వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
 
[[File:VargavRkshaM women.png]]
 
== వర్గీకరణ విదానం (విస్తరణ) ==
 
చర్చనంతా చదివి ఈ వర్గీకరణకు ప్రాతిపదికను విస్తరిస్తే బాగుండుననిపించింది. స్థూలంగా 5 మితులు (డైమెన్షన్లు) అనుకోవచ్చు. మితులకు లోతు కూడా ఉంటుంది.
* '''వృత్తి/ప్రవృత్తి/వ్యాపకం''': రచయితలు, శాస్త్రవేత్తలు. రచయిలకు సంబంధించినంత వరకూ రచనా ప్రక్రియ, వాదం అనేవి ఉపమితులు అవుతాయి. ఉదా॥ నవలా రచయితలు, స్త్రీవాద రచయితలు. శాస్త్రవేత్తలకు వారి రంగం ఉపమితి. ఉదా॥ అణు శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు.
* '''భౌగోళికం: జాతీయం → ప్రాంతీయం''': భారతీయులు, అమెరికన్లు, యూరోపియన్లు. ఇక్కడ లోతు ఖండం, దేశం, రాష్ట్రం, జిల్లా, వంటివి. సందర్భాన్ని బట్టి, మనక్కావలసిన లోతుకే వెళ్తాం. “తెనాలి వ్యక్తులు” వర్గం ఉండొచ్చు కానీ, “బ్రూక్లిన్ వ్యక్తులు” అనే వర్గం మన తెలుగు వికీలో అనవసరం రాకపోవచ్చు.
* '''జాతి''': తెలుగువారు, తమిళులు, ఆంగ్లేయులు.
* '''లింగం''': మహిళలు.
 
* '''కాలం''': 19వ శతాబ్దపు వ్యక్తులు
 
* <s>'''మతం'''</s>: హిందువులు, క్రైస్తవులు. వద్దులెండి.
ప్రతీ మితికీ తతిమా మితులను, ఉపమితులను జోడించి ఉపవర్గాలను తయారు చేయవచ్చు:
 
{| class="wikitable"
|-
! !! వృత్తి !! జాతి !! భౌగోళికం !! లింగం !! కాలం
 
|-
 
| కుదురు/మొదలు వర్గం || '''రచయితలు''' || '''తెలుగువారు''' || '''భారతీయులు''' || '''మహిళలు''' || '''20వ శతాబ్దపు వ్యక్తులు'''
 
|-
 
| ఉపమితి/లోతు వర్గం || ''ప్రక్రియ'': నవలా రచయితలు, గేయ రచయితలు <br> ''వాదం'': అభ్యుదయ రచయితలు, స్త్రీవాద రచయితలు <br>''భాష'': తెలుగు రచయితలు || తెలుగువారిలో హిందీ రచయితలు || ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, తమిళనాడు వ్యక్తులు || లింగమార్పిడి ద్వారా మహిళలైనవారు || -
 
|-
| '''''వృత్తి''''' || - || తెలుగువారైన పైలెట్లు || భారతీయ రచయితలు || రచయిత్రులు || 19వ శతాబ్దపు రచయితలు
|-
| '''''జాతి''''' || తెలుగు శాస్త్రవేత్తలు || - || అమెరికాలో తెలుగువారు<sup>1</sup> || తెలుగు మహిళలు || 16వ శతాబ్దపు తెలుగువారు
|-
| '''''భౌగోళికం'''''||భారతీయ రచయితలు || రష్యాలో తెలుగువారు<sup>1</sup> || - || భారతీయ మహిళలు || 11వ శతాబ్దపు భారతీయులు
|-
| '''''లింగం''''' || రచయిత్రులు || తెలుగు మహిళలు || భారతీయ మహిళలు || - || 17వ శతాబ్దపు మహిళలు
 
|}
 
<sup>1</sup> జాతి × భౌగోళికం అప్పుడు “తెలుగు భారతీయులు” అనే వర్గం తయారుచేయం. తెలుగువారందరూ దాదాపుగా భారతీయులే కాబట్టి, అది అనవసరం.
 
అంటే (పై పట్టిక ప్రకారం), “రచయితలు” అన్న వర్గానికి వెళ్తే ఈ క్రింది వర్గవృక్షాలు కనిపించాలి:
 
* రచనా ప్రక్రియ ప్రకారం వర్గాలు
 
* వాదం లేదా ఇతివృత్తి ప్రకారం రచయితల వర్గాలు
 
* భాషల వారీగా రచయితల వర్గాలు
 
* ప్రాంతాల వారీగా రచయితల వర్గాలు
 
* కాలం వారీగా రచయితల వర్గాలు
 
* జాతి వారిగా రచయితల వర్గాలు
 
* రచయిత్రుల వర్గం.
 
చిటారు వర్గాలను (ఒక వ్యక్తి కేటాయించే వర్గాలు) నిర్ణయించేందుకు ఏయే మితులన హెచ్చింపు, ప్రతీ మితికీ ఎంత లోతు అన్నది నిర్ణయించుకోవాలి. ఒక మితి లోతుగా ఉంటే, మరోటి ఎల్తుగా ఉంటాలి. ఉదాహరణకు, “గుంటూరు జిల్లా రచయితలు” అన్నప్పుడు భౌగోళిక మితిలో జిల్లా వరకూ వెళ్ళాం, వృత్తి మితిలో మొదలు దగ్గరే ఉన్నాం. కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం అదనంగా “తెలుగులో విజ్ఞానిక రచయితలు” అన్న వర్గంలో కూడా ఉండాలా!? ఈ వర్గం కేవలం వృత్తి మితి మాత్రమే (భాష×శైలి(జానర్)).
 
— [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 21:11, 30 మే 2019 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ".