వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
 
== చర్చ ==
<!-- ఇక్కడి నుండి చర్చ మొదలు పెట్టండి. -->
===సి.చంద్రకాంతరావు అభిప్రాయాలు===
*సందేహానికి గూగుల్ సెర్చ్ చేయడం సరికాదని నా అభిప్రాయం. తెలుగులో ప్రామాణిక పుస్తకాలు, ప్రామాణిక పత్రికలే ముఖ్యం. వాటినే అనుసరించడం బాగుంటుంది. గూగుల్ సెర్చ్ చేస్తే పనికిరాని చెత్త కూడా వడపోతకు గురౌతుంది. అధికచోట్ల లేదా అధికమంది పొరపాట్లు చేసే మనమూ పొరపాటు చేయాలనీ లేదుకదా! నిజం చెప్పాలంటే మనమే ఇతరులకు (పత్రికలకు, మాధ్యమాలకు, రచయితలకు) మార్గదర్శకంగా ఉండాలి. ఫలితంలో తేడా భారీగా ఉంటే ఫర్వాలేదు కాని స్వల్పతేడా వచ్చినప్పుడు దేన్ని అనుసరించాలనేది కూడా ఇబ్బందే.
*ఇంగ్లీష్ స్పెల్లింగ్ వివరాలు లేనప్పుడు తర్వాతి ప్రాధాన్యత హిందీకి ఇవ్వడం సరికాదనుకుంటాను. ఎందుకంటే తెలుగుకు, హిందీకి ఉచ్చారణలో చాలా తేడా ఉంటుంది. ఉదా:కు రష్యాను రూస్ అనీ, చైనాను చీన్ అనీ, అలహాబాద్‌ను ఇలాహాబాద్ అనీ ... ఇలా అంటారు. అంతెందుకు తెలంగాణను తెలంగానా అనే రాస్తారు. ఈ విషయంలో మన పొరుగురాష్ట్ర భాష అయిన కన్నడను అనుసరించడం ఉత్తమం. (తమిళ, మలయాళ భాషల గురించి నాకు అంతగా తెలియదు)
*సంస్థల పేర్లు ఆంగ్లంలో ఉన్నప్పుడు దాన్ని అలాగే రాయాలా తెలుగీకరణ చేయాలా అనేది కూడా నిర్ణయించాలి. ఉదా:కు ప్రస్తుతం తెవికీలో "ఇన్‌స్టిట్యూట్" అనే పదం రాయడం మామూలైపోయింది కాని వాడుకలో ఈ పదం "సంస్థ" గానే ఉంది.
*వ్యక్తుల పేర్లు ఇంటిపేర్లు ఉన్నదున్నట్లుగా రాయాలి, కాని చరిత్రకు సంబంధించి ఈ పేర్లు అజంతంలోకి మారిపోయాయి. ఇదే విషయంపై సుమారు పదేళ్ళ క్రితమే పెద్ద చర్చ జరిగింది ([[చర్చ:చంద్రగుప్త మౌర్యుడు#పేరు|'''చూడండి''']]) (మొత్తం చర్చ ఇక్కడ లేదు కాని ఆ సభ్యుడు ప్రవర్తన తెవికీలోనే పెద్ద దుమారం లేపి చివరికి ఒక యాక్టివ్ నిర్వాహకుడిని కోల్పోయాము) ఈ విషయంపై కొత్తగా చర్చ జరగాలి. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:52, 30 డిసెంబరు 2019 (UTC)