"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

భారత దేశం లింకు సవరణ
(భారత దేశం లింకు సవరణ)
ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ [[మాతృభాష]]గనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది.
 
రాజకీయముగా [[భారత దేశం|భారతదేశము]] పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.
 
“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రథమ భాగములో 177 వ పుట).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2621609" నుండి వెలికితీశారు