అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి link రవితేజ using Find link
పంక్తి 48:
 
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో అరుంధతి పాత్రకు రాజసం ఉట్టిపడే, మంచి ఎత్తుగా ఉండే కథానాయిక కావాల్సివచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో [[మమతా మోహన్ దాస్]] అయితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు - శ్యామ్ సినిమా అంటే సంత్సరాల పాటు నిర్మాణం సాగుతూంటుందని, దాని వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతావని చెప్పడంతో ఆమె సినిమాను తిరస్కరించారు. ఆపైన వెతకగా [[అనుష్క శెట్టి|అనుష్క]] దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున [[సూపర్ (సినిమా)|సూపర్]] సినిమాలో రెండవ కథానాయికగా నటించి, రాజమౌళి దర్శకత్వంలో [[రవితేజ (నటుడు)|రవితేజ]] సరసన [[విక్రమార్కుడు]] సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగా, రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన - శ్యామ్ చాలా గొప్ప ఫిలిమ్ మేకర్ అనీ, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆపైన అనుష్క ఈ సినిమాను అంగీకరించారు. సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రతినాయకుడిది. ఈ పాత్రకు తమిళనటుడు పశుపతిని తీసుకుందామని భావించి పాత్రకి పశుపతి అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఆయనకు అఘోరా వేషం బాగానే సరిపోయినా, అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడే సన్నివేశాల్లో తేలిపోయినట్టు అనిపించడంతో ఆయనని తీసుకోలేదు. ''అశోకా'' అన్న హిందీ సినిమా చూస్తూండగా అందులో నటించిన [[సోనూ సూద్]] ఈ పాత్రకు సరిపోతారన్న నమ్మకం కలిగింది శ్యామ్ కు. అప్పటికి కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాని సోనూ సూద్ ను ఇందులో పశుపతి పాత్రకు తీసుకున్నారు. ఫకీర్ పాత్రకు ముందు [[నసీరుద్దీన్ షా]] అయితే బావుంటుందనుకున్నా వీలుదొరకలేదు. [[నానా పటేకర్]], [[అతుల్ కులకర్ణి]] వంటి వారిని సంప్రదించగా డేట్స్ కుదరకపోవడంతో వాళ్ళు నటించలేదు. దాంతో ఆ అవకాశం [[షాయాజీ షిండే]]కి దొరికింది.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" />
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ [[బనగానపల్లె]], [[అన్నపూర్ణ స్టూడియోస్|అన్నపూర్ణ స్టూడియో]] వంటి ప్రాంతాల్లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్లు సినిమా కోసం తీసుకుని వాటిలో ప్యాలెస్ సెట్ వేశారు. మొదటి ఫ్లోరులో సగం, మరో ఫ్లోరులో సగం సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. ఆ సెట్లో పదిహేను నిమిషాలు స్క్రీన్ టైం వచ్చే ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని చిత్రీకరించారు. ఆ సెట్ వేసేందుకు, అందులో చిత్రీకరించేందుకు దాదాపు 4నెలల సమయం, రూ.85 లక్షల వ్యయం అయ్యాయి. [[బనగానపల్లె]]లోని పాత కోటలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ కోటను సినిమా అవసరాలకు తగ్గట్టు వార్నిష్ చేయించి, కడియం నుంచి తెప్పించిన 25 లారీల పూలమొక్కలతో ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుచేసి అలంకరించారు. అక్కడ జరిపిన షూటింగ్ దాదాపు 45 రోజులు పట్టింది. క్లైమాక్స్ లో భయానక దృశ్యాల కోసం కోటలో భారీ ఎత్తున ఫైన్ డస్ట్ తెప్పించి వాడి దానిలో షూటింగ్ చేశారు. ప్రణాళికలో 55 రోజుల్లో సినిమా తీసేస్తామని భావించగా 200రోజులకు షూటింగ్ ఎగబాకింది. ఐతే సినిమా మొత్తం షూటింగ్ పూర్తయ్యాకా చూసుకున్న చిత్రబృందం అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదు. దాంతో బాగున్న భాగాలు ఉంచి, నచ్చని భాగాలను రీ-షూట్ చేశారు. దాంతో చిత్రీకరణ మరో 40 రోజులు పెరగింది. వెరసి మొత్తం షూటింగ్ 264 రోజులు జరిగింది.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" />
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు