వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఒక నిర్వాహకుడుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక పోతున్నానని భావించిన వాడుకరి, తనను ఆ బాధ్యతల నుండి తప్పించమని స్వచ్ఛందంగా స్టీవార్డులను కోరవచ్చు. ముందుగా తన కారణాలను సముదాయానికి [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు]] వద్ద తెలియజేసి, అ తరువాత అభ్యర్ధనను [[:m:Permissions#Removal_of_access]] పేజీలో చెయ్యాలి. (అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం 2019 జనవరి నాటికి తెవికీలో లేదు. భవిష్యత్తులో వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. అప్పుడు స్టీవార్డులను అభ్యర్ధించే అవసరం ఉండకపోవచ్చు.) స్టీవార్డుల్లో ఒకరెవరైనా ఈ అభ్యర్ధనను పరిశీలించి, తగు చర్య తీసుకుంటారు.
 
అయితే స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న నిర్వాహకుడు/రాలు తిరిగి తన సమయాన్ని నిర్వహణకు కేటాయించగలమని, సమర్థంగా నిర్వహించగలమని నిర్ణయించుకుని, దాన్ని నిర్వాహకుల నోటీసుబోర్డులో తెలిపితే వేరే ఏ చర్చ అవసరం లేకుండా అధికారులు వారికి హక్కులు తిరిగి ఇస్తారు. ఇలా నేరుగా నిర్వాహక హక్కులు ఇవ్వడానికి ప్రాతిపదిక మొట్టమొదట సముదాయం వారికి నిర్వాహక హక్కులు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయమే అవుతుంది. అయితే సముదాయం నిర్వాహకులు అచేతనంగా ఉండడం కారణంగానో, హక్కుల దుర్వినియోగం కారణంగానో ఉపసహంరించడానికి నిర్ణయిస్తే ఆ వాడుకరులు తిరిగి నిర్వహణ చేస్తామన్నప్పుడు నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు, తప్పనిసరిగా నిర్వహణా హక్కుల కోసం ప్రతిపాదన, దానిపై చర్చ, నిర్ణయం వంటివి జరగాల్సివుంటుంది.
 
=== చురుగ్గా లేని కారణంగా ===