ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

బిరుదులు పరిచయ విభాగంలో
ట్యాగు: 2017 source edit
పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''ఎస్. వి. రంగారావు''' గా సుప్రసిద్ధుడైన '''సామర్ల వెంకట రంగారావు''' ([[జులై 3]], [[1918]] - [[జులై 18]], [[1974]]) ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు. ఈయన మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. ''విశ్వనట చక్రవర్తి'', ''నట సార్వభౌమ'', ''నటసింహ'' మొదలైనవి ఈయన బిరుదులు.
 
== తొలి జీవితం ==
పంక్తి 34:
ఆ తర్వాత [[మనదేశం]], [[పల్లెటూరి పిల్ల]], [[షావుకారు]], [[పాతాళభైరవి]], [[పెళ్ళి చేసి చూడు]], [[బంగారుపాప]], [[బాలనాగమ్మ]], [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]], [[బాల భారతం]], [[తాతా మనవడు]] ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
 
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు [[ప్రేక్షకులు]] ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన [[నర్తనశాల]] [[ఇండొనేషియా]]లోని [[జకార్తా]]లో [[ఆఫ్రో]]-[[ఆసియా]] అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి [[భారతదేశం]] నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన ''[[చదరంగం (1967 సినిమా)|చదరంగం]]'' చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
 
==వ్యక్తిగతం==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు