అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''అంట్యాకుల పైడిరాజు''' [[విజయనగరం]] జిల్లాకు చెందిన ప్రముఖ [[చిత్రకారుడు]] మరియు [[శిల్పి]].
 
ఈయన [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది. [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
 
ఈయన 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్,]] [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి. వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినదే.
 
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన '[[పేరంటం]]', 'అలంకరణ', '[[బొట్టు]]' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
 
కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు [[1986]] సంవత్సరంలో [[డిసెంబరు 26]]న [[విశాఖపట్నం]]లో తనువు చాలించారు.
 
[[వర్గం:1919 జననాలు]]
[[వర్గం:1986 మరణాలు]]
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
[[వర్గం:భారతీయ చిత్రకారులు]]
"https://te.wikipedia.org/wiki/అంట్యాకుల_పైడిరాజు" నుండి వెలికితీశారు