నిజాం పాలనలో విద్య-విజ్ఞానం-సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

తీసివేయని కంటెంట్ను తొలగించడం
పంక్తి 1:
[[నిజాం]] పాలకులు [[తెలంగాణ]] ప్రాంతంలో విద్య-విజ్ఞానం-సంస్కృతులపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.33</ref> తెలుగుభాషను, తెలుగు సంస్కృతిని అణగద్రొక్కారు.<ref>తెలంగాణ ఆధునిక చరిత్ర, పేజీ 145, లైను 8 </ref>
 
== విద్యా విధానం ==
పంక్తి 7:
 
ప్రారంభంలో [[ఉర్దూ భాష|ఉర్దూ]]లో విద్యాభ్యాసం ఉండేది. అయితే, కింది తరగతులలో [[తెలుగు]] పాఠాలనే బోధించారు. కొన్నిరోజుల తరువాత క్రమంగా మొదటి తరగతి నుంచే ఉర్దూలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. తెలుగును రెండవ భాషగా మార్చారు. మొదట్లో ఉర్దూ పాఠ్యపుస్తకాలు ఉత్తర హిందూస్థాన్ నుండి తెప్పించేవారు. కానీ, ఇందులో ఉపయోగించిన భాష కఠినంగా ఉండడంవల్ల తెలుగు విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవటం అతికష్టంగా ఉండేది. దాంతో నిజాం సంస్థానంలోనే సులువైన ఉర్దూ భాషలో పాఠ్య పుస్తకాలను తయారుచేయడం ప్రారంభించారు.
 
ముస్లిం చక్రవర్తుల రాజుల, వారి ప్రధానుల, వారి దర్బారుల్లోని విద్యావంతుల వర్ణనలే ఎక్కువగా ఉండేవి. ముస్లిం రాజులు హిందూ రాజులపై విజయాలు సాధించి వారిని ఓడించిన ఘట్టాలను సవివరంగా రాయడంతోపాటు ఇస్లాం మతాన్ని బోధించే పాఠాలు ఉండేవి. కాని తెలుగువారి రాజ్యాలను, జీవిత వరిస్థితులను గురించి ఎక్కడా రాసేవారుకాదు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల తరగతుల్లో "దక్కను చరిత్ర''ను చెప్పేవారు. ఇది ప్రధానంగా నిజాం నవాబు, అతని పూర్వీకుల చరిత్రరూపంలో ఉండేది. హైదరాబాదు సంస్థానపు "భూగోళం" బోధనాంశంగా ఉండేది. సామాన్య గణితం, సైన్సు వంటి కోర్సుల తరగతులు ఉర్దూ భాషలోనే బోధించబడేవి.
 
హైస్కూలు, కాలేజీ పాఠ్య పుస్తకాలన్నీంటిని ([[చరిత్ర]], [[తత్వశాస్త్రం]], [[సైన్సు]], [[గణితశాస్త్రం]]) తర్జమా చేయించారు. వీటిల్లో వాడిన ఉర్దూ భాష పార్శీ, అరబ్బీమయంగా ఉండడంతో విద్యార్థులకు వాటిలోని విషయంతోపాటు భాషను కూడా అర్థంచేసుకోవటం కష్టంగా ఉండేది. వాటి ఇంగ్లీష్ మూల గ్రంథాలు సులభంగా అర్థమయ్యేవి. ఇంగ్లీషు భాషకు సంబంధించిన పుస్తకాలను ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకునేవారు. ఉర్దూ [[భారతదేశం|భారతదేశపు]] అధికారిక భాషల్లో ఒకటి. బ్రిటిషువారి తోడ్పాటుతో నిజాం ప్రభుత్వం ఉర్దూను [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయ]] స్థాయివరకు బోధనాభాషగా చేసి అమలు జరిపింది.
 
సంస్థాన ప్రజల మాతృభాషలు తెలుగు, [[మరాఠీ]], [[కన్నడ]] భాషలు అయినప్పటికీ వీటికి ప్రత్యామ్నాయంగా ఉర్దూను ప్రవేశపెట్టిన నిజాం ప్రభుత్వం పరాయి భాషాధిపత్యాన్ని ప్రజలపై రుద్దింది. దీని ఫలితంగా తెలుగువారిలో విద్యావ్యాప్తి తగ్గిపోయింది. పేద మధ్యతరగతి రైతుబిడ్డలు స్కూళ్ళల్లో చదవడమే అరుదుగా ఉండేది. సమాజంలోని అసమానతతోపాటు పేదరికం కూడా వారి చదువుకు అడ్డువచ్చేది. ధనిక రైతు కుటుంబాల విద్యార్థలు తమ గ్రామంలోని స్కూల్లో రెండవ తరగతి నుంచి నాల్గవ తరగతి వరకు చదివి తరువాత [[వ్యవసాయం|వ్యవసాయ]] వృత్తిలో ప్రవేశించేవారు. భూస్వాముల బిడ్డలు బస్తీలకు వెళ్ళి మిడిల్ స్కూళ్ళలో, హైస్కూళ్ళలో చదివేవారు. అక్కడక్కడా గ్రామీణ రైతుకుటుంబాల నుంచి వ్యక్తులు స్కూళ్ళలో చేరి చదువుకునేవారు. పట్టణాల్లోని అన్ని తరగతులవారూ తమ బిడ్డలను స్కూళ్ళకు పంపించి తమ శక్తికొలదీ చదివించేవారు. ఈమేరకు భూస్వాములు, ధనవంతులకే గాక మధ్యతరగతి వారికి కూడా చదువు అందుబాటులో ఉండేది. ఉద్యోగాలు చేసుకొనేవారంతా తమ బిడ్డలను చదివించేవారు, సంపన్నులకు ఇబ్బంది ఉండేదికాదు.
 
స్కూల్లో, కాలేజీలో చేరిననాటినుండి ఉద్యోగంలో ప్రవేశించే రోజుకోసం నిరీక్షించేవారు ఉండడంతో ఉద్యమాలు అభివృద్ధి కాలేదు. తమతమ భాషా సంస్కృతులను అభిమానిస్తే దానిని ప్రభుత్వ వ్యతిరేకతగా పరిగణించే రోజులవి. ఆయినా భాషాభిమానంగల విద్యార్థలు తమ విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగులయ్యారు. 1940 వరకు ఇది కొనసాగింది.