వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ

ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్.. అని మార్చాలని ప్రతిపాదన

మార్చు
ఏదైనా ఒకపదం తెలుగుభాషలో కలిపిరాయలా, విడగొట్టిరాయాలా అనేదానిపై కొందరి రచయితల అభిప్రాయం తెలుసుకొనగా వారిలో ఒకరైన పాలకోడేటి సత్యనారాయణ తెలిపినఅభిప్రాయం ఇలా ఉంది. మనం ఉచ్చారణకు అనుగుణంగా పదరచన జరగాలి.అంటే మనం మాట్లాడేటప్పుడు వాటి మద్య విరామం ఉన్నట్లయితే అప్పడు దానిని రెండు పదాలుగా రాయాలి.విరామం లేకపోతే కలిపి రాయాలి. అంటే వ్యవహారిక భాషలో రాయాలి.రచనలు అన్నీ ఇలానా రాస్తారు అనే అభిప్రాయం వెలిబుచ్చారు.దానిని బట్టి ఆంధ్రప్రదేశ్ అనే పదం సరియైనదని నా అభిప్రాయం.ప్రభుత్వం లోగో కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉంది.ఇంకా కొన్ని ఉదాహరణలు:భారతదేశం, ఆంధ్రజ్వోతి, నీటిమట్టం, ఇరుగుపొరుగు, అటవీశాఖ, ముఖ్యనేతలు, గృహనిర్మాణం మొదలగునవి.--యర్రా రామారావు (చర్చ) 06:51, 25 మే 2019 (UTC)Reply
@యర్రా రామారావు: ప్రభుత్వ లోగోలో "ఆంధ్రప్రదేశ్" అని ఉంది అంటే ఇక దాన్నే వాడాలనేది నా అభిప్రాయం. ఇప్పటి దాకా నేను "ఆంధ్రప్రదేశ్" అని ఉన్న వర్గాలను "ఆంధ్ర ప్రదేశ్" అని మార్చాను. ఇప్పుడు వాటిని తిరిగి మార్చాలా!!?__చదువరి (చర్చరచనలు) 01:08, 27 మే 2019 (UTC)Reply
చదువరి గారూ ప్రభుత్వ లోగోలో "ఆంధ్రప్రదేశ్" అని ఉంది అంటే ఇక దాన్నే వాడాలనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.వికీపీడియా శైలి అంతా ఒకేరకంగా ఉంటే మంచిదని నాఅభిప్రాయం.దానిని దృష్టిలో పెట్టుకుని వర్గాలు కూడా ఆంధ్రప్రదేశ్ అని మార్చగలరు. వీలుంటే ఆంధ్ర ప్రదేశ్ ----- అనే వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ ---- గా దారి మార్పు చేయవచ్చు అనుకుంటున్నాను.అంతేగాదు వ్యాసాలలో పదాలు కూడా మున్ముందు మనం మార్పు చేయవలసిఉంది.--యర్రా రామారావు (చర్చ) 08:32, 27 మే 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, వ్యక్తులకు సంబంధించిన వర్గాలన్నిటినీ ఆంధ్ర ప్రదేశ్.. నుండి ఆంధ్రప్రదేశ్.. కు మార్చడం అయిపోయింది. ఎక్కడైనా నేను మిస్సై ఉంటే చెప్పండి మారుస్తాను. __చదువరి (చర్చరచనలు) 01:08, 19 జూలై 2019 (UTC)Reply
అలాగే చదువరి గారు.--యర్రా రామారావు (చర్చ) 01:45, 19 జూలై 2019 (UTC)Reply

అతిదగ్గర సంబంధమున్న (ప్ర)వృత్తి వర్గాలపై చర్చ

మార్చు
  • కవులు-రచయితలు: కవిత్వం రాసేవారిని కవి అనీ, వచనం రాసేవారిని రచయితలు అని గత శతాబ్ది నుంచి సాహిత్యపరంగా వాడుక. చాలామంది కవులూ రచయితలే. ఉదాహరణకు విశ్వనాథ సత్యనారాయణ నవలలు రాసి రచయిత అనిపించుకున్నారు, కవిత్వం చెప్పి కవీ అనిపించుకున్నారు. శ్రీశ్రీ కవిగానే బాగా పరిచయం అయినా వచనం రాసిన రచయిత కూడా. ఇలా ఎందరెందరో. అలానే కవిత్వం అని పేరుపెట్టి జన్మానికి ఏమీ రాయని రచయిత చలం వచనంలో ఎంతో కవిత్వం ఉంటుంది. ఇప్పుడు వీరిని ఫలానా జిల్లాకు చెందిన కవులు, ఫలానా జిల్లాకు చెందిన రచయితలు, తెలుగు కవులు, తెలుగు రచయితలు అని నాలుగు వర్గాల్లోనూ చేర్చాలా? రచయిత అంటే కవిత్వం రాసేవాడు కాదని కాదు కాబట్టి రచయితలు అన్న ఒక్కదాన్నే ఉంచుదామా? ఏమిటి నిర్ణయం?
  • మంత్రి-మాజీ మంత్రి: మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు తరచు మాజీలు అవుతూ ఉంటారు. తిరిగి తాజాలూ అవుతారు. ఉదాహరణకు గతంలో పలుమార్లు మంత్రిపదవి పొందిన బొత్స సత్యనారాయణ గత నాలుగైదేళ్ళుగా మాజీ మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మంత్రిపదవి రావచ్చు. దీనికి ఏం చేయాలి. మంత్రిపదవి ఉన్నన్నాళ్లూ మంత్రులనీ, పోయాకా మాజీ మంత్రి అని, మళ్ళీ పదవి వచ్చాకా మంత్రి అని మారుద్దామా? లేక ఆంగ్లంలో పద్ధతిలో మంత్రులు ఉంచేద్దామా? ఒకవేళ అలా మంత్రులు ఉంచేస్తే తెలుగులో ప్రస్తుత మంత్రులు అని అర్థం వచ్చి పాఠకుడిని తికమక పెడుతుందా?

ఈ అంశాలపై తోటి సభ్యుల అభిప్రాయాలు, చర్చ కోసం కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:02, 26 మే 2019 (UTC)Reply

@Pavan santhosh.s: కవులు, రచయితలు అని ప్రస్తుత అర్థంలోనే విడిగా ఉంచాలని నా అభిప్రాయం.
పోతే.., మాజీ మంత్రి అనేది అక్కర్లేదు అని నా ఉద్దేశం. కారణాలు: 1. పైన చూపిన ఉదాహరణలోలాగా వర్గాలను మారుస్తూండాలి. బోల్డంత నిర్వహణ. తెవికీకి అది కుదరదు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు అనే వర్గంలో మాజీలు కూడా ఉంటారు అని స్ఫురిస్తూండకపోతే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు అనో ఆంధ్ర ప్రదేశ్‌లో పని చేసిన మంత్రులు అనో మారిస్తే సరి. __చదువరి (చర్చరచనలు) 01:15, 27 మే 2019 (UTC)Reply

మహిళలకు ప్రత్యేక వర్గాలు

మార్చు

@రవిచంద్ర:, @Pavan santhosh.s:, @యర్రా రామారావు:, @Pranayraj1985: మహిళలకు ప్రత్యేకించి వర్గాలుండాలా అనే చర్చ జరిగింది రచ్చబండలో. ఆ చర్చను ఇక్కడ చేరుస్తూ.., కడాన నా అభిప్రాయం కూడా రాస్తున్నాను. రచ్చబండలో జరిగిన చర్చ:

వ్యక్తుల వర్గాల్లో లింగ వివరణ ఉండాలా?

వ్యక్తుల పేజీలను వివిధ వర్గాల్లోకి చేర్చేటపుడు వారి లింగాన్ని బట్టి వర్గీకరించాలా అనే సందేహం వచ్చింది, నాకు. అంటే గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం లోకి ఆడ మగ అందరినీ చేర్చవచ్చా, లేక స్త్రీలకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు /గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమర యోధులు అని వేరే వర్గం ఉండాలా? రచయితలు/రచయిత్రులు, నటులు/మహిళా నటులు, ఉపాధ్యాయులు/ఉపాధ్యాయురాళ్ళు (మహిళా ఉపాధ్యాయులు) - ఇలా లింగ విచక్షణ (వివక్ష కాదు) చూపించాలా? అలా విడివిడిగా వర్గాలు ఈసరికే ఉన్నాయి. అయినా నాకో సందేహం వాడుకరుల స్పందన కోసం చూస్తాను. __చదువరి (చర్చరచనలు) 07:22, 17 మే 2019 (UTC)Reply

వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అని నా అభిప్రాయం. కానీ మనం ఇదివరకే ఇలాంటి వర్గాలు సృష్టించేసి ఉన్నాము. కాబట్టి దానినే అనుసరిస్తే మంచిదేమో. లేకపోతే ఉన్న వర్గాలన్నీ దారి మళ్ళించాలి. దీనికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 11:18, 17 మే 2019 (UTC)Reply
వర్గాలు ఉన్నవి వర్గీకరించడానికి కదా. స్వాతంత్ర్య సమరయోధులు, గుంటూరు జిల్లా వారు అన్నవి రెండూ ఎలాగైతే గుర్తింపులో, మహిళలు అన్నదీ అలానే మరో ముఖ్యమైన గుర్తింపు కాబట్టి ఉండాలని నా ఉద్దేశం. ఐతే ప్రత్యేకించి గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమరయోధులు అన్న వర్గీకరణ కాకుండా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అన్న వర్గమూ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మహిళా స్వాతంత్ర్య సమర యోధులన్న పెద్ద వర్గమూ రెంటినీ కలిపి వారి వారి పేజీల్లో పెడితే బావుంటుంది. దీనికి నేను ఉదాహరణ ఆంగ్ల వికీ నుంచి తీసుకున్నాను. మణిబెన్ పటేల్ ఆంగ్ల వికీ వ్యాసంలో en:Category:Women Indian independence activists. en:Category:Indian independence activists from Gujarat అన్న రెండు వర్గాలూ ఉండడం ఒక ఉదాహరణ. --పవన్ సంతోష్ (చర్చ) 12:20, 17 మే 2019 (UTC)Reply
వర్గాల పేర్లలో లింగ విచక్షణ అవసరం లేదు అనే అబిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 02:42, 19 మే 2019 (UTC)Reply
ఆయా రంగాల ఉన్న మహిళల వ్యాసాలను గుర్తించడానికి వర్గాల్లో లింగ వివరణ ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:41, 19 మే 2019 (UTC)Reply

ఇక ఇక్కడి నుండి చర్చ కొనసాగింపు

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ కొంత (చాలా కొంతే!) చేసాక, నా అభిప్రాయం ఇలా ఉంది: మహిళలకు ప్రత్యేకించి వర్గాలుంటేనే మంచిది. ఎందుకంటే-

  • మహిళలను ప్రత్యేకంగా చూట్టం సర్వ వ్యాప్తంగా ఉంది. రేపెప్పుడైనా మహిళల్లో స్వాతంత్ర్య సమర యోధులెందరున్నారు, ఎవరు వాళ్ళు? అనే ప్రశ్న వేసుకుంటే వికీలో గభుక్కున సమాధానం దొరకదు. మహిళా స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం ఉంటే వీజీ!
  • రవిచంద్ర గారు చెప్పినట్టు మనకు ఈసరికే కొన్ని మహిళా వర్గాలున్నాయి. వాటినే కొనసాగిస్తే సరి.

ఈ మహిళా వర్గాలను ప్రత్యేక వర్గవృక్షంగా చూపాలని నా తలంపు. __చదువరి (చర్చరచనలు) 04:38, 28 మే 2019 (UTC)Reply

మహిళల వర్గవృక్షం నమూనాను కింద చూడవచ్చు. ఈ వర్గవృక్షంలోని ఏదైనా వర్గం అది ఉన్న కొమ్మలో ఒకే ఒక్క మాతృవర్గం లోకి వచ్చేలా చూసాను. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 05:36, 28 మే 2019 (UTC)Reply

 

వర్గీకరణ విదానం (విస్తరణ)

మార్చు

చర్చనంతా చదివి ఈ వర్గీకరణకు ప్రాతిపదికను విస్తరిస్తే బాగుండుననిపించింది. స్థూలంగా 5 మితులు (డైమెన్షన్లు) అనుకోవచ్చు. మితులకు లోతు కూడా ఉంటుంది.

  • వృత్తి/ప్రవృత్తి/వ్యాపకం: రచయితలు, శాస్త్రవేత్తలు. రచయిలకు సంబంధించినంత వరకూ రచనా ప్రక్రియ, వాదం అనేవి ఉపమితులు అవుతాయి. ఉదా॥ నవలా రచయితలు, స్త్రీవాద రచయితలు. శాస్త్రవేత్తలకు వారి రంగం ఉపమితి. ఉదా॥ అణు శాస్త్రవేత్తలు, జన్యు శాస్త్రవేత్తలు.
  • భౌగోళికం: జాతీయం → ప్రాంతీయం: భారతీయులు, అమెరికన్లు, యూరోపియన్లు. ఇక్కడ లోతు ఖండం, దేశం, రాష్ట్రం, జిల్లా, వంటివి. సందర్భాన్ని బట్టి, మనక్కావలసిన లోతుకే వెళ్తాం. “తెనాలి వ్యక్తులు” వర్గం ఉండొచ్చు కానీ, “బ్రూక్లిన్ వ్యక్తులు” అనే వర్గం మన తెలుగు వికీలో అనవసరం రాకపోవచ్చు.
  • జాతి: తెలుగువారు, తమిళులు, ఆంగ్లేయులు.
  • లింగం: మహిళలు.
  • కాలం: 19వ శతాబ్దపు వ్యక్తులు
  • మతం: హిందువులు, క్రైస్తవులు. వద్దులెండి.

ప్రతీ మితికీ తతిమా మితులను, ఉపమితులను జోడించి ఉపవర్గాలను తయారు చేయవచ్చు:

వృత్తి జాతి భౌగోళికం లింగం కాలం
కుదురు/మొదలు వర్గం రచయితలు తెలుగువారు భారతీయులు మహిళలు 20వ శతాబ్దపు వ్యక్తులు
ఉపమితి/లోతు వర్గం ప్రక్రియ: నవలా రచయితలు, గేయ రచయితలు
వాదం: అభ్యుదయ రచయితలు, స్త్రీవాద రచయితలు
భాష: తెలుగు రచయితలు
తెలుగువారిలో హిందీ రచయితలు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, తమిళనాడు వ్యక్తులు లింగమార్పిడి ద్వారా మహిళలైనవారు -
వృత్తి - తెలుగువారైన పైలెట్లు భారతీయ రచయితలు రచయిత్రులు 19వ శతాబ్దపు రచయితలు
జాతి తెలుగు శాస్త్రవేత్తలు - అమెరికాలో తెలుగువారు1 తెలుగు మహిళలు 16వ శతాబ్దపు తెలుగువారు
భౌగోళికం భారతీయ రచయితలు రష్యాలో తెలుగువారు1 - భారతీయ మహిళలు 11వ శతాబ్దపు భారతీయులు
లింగం రచయిత్రులు తెలుగు మహిళలు భారతీయ మహిళలు - 17వ శతాబ్దపు మహిళలు

1 జాతి × భౌగోళికం అప్పుడు “తెలుగు భారతీయులు” అనే వర్గం తయారుచేయం. తెలుగువారందరూ దాదాపుగా భారతీయులే కాబట్టి, అది అనవసరం.

అంటే (పై పట్టిక ప్రకారం), “రచయితలు” అన్న వర్గానికి వెళ్తే ఈ క్రింది వర్గవృక్షాలు కనిపించాలి:

  • రచనా ప్రక్రియ ప్రకారం వర్గాలు
  • వాదం లేదా ఇతివృత్తి ప్రకారం రచయితల వర్గాలు
  • భాషల వారీగా రచయితల వర్గాలు
  • ప్రాంతాల వారీగా రచయితల వర్గాలు
  • కాలం వారీగా రచయితల వర్గాలు
  • జాతి వారిగా రచయితల వర్గాలు
  • రచయిత్రుల వర్గం.

చిటారు వర్గాలను (ఒక వ్యక్తి కేటాయించే వర్గాలు) నిర్ణయించేందుకు ఏయే మితులన హెచ్చింపు, ప్రతీ మితికీ ఎంత లోతు అన్నది నిర్ణయించుకోవాలి. ఒక మితి లోతుగా ఉంటే, మరోటి ఎల్తుగా ఉంటాలి. ఉదాహరణకు, “గుంటూరు జిల్లా రచయితలు” అన్నప్పుడు భౌగోళిక మితిలో జిల్లా వరకూ వెళ్ళాం, వృత్తి మితిలో మొదలు దగ్గరే ఉన్నాం. కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం అదనంగా “తెలుగులో విజ్ఞానిక రచయితలు” అన్న వర్గంలో కూడా ఉండాలా!? ఈ వర్గం కేవలం వృత్తి మితి మాత్రమే (భాష×శైలి(జానర్)).

వీవెన్ (చర్చ) 21:11, 30 మే 2019 (UTC)Reply

వీవెన్ గారూ, చక్కటి ఆలోచన లిచ్చారు. "కాలానుసారంగా" తప్ప వర్గాల కూర్పు ప్రస్తుతం చాలావరకు ఇలాగే సాగుతున్నట్టు ఉంది. గుంటూరు జిల్లా రచయితలు అనే వర్గపు లోతు గుంటూరు జిల్లా నాటక రచయితలు అనేంత వరకే ఉందిగానీ, మరింత లోతుగా గుంటూరు జిల్లా వైజ్ఞానిక రచయితలు, గుంటూరు జిల్లా మనో వైజ్ఞానిక రచయితలు ఇలా లేదు. ఇకపోతే భౌగోళికంగా జిల్లా స్థాయి నుండి పైకి వెళ్ళాం, ఇంకా కిందకు నగరం/పట్టణం స్థాయికి వెళ్ళలేదు. అది తరువాతైనా వెళ్ళవచ్చు ననుకుంటాను. లింగవిచక్షణ తోటే వర్గీకరణ జరుగుతోంది. కాలానుసారంగా వర్గీకరణ జరగడం లేదు. అది తరువాత చెయ్యాలి. ప్రస్తుత వర్గీకరణ ఎలా ఉందో ఓసారి చూడండి. AWB ద్వారా చెయ్యదగ్గ మార్పులు కొన్నున్నాయి, వాటిని ప్రస్తుతం చెయ్యడం లేదు. ఉదాహరణకు గుంటూరు జిల్లా మహిళలు, ఆంధ్ర ప్రదేశ్ మహిళలు, ఆంధ్ర ప్రదేశ్ --> ఆంధ్రప్రదేశ్ వగైరాలు. __చదువరి (చర్చరచనలు) 09:06, 31 మే 2019 (UTC)Reply

మధ్యంతర సమీక్ష

మార్చు

ప్రస్తుతానికి 13 జిల్లాలకు చెందిన వ్యక్తుల పేజీలను సంబంధిత భౌగోళిక వర్గాల్లోకి చేర్చడం దాదాపు పూర్తైంది. (కొత్తగా కొన్ని వర్గాలను సృష్టించాలి - జీవించిన కాలాలను బట్టి, వృత్తులను బట్టి, వ్యక్తుల లక్షణాలను బట్టి, విశేషాలను బట్టీ,.. వగైరాలు. అవి తరువాత చేద్దాం.) ప్రస్తుతం ఆయా వర్గాలను సముచితమైన మాతృవర్గాల్లోకి చేర్చడం వంటి పనులు చెయ్యాల్సి ఉంది. నాకు తోచిన పనులు ఇవి:

  1. ఆంధ్ర ప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గా మార్చడం - దాదాపు 1386 వర్గాలను అలా మార్చాలి. ఇది పెద్ద పని; AWB తో చేద్దాం. రామారావు గారు, నేనూ ఈ పనికి సమ్మతించాం. ఇతర సభ్యులు దీన్ని వ్యతిరేకించకపోతే మొదలు పెడదాం.
  2. ఆంధ్ర ప్రదేశ్ మహిళలు అంతా ఒక వర్గంలోకి చేరినట్టే. ఇక జిల్లాల వారీగా మహిళలను వర్గాల్లోకి లోకి చేర్చాలి - వర్గం:గుంటూరు జిల్లా మహిళలు లాగ. దీన్ని కూడా AWB తో చెయ్యవచ్చు.
  3. కొన్ని వ్యక్తుల పేజీలు గతంలో ఏ జిల్లాలోకీ చేరి ఉండలేదు. అలాంటి పేజీలు ప్రస్తుత క్రమబద్ధీకరణ లోకి రాలేదు. వాటిని వెతికి పట్టుకుని వాటిని కూడా క్రమబద్ధీకరించాలి.
  4. కొన్ని ప్రత్యేక వర్గాలను సృష్టించాల్సి ఉంది. నాకు తోచిన వాటిని నేను సృష్టించాను. ఉదాహరణకు- కలం పేరుతో ప్రసిద్ధులైనవారు, విధి నిర్వహణలో మరణించినవారు, పేరు మార్చుకున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు.. ఇలాగ. ఇలంతివి మరికొన్ని సృష్టించాలి. వాడుకరుల సలహాలు కావాలి.
  5. కళాకారుల వర్గాలన్నిటినీ, రచయితల పేజీలన్నిటినీ, సినిమా వ్యక్తుల పేజీలన్నిటినీ,.. వాటివాటి సామాన్య వర్గం లోకి చేర్చాలి - ఆంధ్ర ప్రదేశ్ కళాకారులు, కడప జిల్లా కళాకారులు, ఆంధ్ర ప్రదేశ్ సినిమా వ్యక్తులు.. ఇలాగ.
  6. రాయలసీమ వ్యక్తులు, రాయలసీమ కళాకారులు వంటి ప్రాంతాల వారీ వర్గాలను సరి చేయాలి - పేజీలను వీటిలోంచి తీసేసి, కేవలం వర్గాలను మాత్రమే చేర్చాలి.
  7. ఆంధ్ర ప్రదేశ్ కు పైస్థాయి వర్గాలను సరి చేయాలి -ఓక ఉదాహరణ: భారతీయ కళాకారులు, భారత కళాకారులు, భారత దేశ కళాకారులు, భారతదేశ కళాకారులు వంటి వాటిని ఒకే పద్ధతిలో ఉండేలా మార్చాలి.
  8. తరువాత తెలంగాణ వ్యక్తుల పేజీలను క్రమబద్ధీకరించాలి. అక్కడ కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. కొన్ని కొత్త వర్గాలను సృష్టించే అవసరం ఉంది.
  9. ఇవీ, సభ్యులు సూచించే ఇతర సూచనలూ అన్నిటినీ అమలు చేసాక, వర్గీకరణ సూత్రాలతో ఒక సమగ్ర సూచనల పేజీని తయారు చెయ్యాలి. ఇది భవిష్యత్తు వర్గీకరణకు మారగదర్శిని లాగా ఉండాలి.

పేజీల్లో చేసే మార్పులు తప్పించి మిగతావన్నీ (వర్గాల్లో చేసే మార్పులు) కూడా AWB తో చేసెయ్యవచ్చు.

ఇంకా చెయ్యాల్సిన పనుల గురించి, ఇప్పటివరకు చేసిన పని గురించీ వాడుకరుల సూచనలను కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:14, 7 జూన్ 2019 (UTC)Reply

చదువరి గారూ అస్తవ్యస్తంగా ఉన్న వ్యక్తుల వర్గాలను నిర్విరామకృషితో ఏకధాటిగా ఒక తాటి మీదకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:13, 8 జూన్ 2019 (UTC)Reply

చెయ్యాల్సిన పనులు, సూచనలు

మార్చు
  • వివిధ విభాగాలకు చెందిన మిగిలిన వర్గాలు కూడా క్రమబద్దీకరించవలసి ఉంది. (పుణ్యక్షేత్రాలు, ఆనకట్టలు, మొదలగునవి)
  • తెలంగాణ రాష్ట్రంలోని వ్యాసం పేజీలు జిల్లాల పునర్య్వస్థీకరణ ప్రకారం అనగా వ్యాసంలోని జన్మ సమాచారంలో పాతజిల్లా పేరు ఉంటుంది.ఆ గ్రామం, పట్టణం ఏ జిల్లాకు చెందిందో ఆ ప్రకారం సవరించి, వర్గీకరణ సరిచేయవలసిఉంది.
  • ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చినందున, మరలా కొన్ని జిల్లాల వర్గాలు కొత్తగా సృష్టించి వర్గీకరణ చేయవలసిఉంది.నిర్ణయం తరువాత ఒకేసారి చేపట్టవచ్చు.
  • కొన్ని వర్గాలు అమెరికా, కొన్ని వర్గాలు అమెరికన్ ముందు పదంతో మొదలైన వర్గాలు ఉన్నవి.వీటిని ఏకరీతి వర్గంగా మార్పు చేయవలసిఉంది.
  • ఈ దిగువ వ్యాసాలు ఏ వర్గంలోకి రాలేదు.వీటిని పరిశీలించి ఇందులో తొలగించవలసినవి తొలగించి మిగిలినవి సంబందిత వర్గాలలోకి చేర్చవలసిఉంది

పై సూచనలు, చెయ్యాల్సిన పనులు ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:13, 8 జూన్ 2019 (UTC)Reply

యర్రా రామారావు గారూ, మంచి సూచనలు. మొదటి మూడు సూచనలు ప్రస్తుత ప్రాజెక్టు పరిధి లోకి రావు. (రెండోదాన్ని తెలంగాణ ప్రాజెక్టు మొదలు పెట్టినపుడు చూద్దాం.) __చదువరి (చర్చరచనలు) 06:18, 8 జూన్ 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, మీరు సూచించిన పనుల్లో కొన్ని అయ్యాయి. చివరి పాయింటులో చాలావరకు అయ్యాయి.వెంకటరమణ గారు కూడా ఈ పనిలో పాలుపంచుకున్నారు. ఏకవాక్య వ్యాసం ఒకటుంది - దాని సంగతి చూడాలి. "నల్లపాటి" వ్యాసాల సంగతి చూడాలి. హిందీ చలన చిత్ర నటుల పని అయింది. తెలంగాణ వ్యక్తుల పనులు మొదలు పెట్టాను. వర్గం:ఖమ్మం జిల్లా వ్యక్తులు వర్గాన్ని ఒకసారి పరిశీలించి మీ సూచనలు చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 04:25, 10 జూన్ 2019 (UTC)Reply
చదువరి గారూ ----- జిల్లా వ్యక్తులు వర్గానికి ప్రాతిపదిక జన్మించిన ప్రదేశమా, జీవించిన ప్రదేశమా, నిర్యాణం చెందిన ప్రదేశమా సందేహం తీర్చగలరు.నాకు తెలిసినంతవరకు జన్మించిన ప్రదేశం అనుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:12, 11 జూన్ 2019 (UTC)Reply
చదువరి గారూ వర్గం:ఖమ్మం జిల్లా వ్యక్తులు వర్గాన్ని పరిశీలించగా వ్యాసంలో జన్మించిన గ్రామం ప్రాతిపదికగా తీసుకోగా తెలంగాణకు చెందిన ఈ దిగువ వ్యాసాలు పునర్య్వస్థీకరణ ముందున్న పాత జిల్లాల వర్గాలు ఉన్నాయి.ఈ వ్యాసాలన్నిటినీ నేను జన్మించిన గ్రామాన్నిబట్టి జిల్లా,మండలం వివరాలు వ్యాసాలలో సవరించాను.దాని ప్రకారం వర్గీకరణ మార్పులు చేయవలసిఉంది.--యర్రా రామారావు (చర్చ) 04:10, 11 జూన్ 2019 (UTC)Reply
చదువరి గారూ ఏ వర్గంలోనికి రాని మరికొన్ని ఈ దిగువ వ్యాసాలు పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:12, 11 జూన్ 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, ఏ జిల్లాకు చెందిన వారనేది, ఆ వ్యాసంలో ఇచ్చినదాన్ని చూసి ఆ ప్రకారం వర్గీకరించాను. వాటిని మీరు మార్చారు. వర్గాలను కూడా తదనుగుణంగా మార్చడం తరవాత చూద్దాం. ఇక, ఏ వర్గాల్లోకీ చేరని పేజీల గురించి.. అవి ప్రత్యేక పేజీల్లో ఎలాగూ దొరుకుతాయిలెండి. అవి తరువాత చూద్దాం. పోతే.. ఏ జిల్లాకు చెందినవారనేది - పుట్టిన ప్రదేశాన్ని బట్టే చేస్తున్నాను. అయితే.. వెంటనే వేరే జిల్లాకి కుటుంబంతో సహా తరలిపోయిన వారు ఉన్నారు. ఆ పేజీలు ఆ జిల్లాలోకే వస్తాయి. ఎన్నికైన ప్రతినిధులు ఏ జిల్లా నుండి ఎన్నికైతే ఆ జిల్లాలోకే చేరుతారు. __చదువరి (చర్చరచనలు) 06:35, 11 జూన్ 2019 (UTC)Reply
చదువరి గారూ ... అలాగే.--యర్రా రామారావు (చర్చ) 14:30, 11 జూన్ 2019 (UTC)Reply

తెలంగాణ వ్యక్తుల పేజీల వర్గాల క్రమబద్ధీకరణ - కొన్ని ప్రత్యేకతలు

మార్చు

తెలంగాణ వ్యక్తుల పేజీలను వర్గీకరించడంలో కొన్ని ప్రత్యేక అంశాలను పరిగణన లోకి తిసుకోవాల్సి ఉంది. వాటిలో నాకు తోచినవి ఇక్కడ రాస్తున్నాను. పరిశీలించగలరు:

  1. 10 జిల్లాలు 32 జిల్లాలయ్యాయి. తెలిసినంత మేరకు వ్యక్తిని ఆయా కొత్త జిల్లాల వర్గాల్లోకి చేర్చాలి. తెలియని సందర్భాల్లో పాత జిల్లా వర్గంలో ఉంచడం ఎలాగూ తప్పదు.
  2. తెలంగాణ శాసన సభ్యులు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైనవారైతే ఒకరకంగాను, తెలంగాణ ఏర్పాటైన తరువాత ఎన్నికైతే మరో రకంగానూ వర్గీకరించాలి. నమూనా కోసం.. ఆ వర్గాలు ఇలా ఉంటాయి:
    1. సంయుక్త ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినవైతే - ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులు, ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు, ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్) కు చెందిన రాజ్యసభ సభ్యులు, ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్) కు చెందిన శాసనమండలి సభ్యులు, ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్) కు చెందిన కేంద్ర మంత్రులు, ఖమ్మం జిల్లాకు చెందిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు.. వగైరా. ఈ వర్గాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ మాతృవర్గం లోకి చేరుతాయి.
    2. తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నికైన వారైతే - ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు, ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రులు, ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు.. వగైరా. ఈ వర్గాలన్నీ తెలంగాణ మాతృవర్గం లోకి చేరుతాయి. ఈ వర్గీకరణ అంతా ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తుల పేజీలకు జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది.
  3. స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం భారత స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గ వృక్షంలోకి వాడుతూ వచ్చాం. తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వ్యక్తుల పేజీలు కొన్నిటిని ఈ వర్గంలోకి చేర్చారు. వీటిని - తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు అనే వర్గాల్లోకి చేర్చాను. కొన్ని పేజీలు ముందే ఈ వర్గాల్లోకి చేర్చి ఉన్నాయి.
  4. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రెండుగా తీసుకుని (మొదటిది 1969 లో జరిగినది, రెండవది 2014 వరకూ జరిగినది) ఆ విధంగా వాటిలో పాల్గొన్న వారిని వర్గీకరించాను - వర్గం:మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, వర్గం:రెండవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు
  5. కొత్త జిల్లాల పేర్లను వర్గాల్లో రెండు విధాలుగా రాసారు - యాదాద్రి భువనగిరి జిల్లా వ్యక్తులు, యాదాద్రి - భువనగిరి జిల్లా వ్యక్తులు - ఇలాగ. వీటిలో మొదటి రూపాన్నే తీసుకోవాలని నా ఉద్దేశం. మధ్యలో హైఫన్ ఉంచాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిని వ్యాసాల్లోనూ పాటించాలని నా అభిప్రాయం.

మిగతా అంశాలన్నీ ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తుల వర్గాల లాగే చేస్తున్నాను. పరిశీలించి, మీమీ అభిప్రాయాలు, సూచనలూ తెలుపగలరు.__చదువరి (చర్చరచనలు) 14:21, 9 జూన్ 2019 (UTC)Reply

మరొకటి - అజంత రూపం, హలంత రూపం - ఈ రెంటిలో ఏది తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. నా అభిప్రాయం అజంత రూపమే (వాడుకలో ఉంటే) సరైనది-ఎక్కడైనా ప్రత్యేకంగా ప్రస్తావించితే తప్ప. ఉదాహరణకు "ఆదిలాబాదు జిల్లా", "ఆదిలాబాద్ జిల్లా" - ఈ రెంటిలో "ఆదిలాబాదు జిల్లా" యే సముచితమని నా అభిప్రాయం. కరీంనగరు అనే అజంత రూపం వాడుకలో లేదు కాబట్టి కరీంనగర్ అనే వాడాలి అని నా అభిప్రాయం. వాడుకరుల సూచనలు, అభిప్రాయాలు కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 14:30, 9 జూన్ 2019 (UTC)Reply
చదువరి గారు సూచించినట్లు రెండు వాడుకలో ఉన్న పదాలకు అజంత రూపం పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 11:39, 14 జూన్ 2019 (UTC)Reply
1) తెలంగాణ 10 జిల్లాలు 33 జిల్లాలయ్యాయి. జిల్లాపేరు తెలియని వ్యక్తులను పాత జిల్లాలలో కాకుండా "ఏ జిల్లా వారో తెలియని వ్యక్తులు" వర్గంలో చేర్చడం మంచిది. ఎందుకంటే ఆ జిల్లాకు కాని వ్యక్తులను కూడా ఆ జిల్లావారుగా పాఠకులు అర్థం చేసుకొనే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా జిల్లాపేరు మార్పు చేసే తెవికీపీడియన్లకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. లేకుంటే ఆ తప్పుడు వర్గాలు అలాగే ఉండిపోతాయి. పలు మండలాలు ఉమ్మడి జిల్లాలలో కాకుండా ప్రత్యేక జిల్లాలలో భాగమయ్యాయి. ఉదా: మహబూబ్‌నగర్ జిల్లా 5 ముక్కలు కావడమే కాకుండా ఈశాన్యంలోని 7 మండలాలు రంగారెడ్డి జిల్లాలో, వాయువ్యంలోని 3 మండలాలు వికారాబాదు జిల్లాలో చేర్చబడ్డాయి. ఈ మండలాలకు చెందిన వ్యక్తులకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లోని ఏ ఐదు జిల్లాలతోనూ సంబంధం ఉండదు.
2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నికైనా, తెలంగాణ అవతరణ తర్వాత ఎన్నికైనా తెలంగాణ వ్యక్తులను ఒకే విధంగా పరిగణించాలి. తెలంగాణ అవతరణ తర్వాత పుట్టిన వారికే తెలంగాణ వ్యక్తులు అనడం లేదుకదా! స్వాతంత్ర్యానంతరం పుట్టివవారే భారతీయులు అంతకుక్రితం పుట్టినవారు బ్రిటీష్ ఇండియన్లు అని వర్గాలు పెట్టడం లేదుకదా!
3) తెలంగాణ విమోచనోద్యమం కూడా స్వాతంత్ర్యసమరం లాంటిదే. విమోచనోద్యమంలో పాల్గొన్న సమరయోధులను భారతప్రభుత్వం కూడా సమరయోధులుగా గుర్తించి తామ్రపత్రాలు అందజేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణలో కొందరు మినహా దాదాపు సమరయోధులందరూ విమోచనోద్యమకారులే. అప్పుడు మద్రాసురాష్ట్రంలో ఉన్న ఆంధ్రులు బ్రిటీష్ వారిపై ఏ విధంగానైతే స్వాతంత్ర్యం కోసం పోరాడారో అదేవిధంగా హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంత సమరయోధులు కూడా సెప్టెంబరు 1948 వరకు భారత యూనియన్‌లో విలీనం కోసం పోరాడారు. తెలంగాణ సాయుధపోరాటయోధులు మాత్రం సమరయోధులు కారు. ఈ రెండు ఉద్యమాలు దాదాపు ఒకేసమయంలో నిజాంకు వ్యతిరేకంగానే జరిగిననూ వాటి లక్ష్యాలుమాత్రం వేర్వేరు. సాయుధపోరాటయోధులు (వారిలో అత్యధికులు కమ్యూనిస్టులు) భూమికోసం, భుక్తికోసం మాత్రమే రైతాంగం తరఫున పోరాడారు. వారు పోరాటయోధులే కాని స్వాతంత్ర్యసమరయోధులు కారు. కొందరుమాత్రం రెండింటిలో పాల్గొన్నారు.
4) తెలంగాణ ఉద్యమకారులను రెండుగా కాకుండా ఒకటిగానే చేయడం బాగుంటుంది. కాలంలో సంబంధం లేకుండా వారందరినీ తెలంగాణ ఉద్యమకారులుగానే పరిగణించడం జరగాలి. అయితే కేవలం "పాల్గొన్న" వారిని కాకుండా "పోరాడిన" వారినే వర్గంలోకి చేర్చాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:23, 12 జూన్ 2019 (UTC)Reply
సి. చంద్ర కాంత రావు గారూ,
1) ఫలానా వ్యక్తి నల్గొండ జిల్లాకు చెందినవారు అని వ్యాసంలో ఉందనుకుందాం. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక, ఆ వ్యక్తి నల్గొండకే చెందుతారో.., వేరే జిల్లాకు (ఉదా:సూర్యాపేట జిల్లా) చెందుతారో తెలియాలంటే వారు పుట్టిన ఊరు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందో చూస్తే తెలుస్తుంది. ఆ విధంగా ఆ పేజీని వర్గీకరించాలి. తెలియకపోతే మీరు చెప్పిన "ఏ జిల్లా వారో తెలియని వ్యక్తులు" అనే వర్గం లోకి చేర్చే ఆలోచన బాగుంది.
2) "తెలంగాణ అవతరణ తర్వాత పుట్టిన వారికే తెలంగాణ వ్యక్తులు అనడం లేదుకదా!" -అవును, అనం కదా! ఇప్పుడు నేను అలా అనలేదు కదా!!? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన ఒక పురుష శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడే అవుతాడు గాని తెలంగాణ శాసనసభ్యుడు కాడు. కాబట్టి ఆ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు అనే చెయ్యాలి. అంత మాత్రాన అతడు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయిపోడు, తెలంగాణ వ్యక్తే అవుతాడు. ఈ పేజీ తెలంగాణ వ్యక్తులు వర్గంలోకే చేరాలి, అలాగే చేరుతున్నాయి. ఉదాహరణకు చూడండి: వర్గం:ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యులు. మీరు చెప్పిన విధంగా వర్గీకరణ చెయ్యడం లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే అది పొరపాటే. అలాంటివి గమనిస్తే చూపించండి, సరిదిద్దుతాను.
3) విమోచనోద్యమకారులు, సాయుధపోరాటయోధులు ఇద్దరిలో ఎవరు స్వాతంత్ర్య సమర యోధులో తేలితే ఆ వర్గాన్ని (లేదా వర్గాలను) స్వాతంత్ర్యసమరయోధులు అనే వర్గంలోకి వేసేద్దాం, సరిపోద్ది.
4) "తెలంగాణ ఉద్యమకారులను రెండుగా కాకుండా ఒకటిగానే చేయడం బాగుంటుంది." - విడిగా ఉంటేనే బాగుంటుంది. ఆ రెండు వర్గాలనూ ఒక మాతృవర్గంలోకి వేసేద్దాం.
4అ) "పాల్గొన్న" వారెవరో "పోరాడిన" వారెవరో నాకు తెలవదు. కాబట్టి ఇకపై ఆ వర్గీకరణ నేను చెయ్యను. తెలిసిన వారెవరైనా ఆ పని చెయ్యాలని విజ్ఞప్తి.__చదువరి (చర్చరచనలు) 09:11, 16 జూన్ 2019 (UTC)Reply

దివ్యాంగుల వర్గం

మార్చు

అంధులు, చెవిటివారు, నత్తివారు, మూగవారు వంటి దివ్యాంగులను ఆ విధంగా వర్గీకరించాలని నా ఉద్దేశం. ఈ విషయమై వాడుకరుల అభిప్రాయాలను కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 10:43, 25 జూన్ 2019 (UTC)Reply

ప్రస్తుత కాలంలో అలా వారిని పిలవటాన్ని, అనటాన్ని ఆత్మ నూన్యతా భావంగా భావిస్తున్నారు.వారిని "ఫిజికల్లీ చాలెంజెడ్ పర్సన్స్" గా చాలా సెమినార్లలో వ్యవహరించుట జరుగుతుంది. అదే తెలుగులోకి అన్వయించుకుంటే అందరిని "శారీరకంగా సవాలు చేసిన వ్యక్తులు" అని చెప్పుకోవచ్చు. చెవిటి,మూగ వారిని బధిరులు అని కూడా అంటున్నారు.నత్తి వారినివేరే విధంగా అన్న సందర్బాలు నాకైతే ఏమీ తెలియుటలేదు. అందరిని "శారీరకంగా సవాలు చేసిన వ్యక్తులు" అని వర్గీకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 17:58, 25 జూన్ 2019 (UTC)Reply
అందర్నీ కలిపి వర్గం:దివ్యాంగులు అని చేరిస్తే సరిపోతుంది.--Rajasekhar1961 (చర్చ) 05:30, 26 జూన్ 2019 (UTC)Reply
Return to the project page "వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ".