జీ తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
 
''మీ ఇంటి వంట'', అనే వంట కార్యక్రమాం, 1000 ఎపిసోడ్లు ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అంతే కాక, మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చూడటంతో, టీఆర్పీ కూడా బాగా పెరిగింది. దీంతో మిగిలిన చానెల్స్ కూడా వంట కార్యక్రమాలను మొదలుపెట్టేంతగా ఈ కార్యక్రమం విజయవంతమైంది.
 
జీ తెలుగులో విజయవంతమైన మరో కార్యక్రమం ''మిడ్ నైట్ మసాలా''. ఈ కార్యక్రమంలో సినిమాల్లో వచ్చే పెద్దల సన్నివేశాలూ, పాటలు వేసేవారు. రాత్రి 12 గంటలకు ప్రసరమయ్యే ఈ కార్యక్రమానికి 2.0 టీఆర్పీ వచ్చింది. ఆ సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమాలకు వచ్చే టీఆర్పీ కన్నా ఇది ఎంతో ఎక్కువ. ఇప్పటికీ ఆ స్లాట్ లో ఏ తెలుగు షోకూ అంత టీఆర్పీ రాకపోవడం విశేషం. ఈ కార్యక్రమం 2007 డిసెంబరు - 2008 డీసెంబరు మధ్య ప్రసారమైంది. అయితే ఈ కార్యక్రమం చాలా రెచ్చగొట్టే విధంగా ఉందనీ, ఇంత పెద్దల కంటెంట్ సామాన్య టీవీలో రావడం మంచిది కాదని కొందరు చేసిన విమర్శల వల్ల ఆపేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జీ_తెలుగు" నుండి వెలికితీశారు