కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వరంగల్లు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:వరంగల్లు జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
భాషా సవరణలు
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
కాసర్ల శ్యాం [[వరంగల్ జిల్లా]] [[హన్మకొండ]]<nowiki/>లోని బ్రాహ్మణవాడలో మధుసూదన్‌ రావు, మాధవి పుణ్య దంపతులకు రెండోవ సంతానంగా జన్మించారు తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు. దీంతో శ్యామ్‌కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయన లాగే నటుడు కావాలని [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]]<nowiki/>లో రంగస్థల విభాగంలో ఎంఫిల్ చదివాడు.
 
చిన్నతనం నుండే శ్యాం సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవాడు. అలా పాటలు పాడడం, రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు. అనేక వేదికలపై జానపదనృత్యాలు చేయడంతో పాటు, పాటలూ పాడాడు. [[వరంగల్ శంకర్]], సారంగపాణిల[[సారంగపాణి]]<nowiki/>ల బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా ఎదిగి వచ్చాడు.
 
సినిమాలకు రాకముందు కాసర్లశ్యాం వేలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకువచ్చాడు. సుమారు 50పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయన [[పాటలు]] రాశారు. “కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో..” అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే.
 
2003లో ప్రముఖ దర్శకురాలు [[బి. జయ|బి.జయ]] దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలకు సినిమాల్లోకి తీసుకోవడంతోపాటలతో పరిశ్రమలో గేయ రచయితగా మంచి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్‌ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో ''నీలపురి గాజుల ఓ నీలవేణి'' అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన [[పటాస్|పటాస్‌]] లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన ''[[లై (సినిమా)|లై]]'' చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట సరికొత్త వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
 
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత [[గీతాలు]] రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్‌ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్‌, [[రామ్ గోపాల్ వర్మ|రాంగోపాల్‌ వర్మతోవర్మ]]<nowiki/>తో [[రౌడీ (2014 సినిమా)|రౌడీ]], [[అనుక్షణం]] అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేశ్‌]] హీరోగా వచ్చిన [[బాబు బంగారం]], [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్|వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌]], కిక్‌.2, [[ప్రేమకథా చిత్రమ్|ప్రేమకథా చిత్రం]], గల్ఫ్‌ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాయడం విశేషంరాసాడు. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు.
 
==మూలాలు==
పంక్తి 58:
[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:వరంగల్లు పట్టణ జిల్లా సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:వరంగల్లు పట్టణ జిల్లా సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు