఖ [[నటి]], వ్యాఖ్యాత, గాయకురాలు మరియు డబ్బింగ్ కళాకారిణి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|title=వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!|date=28 November 2017|publisher=ఈనాడు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20171128101659/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|archivedate=28 November 2017}}</ref> ఈమె మాటీవీలో ప్రసారమైన ''కలర్స్'' అనే కార్యక్రమం ద్వారా [[వ్యాఖ్యాత]] గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన [[అష్టా చెమ్మా]] చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.
 
==జీవిత విశేషాలు==
స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా [[రష్యా]]లో ఉండగా స్వాతి అక్కడే జన్మించింది. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేసారు. తర్వాత స్వాతిగా మార్చారు.<ref name="కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ">{{cite web|last1=జి. వి|first1=రమణ|title=కలర్స్ స్వాతి ఇంటర్వ్యూ|url=http://www.idlebrain.com/celeb/interview/swati.html|website=idlebrain.com|accessdate=28 November 2017}}</ref> వీరి మకాం [[రష్యా]] నుంచి మొదటగా ముంబై కి తర్వాత విశాఖపట్నంకి[[విశాఖపట్నం]]<nowiki/>కి మారింది. స్వాతి చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరంలో ఉండగా ఈమెకు హైదరాబాదుకు[[హైదరాబాదు]]<nowiki/>కు వెళ్ళింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి ఎం. బి. బి. ఎస్ సీటు తెచ్చుకుంది. కానీ తర్వాత బి. ఎస్. సి [[బయోటెక్నాలజీ]] చదివింది. తర్వాత ఫోరెన్సిక్ లో పి. జి. చేసింది. ఆమెకు ఒక [[అన్నయ్య]]. పేరు సిద్ధార్థ్.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు