బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. [[కవి]] సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు [[సృజనాత్మక కవులు - పగటి కలలు|సృజనాత్మక]] రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ [[శిల్పం]] తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన [[సంభాషణ]] విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, [[శృంగారం|శృంగార]] రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన [[విశ్వనాధ సత్యనారాయణ]] "నాట్యాచార్య" బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం "అభినయ సరస్వతి" అని, కొండవీటి వెంకటకవి "నాట్యమయూరి" అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, [[బంగారు]] కంకణాలనూ అందుకున్నాడు.
 
1937లో చలనచిత్ర రంగం లో ప్రవేశించి పోతన, [[స్వర్గసీమ]], [[వేమన]], [[పెద్ద మనుషులు]], [[త్యాగయ్య]], నా యిల్లు, [[రామదాసు]] చిత్రాల్లో నటించాడు.<ref name="‘అభినవ చింతామణి’ ఇక లేరు">{{cite news |last1=ఈనాడు |first1=ఆంధ్రప్రదేశ్-ప్రధాన వార్తలు |title=‘అభినవ చింతామణి’ ఇక లేరు |url=https://www.eenadu.net/ap/mainnews/2019/04/08/91712 |accessdate=11 April 2019 |date=8 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190411155052/https://www.eenadu.net/ap/mainnews/2019/04/08/91712 |archivedate=11 April 2019}}</ref>
 
== ఇతర వివరాలు ==