చార్లీ చాప్లిన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
పంక్తి 32:
ప్రధానంగా హాస్య నటుడైనా హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్, క్లౌనింగ్, మైమింగ్, బర్లెస్క్, పేరడీ, శ్లాప్‌స్టిక్ - వీటన్నిటిని అతడు మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్‌లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకరటింకర నడక - ఇవీ అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశద్రిమ్మరి. ఇవాళ ఇక్కడ వుంటాదు, రేపు మరో చోట. అతడికి ఊరూ పేరూ లేదు. అన్ని ఊర్లూ అతనివే, అన్ని పేర్లూ అతనివే.
ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడుగా బితుకుబితుకు మంటూ వుండేవాడు. అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక [[నాగరికత]]<nowiki/>లో సామాన్య [[మానవుడు]] నిస్సహాయుడుగా వుండిపోతున్నాడు. ఈ అల్పమావుడి ద్వారా అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు. అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి. సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది . ట్రాంప్ అలాంటి చిత్రం: కిడ్ లాంటి చిత్రం, సిటీలైట్స్[[సిటీ లైట్స్ (1931 సినిమా)|సిటీ లైట్స్]] కూడా అలాంటిదే. సినీ జీవిత చరమ దశలో తీసిన లైమ్ లైట్ ' లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది.
 
== విజయ పథం ==
అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు [[సినిమా]] రంగంలోను ఒక చార్లీ వుండేవాడు. మన [[హిందీ సినిమా]]లలో కూడా ఒక చార్లీ వుండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం పాంటోమైమ్‌తో ఆగిపోలేదు . దానికి మానవతా వాదమనే కొత్త డైమెన్షన్‌ను కల్పించాడు. ఒక అర్థశతాబ్థానికిపైగా అతడు దేశదేశాల వారిని వయోభేదం, [[మతము|మత]], వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు. [[ప్రపంచం]]<nowiki/>లోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, పిఛీథన్నననిక, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని తన చిత్రాలలో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు.
"https://te.wikipedia.org/wiki/చార్లీ_చాప్లిన్" నుండి వెలికితీశారు