శనగపిండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''శెనగపిండి''' అనేది శెనగపప్పును పిండి ఆడించగా వచ్చిన పదార్ధం. శెనగపప్పును బెంగాల్ పప్పు అని కూడా కొన్ని ప్రదేశాల్లో పిలుస్తారు. శెనగపిండి అనేది భారత వంటకాలలో అతి ముఖ్యమైన దినుసు. భారతీయ వంటల్లో ఎన్నో వంటలను శెనగపిండి లేకుండా చేయడం కుదరదు. కేవలం భారత వంటకాల్లోనే కాక, బంగ్లాదేశ్ వంటల్లోనూ, బర్మా వంటల్లోనూ, నేపాలీ, పాకిస్థానీ, శ్రీలంక వంటకాల్లో కూడా శెనగపిండి చాలా ముఖ్యమైన దినుసు. పచ్చి శెనగపప్పును కానీ వేయించిన శెనగపప్పును కానీ పిండి పట్టించుకుని శెనగపిండిని తయారు చేసుకోవచ్చు. పచ్చి శెనగపిండి కాస్త చేదుగా ఉంటుంది. అదే వేయించిన పప్పు ద్వారా వచ్చిన శెనగపిండి కమ్మగా, బాగుంటుంది.
 
== పోషక విలువలు ==
శెనగ పిండిలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి.,<ref name="Chickpea flour besan">{{cite web | author= | year= | title= Chickpea flour (besan) | work= Nutrition Data: Nutrition Facts and Calorie Counter |
url= http://www.nutritiondata.com/facts-C00001-01c2194.html | accessdate=2007-09-29}}</ref> మైదా, గోధుమ వంటి ఇతర పిండ్ల కన్నా శెనగ పిండిలో పీచు పదార్ధం ఎక్కువ. గ్లుటెన్ అనే ప్రొటీన్ల సమూహం ఈ పిండిలో అస్సలు ఉండదు. ఈ గ్లుటెన్ అనేది కాస్త అనారోగ్యకరమైన ప్రొటీన్. <ref>{{cite web|title=Grains and Flours Glossary: Besan |work=Celiac Sprue Association |url=http://www.csaceliacs.org/gluten_grains.php |accessdate=2007-09-29 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20071003140743/http://www.csaceliacs.org/gluten_grains.php |archivedate=2007-10-03 }}</ref> శెనగ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర ప్రొటీన్ల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.<ref name="Chickpea flour besan"/>
"https://te.wikipedia.org/wiki/శనగపిండి" నుండి వెలికితీశారు