గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
అక్షర దోష సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
కాకతీయ రాజులలో గొప్ప చక్రవర్తి '''గణపతి దేవుడు''' కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు. 6 దశాబ్దాల పాటు [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్యాన్ని]] పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకముఏకం చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన మహనీయులలొవారిలో కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి, ముసునూరి కాపానీడు, శ్రీకృష్ణదేవరాయలు).
{{కాకతీయులు}}
దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.<ref>ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, 10వ ముద్రణ (1990) పేజీ 113</ref> సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్త్తియుక్తులుశక్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.<ref>[http://www.gloriousindia.com/history/kakatiya_dynasty.html www.gloriousindia.com/history/kakatiya dynasty]</ref>
 
==పాలనా విధానం==
కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామతరాజులుసామంతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో [[వ్యవసాయము]] మరియు వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులను ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని [[హన్మకొండ]] నుండి [[ఓరుగల్లు]]కు మార్చాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.
 
==రాజ్యవిస్తరణ==
"https://te.wikipedia.org/wiki/గణపతి_దేవుడు" నుండి వెలికితీశారు