దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత విశేషాలు: తెలుగు వెలుగు పత్రిక మూలం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
 
డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు [[ఓరుగల్లు]] మీద వ్రాసిన ఖండకావ్యం [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.<ref>[http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=155153 ప్రముఖ సాహితీవేత్త డా॥ జి.వి.సుబ్రహ్మణ్యం వ్యక్తపరిచిన భావాలు]</ref>
 
== సాహితీ సేవలు ==
మే 23, 1943 న ఏర్పడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్తుతో ఆయనకు మొదటి నుంచి అనుబంధం ఉంది. 1944లో దానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1947లో కార్యదర్శి అయ్యాడు. 1952లో తొలిసారి అధ్యక్షుడై మధ్యలో కొంత విరామం తప్ప చనిపోయేదాకా అధ్యక్షుడిగా వ్యవరించాడు. ఆయన సారథ్యంలో సారస్వత పరిషత్తు స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసింది. 1953 లో అలంపురంలో ఆయన నిర్వహించిన [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] సప్తమ వార్షికోత్సవాలకు హైదరాబాదు నుంచి ప్రత్యేకమైన రైలు నడిపారు. అప్పటి ఉపరాష్ట్రపతి [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] ఈ సమావేశాలను ప్రారంభించడమే కాక రెండు రోజులపాటు హాజరయ్యారు.
 
నిజాం హయాంలో తెలుగులో విద్యాబోధన జరిగేది కాదు. అటువంటి సమయంలో ఈయన సారస్వత పరిషత్తు ద్వారా తెలుగులో ప్రవేశ, విశారద లాంటి పరీక్షలు నిర్వహించేవారు. తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు ఉపాధ్యాయుల కొరతను తీర్చగలిగారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ప్రాథమిక పాఠశాలల్లోనూ, విశారద పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా నియమించేవారు.
 
== గౌరవ పదవులు ==