వై. కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== సినీరంగ ప్రస్థానం ==
బాల్యంలో ఆయన బంధువులకు సినిమా హాలు ఉండేది. అందులో ఆయన ఉచితంగా సినిమాలు చూసేవాడు. వాటిని చూసి స్ఫూర్తి పొంది చిన్న కథనాలు రాసుకుని అమ్మకు వివరించేవాడు. ఆమె కూడా ప్రోత్సహించేది. ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు వారి ఊరికి దగ్గరలో బాలచందర్ దర్శకత్వంలో [[తొలికోడి కూసింది]] అనే సినిమా షూటింగ్ జరగడం చూశాడు. అప్పటి నుంచి సినీరంగం వైపు ఆకర్షితులయ్యాడు. కుటుంబ సభ్యులకి ఆ విషయాన్ని తెలియ జేశాడు. తనకి సోదరుడి వరసయ్యే గద్దె రత్నాజీ రావు ప్రోత్సాహంతో చెన్నై వెళ్ళి కానూరి రంజిత్ కుమార్ అనే నిర్మాతను కలిశాడు. అప్పుడు ఆయన [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[లంకె బిందెలు]] అనే సినిమా తీస్తున్నాడు. ఈయన ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు.<ref name="ntvnews">{{cite web|last1=NTV|first1=News|title=Interview with Director, Actor Kasi Viswanath|url=https://www.youtube.com/watch?v=Z2YNw9l9-BY|website=youtube|publisher=NTV|accessdate=28 May 2019}}</ref><ref name="youtubeinterview1">{{cite web|last1=Shiva|title=Y. Kasi Viswanath Youtube interview|url=https://www.youtube.com/watch?v=G-KWHQNZky4|website=Youtube|publisher=Shiva|accessdate=28 May 2019}}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వై._కాశీ_విశ్వనాథ్" నుండి వెలికితీశారు