ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
Another reference added
ట్యాగు: 2017 source edit
పంక్తి 73:
 
== నటనా శైలి ==
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచాడు.<ref name="voxspace">{{Cite web|url=http://www.voxspace.in/2018/04/05/sv-ranga-rao/|title=Remembering SV Ranga Rao : The Legend Less Known, But A Pioneer Of Method Acting|date=5 April 2018|accessdate=18 December 2018|website=VoxSpace|last=KSS}}</ref> రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించాడు. సంతానం చిత్రంలో ఆయన పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించాడు. మాంత్రికుడి పాత్ర కూడా ఆయన పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించాడు.
 
రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఈయన నటనను అభినందించాడు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టాడు. ఆయన కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవాడు.
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు