వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ

నిర్వాహకత్వ విధులను స్వీకరించే సమయంలో వాడుకరులు తమ శాయశక్తులా కృషి చేసే ఉత్సాహంతోటే ఉంటారు. అయితే తదనంతర కాలంలో వివిధ కారణాల రీత్యా నిర్వాహకత్వ బాధ్యతలను నిర్వర్తించడంలో కొందరు నిర్వాహకుల్లో చురుకుదనం లోపించవచ్చు. అది వికీపీడియాకు ప్రగతి నిరోధకము, వికీపీడియా నాణ్యత తగ్గేందుకు కారణమూ కావచ్చు. దీన్ని గ్రహించిన సదరు నిర్వాహకులు వికీపీడియా బాగోగులను దృష్టిలో ఉంచుకొని తామే స్వచ్ఛందంగా నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పుకోవచ్చు. అలా నిర్వాహకులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు, అలా చెయ్యని నిర్వాహకులను సముదాయమే తప్పించేందుకూ ఒక విధానం ఉండాలి.

నిర్వాహకత్వ బాధ్యతలను నిర్వర్తించడంలో చురుగ్గాలేని వాడుకరులు తమ నిర్వాహకత్వాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకునేందుకు కోరవచ్చు. లేదా వారిని నిర్వాహకత్వ బాధ్యతల నుండి తప్పించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. పై సందర్భాల్లో సదరు నిర్వాహకులను స్టీవార్డులు ఈ బాధ్యతల నుండి తప్పిస్తారు. కొన్ని వికీపీడియాల్లో నిర్వాహకుల పనులను సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు మధ్యవర్తుల మండలి (en) ఉంటుంది. ఈ మండలికి సభ్యులను, ఒక నిర్ణీత కాలానికి వాడుకరుల నుండి సముదాయం ఎన్నుకుంటుంది. తెవికీలో అలాంటి మండలి లేదు కాబట్టి, ఈ సమీక్షను సముదాయమే నిర్వహిస్తుంది.

తెలుగు వికీపీడియాలో నిర్వాహకులను ఆ బాధ్యతల నుండి తొలగించే సందర్భాలను, నియమ నిబంధనలను, విధి విధానాలనూ ఈ పేజీ వివరిస్తుంది.

ఉపసంహరణకు కారణాలు మార్చు

నిర్వాహకుని నిర్వాహకత్వ బాధ్యతలను ఉపసంహరించేందుకు వివిధ కారణాలుండవచ్చు. స్థూలంగా ఆ కారణాలు ఇవి:

  1. స్వచ్ఛంద ఉపసంహరణ: నిర్వాహకుడు స్వచ్ఛందంగా తానే తప్పుకోవడం.
  2. చురుగ్గా లేకపోవడం వలన స్టీవార్డులు నిర్వాహకత్వాన్ని ఉపసంహరించడం.
  3. పనితీరులో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైన వాటి కారణంగా సముదాయం చర్చించి, నిర్ణయించిన మేరకు నిర్వాహకత్వ బాధ్యతలను తొలగించడం.

పై కారణాల్లో ఉపసంహరణ పద్ధతులు ఇలా ఉంటాయి:

స్వచ్ఛంద ఉపసంహరణ మార్చు

ఒక నిర్వాహకుడుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేక పోతున్నానని భావించిన వాడుకరి, తనను ఆ బాధ్యతల నుండి తప్పించమని స్వచ్ఛందంగా స్టీవార్డులను కోరవచ్చు. ముందుగా తన కారణాలను సముదాయానికి వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు వద్ద తెలియజేసి, అ తరువాత అభ్యర్ధనను m:Permissions#Removal_of_access పేజీలో చెయ్యాలి. (అధికారులకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం 2019 జనవరి నాటికి తెవికీలో లేదు. భవిష్యత్తులో వారికి ఆ అధికారం ఇస్తే, తెవికీలోని అధికారులే ఈ నిర్ణయాన్ని అమలు చెయ్యవచ్చు. అప్పుడు స్టీవార్డులను అభ్యర్ధించే అవసరం ఉండకపోవచ్చు.) స్టీవార్డుల్లో ఒకరెవరైనా ఈ అభ్యర్ధనను పరిశీలించి, తగు చర్య తీసుకుంటారు.

నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం మార్చు

స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న నిర్వాహకులు తిరిగి తన సమయాన్ని నిర్వహణకు కేటాయించగలమని, సమర్థంగా నిర్వహించగలమని నిర్ణయించుకుని, దాన్ని నిర్వాహకుల నోటీసుబోర్డులో తెలిపితే వేరే ఏ చర్చ అవసరం లేకుండా అధికారులు వారికి హక్కులు తిరిగి ఇస్తారు. ఇలా నేరుగా నిర్వాహక హక్కులు ఇవ్వడానికి ప్రాతిపదిక -మొదటిసారి నిర్వాహక హక్కులు ఇవ్వడానికి సముదాయం తీసుకున్న నిర్ణయమే అవుతుంది.

చురుగ్గా లేని కారణంగా మార్చు

తెవికీలో చురుగ్గా లేని నిర్వాహకుల నిర్వాహకత్వాన్ని తొలగించేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. ఈ తొలగింపు, సదరు నిర్వాహకుల నిర్వాహక కార్యకుశలతకు ప్రమాణంగా భావించరాదు. ఈ తొలగింపు శాశ్వతమూ కాదు. ఈ నిర్ణయం తీసుకోడానికి నెల ముందు, సదరు నిర్వాహకుని చర్చా పేజీలోను, ఈమెయిలు ద్వారానూ సంప్రదించాలి. అలాగే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు కూడా సంప్రదించాలి. నిర్వాహకత్వ తొలగింపు పట్ల సముదాయపు నిర్ణయాన్ని, స్టీవార్డుల దృష్టికి తీసుకువెళ్ళి, నిర్ణయాన్ని అమలు చేయించాలి. ఈ తొలగింపు కేవలం పద్ధతిని అనుసరించి జరిగిందే తప్ప, ఇది సదరు వాడుకరి సమర్ధత, పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని వాడుకరి హక్కుల సవరణ లాగ్‌లో స్పష్టంగా రాయాలి.

చురుకుదనానికి కొలబద్ద మార్చు

  • తెవికీలో 24 నెలల పాటు అసలేమీ ఎడిట్లు చెయ్యకపోతే

లేదా

  • తెవికీలో మామూలు ఎడిట్లు చేస్తూ కూడా ఆరు నెలల పాటు కనీస నిర్వాహక చర్యలు చెయ్యకపోతే
    1. ఆరునెలల్లో మామూలు ఎడిట్లు 1 (ఒక్కటి) చేసినా, ఏ పేరుబరిలో చేసినా సరే, ఈ నిబంధనకు గురి అవుతారు.
    2. నిర్వాహక ఎడిట్లు ఈ ఆరునెలల్లో కనీసం 20 అయినా చేసి ఉండాలి.

పై నిబంధనలకు గురయ్యే నిర్వాహకులు తొలగింపుకు సిద్ధపడాలి.

పరిశీలనా పద్ధతి మార్చు

  1. ప్రతి ఆరు నెలలకు ఒకసారి - ఏప్రిల్ మొదటి వారంలోను (అక్టోబరు 1-తరువాతి సంవత్సరం మార్చి 30 కాలంలో చురుకుదనపు పరిశీలన), అక్టోబరు మొదటి వారంలోనూ (ఏప్రిల్ 1-సెప్టెంబరు 30 కాలంలో చురుకుదనపు పరిశీలన) ఈ పరిశీలన జరుగుతుంది. పరిశీలనలో కింది అంశాలను పరిగణించాలి.
    1. ఎక్స్‌టూల్స్‌లో చూపించే మార్పులు
    2. వికీపీడియా పేరుబరిలో - రచ్చబండను మినహాయించి - చేసే మార్పుచేర్పులు.
    3. మూస పేరుబరిలో చేసే మార్పుచేర్పులు
    4. మొదటిపేజీ నిర్వహణ
  2. ఈ పరిశీలనను వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష అనే పేజీకి ఉపపేజీగా.. ఉదాహరణకు, [[వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/నిర్వాహకుని పేరు]] అనే పేజీలో రాయాలి.
  3. అధికారులు, నిర్వాహకులు, కనీసం 1000 దిద్దుబాట్లు చేసిన వాడుకరులు ఎవరైనా ఈ సమీక్ష చెయ్యవచ్చు.
  4. ఆ సమీక్షపై వాడుకరులెవరైనా తమ అభిప్రాయాలు రాయవచ్చు.
  5. ఈ సమీక్షా ఫలితాలను అధికారి/నిర్వాహకుడు సముదాయానికి రచ్చబండలో తెలియజేస్తారు.
  6. సమీక్షానుసారం తొలగింపుకు గురయ్యే నిర్వాహకునికి వారి చర్చాపేజీలో నోటీసు ఇవ్వాలి. సమీక్ష మొదలుపెట్టినవారు ఈ పని చెయ్యాలి. నోటీసు ఇచ్చిన వారం తరువాత స్టీవార్డులకు తెలియజెయ్యడం ద్వారా తొలగింపును అమలు చెయ్యాలి.
  7. ఈ నిబంధన ప్రకారం తొలగింపుకు గురౌతున్న నిర్వాహకుల్లో ఎవరినైనా, తొలగించకుండా ఉండేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. కానీ అందుకు కనీసం ఐదుగురు వోటింగులో పాల్గొనాలి. వీరిలో, తొలగింపు రద్దు ప్రతిపాదనకు కనీసం 80 శాతం మద్దతు ఉండాలి. రద్దుకు బలమైన కారణాలను చూపించాలి.
  8. వారం తరువాత అధికారులు ఈ విషయాన్ని స్టీవార్డులకు తెలియజేసి, తొలగింపును సదరు నిర్వాహకుల హక్కుల తొలగింపును కోరతారు.
నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం మార్చు

ఈ పద్ధతిలో తొలగించబడిన వాడుకరులు తిరిగి నిర్వహణ చేసేందుకు సిద్ధపడినప్పటికీ నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు. నిర్వహణ హక్కుల కోసం ప్రతిపాదించడం, చర్చించి, నిర్ణయించడం వంటి మామూలు పద్ధతి లోనే జరగాల్సివుంటుంది.

పనిలో లోపాలు, దుష్ప్రవర్తన మొదలైనవి మార్చు

వివాదాలు, ఫిర్యాదులను మామూలు వివాద పరిష్కార పద్ధతిలో పరిష్కరించుకోవాలి. అయితే ఈ వివాదం నిర్వాహకుని నిర్వాహక సమర్ధతపై సందేహాలు రేకెత్తిస్తున్నా (నిర్వాహక పరికరాల దురుపయోగం, పదేపదే కనిపిస్తున్న విచక్షణా లేమి, ప్రవర్తనలోని లోపాలు), లేదా చర్చలు విఫలమైనప్పుడూ ఈ పద్ధతిని అనుసరించాలి.

తొలగింపును వాడుకరి ఎవరైనా ప్రతిపాదించవచ్చు. ఆ తొలగింపును వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు పేజీలో ప్రతిపాదించాలి. కచ్చితమైన దృష్టాంతాలను చూపిస్తూ ఈ ప్రతిపాదన చెయ్యాలి. చర్చించేందుకు, వోటు వేసేందుకూ వారం పాటు గడువు ఇవ్వాలి. తొలగింపుపై నిర్ణయాన్ని వోటు వెయ్యని నిర్వాహకుడు గాని, సీనియర్ వాడుకరి గానీ ప్రకటించవచ్చు. నిర్ణయం తీసుకునేటపుడు, కేవలం ఓట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకోకుండా, వాడుకరులు రాసిన అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఇది వికీపీడియా స్ఫూర్తి.

చర్చ, వోటింగు తరువాత, తొలగించాలని నిర్ణయిస్తే, సదరు నిర్ణయాన్ని నిర్వాహకులు లేక అధికారులు స్టీవార్డులకు తెలియజేస్తారు. సదరు నిర్వాహకులు లేదా అధికారి చర్చలో పాల్గొని వోటు వేసి ఉన్నా, ఈ పని చెయ్యవచ్చు.

నిర్వాహకత్వాన్ని తిరిగి పొందడం మార్చు

ఈ పద్ధతిలో తొలగించబడిన వాడుకరులు తిరిగి నిర్వహణ చేసేందుకు సిద్ధపడినప్పటికీ నేరుగా హక్కులు ఇవ్వడం సాధ్యపడదు. నిర్వహణ హక్కుల కోసం ప్రతిపాదించడం, చర్చించి, నిర్ణయించడం వంటి మామూలు పద్ధతి లోనే జరగాల్సివుంటుంది.

ఈ విధానానుసారం చేసిన సమీక్షలు మార్చు

ఈ విధానాన్ని అనుసరించి, వివిధ నిర్వాహకులు చేసిన పనులపై ఆర్నెల్లకోసారి జరిపిన సమీక్షలను వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష పేజీలో చూడవచ్చు.

ఇవి కూడా చూడండి మార్చు