విజయశాంతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 56:
ఈ ఐదేళ్ల కాలంలో విజయశాంతి ప్రభ క్రమంగా క్షీణించనారంభించింది. 1993 లో వచ్చిన [[పోలీస్ లాకప్]] తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. సరైన కథ లేకుండా నటించటానికి ఆమె ఇష్టపడక పోవటం దీనికి కారణం. 1980లో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటి విడుదల కాని మొదటి ఏడాది అది. ఆ ఏడాది ఆమె [[యంగ్ టర్క్స్]] అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం [[ఢిల్లీ డైరీ]]గా తెలుగులోకి అనువదించబడింది కానీ పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.
ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది [[ఒసేయ్ రాములమ్మా]]. [[దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజునుండి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన [[హిట్లర్ (సినిమా)|హిట్లర్]], [[అన్నమయ్య]], [[తొలిప్రేమ]], [[ప్రేమించుకుందాం.. రా]] వంటి ఇతర చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నా [[ఆంధ్ర ప్రదేశ్]] బాక్సాఫీసుల వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగో సారి [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకి సంపాదించిపెట్టటమే కాకుండా, [[అడిమై పెణ్]] పేరుతో తమిళంలోనికి అనువాదమై అక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. [[ఆర్. నారాయణ మూర్తి]] స్ఫూర్తితో
1997 లోనే ఆమె [[గూండా గర్దీ]] అనే హిందీ చిత్రంలో నటించగా అది కూడా విజయవంతమయింది. ఈ సినిమా [[శోభన]] ప్రధాన పాత్రలో నటించిన [[అస్త్రం]] (1991) అనే తెలుగు సినిమాకు హిందీ రీమేక్. అదే ఏడాది నవంబరు 7న [[దాసరి నారాయణ రావు]] దర్శకత్వంలోనే, [[ఒసేయ్ రాములమ్మా]]కి పనిచేసిన తారా గణం, సాంకేతిక బృందం తోనే నిర్మించబడిన [[రౌడీ దర్బార్]] విడుదలైంది. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది కానీ బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ లాభాలు అర్జించింది.
|