వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{under construction}}
వికీపీడియాలోని వ్యాసాలను నమ్మదగ్గ మూలాల నుంచి స్వీకరించిన అంశాలతో రూపొందించాలి, ఆ అంశానికి సంబంధించిన నమ్మదగ్గ మూలాల్లో ప్రముఖమైనవి, ప్రాధాన్యత ఉన్నవీ అయిన అన్ని కోణాలను వ్యాసం ప్రతిబింబించాలి. ఒకవేళ ఒక అంశానికి సంబంధించి నమ్మదగ్గ మూలాలు ఏమీ లేకపోతే ఆ అంశం గురించి వ్యాసం ఉండరాదు.<br>
మూలాలు నమ్మదగ్గవి కావడానికి అవసరమైన ప్రాతిపదికలు వివరించడం, నమ్మదగ్గవి కాని మూలాలను గుర్తించేందుకు సహాయపడడం ఈ మార్గదర్శక పేజీ ప్రధాన లక్ష్యాలు. ఈ మార్గదర్శకాలు (చర్చించి, నిర్ధారించాకా) అన్ని విషయపు పేజీలకు, జాబితాలకు, ఏ మినహాయింపూ లేకుండా వర్తిస్తాయి. జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసాలకు, కులాల గురించిన వ్యాసాలకు (చర్చించి నిర్ధారించాల్సిన అంశం) మిగిలిన అన్ని వ్యాసాలతో సమానంగానే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి, కానీ వాటిపై ప్రత్యేకించి దాడి జరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా పరిశీలించాలి.
Line 17 ⟶ 16:
== స్వీకరించరాని మూలాలు ==
* '''బ్లాగులు''': బ్లాగులు స్వంత అభిప్రాయ ప్రకటనకు వేదికలు. బ్లాగుని వ్యక్తులు స్వంతంగా ప్రచురిస్తారు. వీటిలో సమాచారానికి, అభిప్రాయాలకు ఆధారాలు, మూలాలు ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు. అందుకే బ్లాగులను వికీపీడియా వ్యాసాలకు మూలాలుగా ఉపయోగించడం తగదు. కొన్ని బ్లాగులు ఇందుకు భిన్నంగా చక్కని విశ్లేషణతో, మూలాల సహితంగా, ప్రామాణికంగా ఉండే వీలున్నా వాటిని నిర్ధారించడం కష్టం.<br>
:అయితే కొన్ని బ్లాగులు పత్రికలు కానీ (ఉదాహరణకు [https://blogs.timesofindia.indiatimes.com/ టైమ్స్ ఆఫ్ ఇండియా బ్లాగ్], [https://www.bbc.co.uk/rd/blog బీబీసీ బ్లాగ్]), సంస్థల బ్లాగులు కానీ (ఉదాహరణకు [https://www.blog.google/ గూగుల్ బ్లాగ్], [https://blog.wikimedia.org/ వికీమీడియా ఫౌండేషన్ బ్లాగ్]) స్వంతంగా ప్రచురించేవి కానప్పుడు, వాటిపై పూర్తిగా సంపాదకుల నియంత్రణ ఉన్నప్పుడు, రచయితలు ఆయా అంశంలో నిపుణులు, అధ్యయనపరులు అయినప్పుడు మాత్రమే బ్లాగ్‌ని అంగీకరించవచ్చు. అయితే ఇవి బ్లాగులుగా పిలవబడుతున్నా సంప్రదాయరీతిలో ఇవి స్వయం ప్రచురణ సాధనాలు కావని గుర్తించాలి.
* '''స్వీకరించరాని వెబ్‌సైట్లు''': [[వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు/మూలాలుగా స్వీకరించరాని వెబ్‌సైట్లు|స్వీకరించరాని వెబ్‌సైట్లు]] పేజీలో, దాని చర్చా పేజీలో జరిగిన చర్చల ఆధారంగా నిర్ధారించే కొన్ని గాసిపింగ్, అప్రామాణిక వెబ్‌సైట్లను మూలాలుగా ఇవ్వరాదు. పుకార్లు, ప్రచారం వంటివి ప్రధానంగా ఉండే వెబ్‌సైట్లు ఇందలో జాబితా వేయాలి.
* '''సామాజిక మాధ్యమాలు''': సామాజిక మాధ్యమాలు సాధారణంగా అస్థిరమైన ప్రాథమిక మూలాల కిందకు వస్తాయి. ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు తమ అభిప్రాయాలు, ప్రకటనలు వెల్లడిస్తున్నారన్నది వాస్తవమే. కానీ అవి ప్రాధాన్యత కలిగిన విషయాలైతే ప్రధాన స్రవంతి పత్రికా మాధ్యమాల్లో ప్రచురితమౌతున్నాయి. కాబట్టి నేరుగా సామాజిక మాధ్యమాలను మూలాలుగా ఇవ్వరాదు, ఆయా ప్రకటనలు, వాగ్యుద్ధాలను కవర్ చేసే పత్రికలు, వెబ్‌సైట్ల వార్తలను మాత్రమే మూలాలుగా ఇస్తూ సందర్భశుద్ధితో రాయాల్సివుంటుంది.