జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
==చరిత్ర==
జగిత్యాల... ఒక జెకమొక రాయిలాంటి పదం...అంటుకున్న ఎలగడ మంట లాంటి పదం...ఒక జనం మహల్...ఒక జంగిల్ మహల్... ప్రపంచ పటం మీద ఒక పచ్చబొట్టు...పోరాటాల పాదం మీద ఒక పుట్టుమచ్చ...రక్తమాంసాల స్థూపం మీద ఎగిరిన ఒక రగల్ జెండా...సామాన్యుడికి సామాన్యమైన పట్టణమే కావచ్చు...వ్యాపారులకు ఒక మంచి బిజినెస్ సెంటర్ కావొచ్చు...జ..గి..త్యా..ల...ఈ నాలుగు అక్షరాలలో నాలుగు దిక్కులు పిక్కటిల్లిన ఆత్మఘోష ఉంది.సమరం ఉంది...సందేశం ఉంది...అంతకు మించి భిన్నమైన చరిత్ర ఉంది...పోరాట వీరులకు నెత్తురు పులకించిపోయే చారితాత్మక ప్రదేశం...జగిత్యాల అంటే ఒక జాగృతి జెండా...రష్యా గోడలమీద కూడా ఆనవాళ్ళు ముద్రించిన రుద్రభూమి...
 
* పేరు వెనుక కథలు
 
జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.
 
* జగిత్యాల కోట
[[జగిత్యాల కోట]] రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది.<ref name="చారిత్రక ఖిల్లా..">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=చారిత్రక ఖిల్లా..|url=https://www.ntnews.com/District/jagityal/article.aspx?contentid=614640|accessdate=16 July 2018|date=14 October 2016 |archiveurl=https://web.archive.org/web/20180716090907/https://www.ntnews.com/District/jagityal/article.aspx?contentid=614640|archivedate=17 July 2018}}</ref><ref name="పర్యాటక ప్రదేశాలు">{{cite news|last1=ఈనాడు|title=జగిత్యాల ఖిల్లా|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krntourism|accessdate=17 July 2018|archiveurl=https://web.archive.org/web/20180716194338/http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krntourism|archivedate=17 July 2018}}</ref> ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే క్రీ.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.
 
[[జగిత్యాల కోట]] రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే క్రీ.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.
 
చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు.
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు