శంకరంబాడి సుందరాచారి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 23:
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని [[మద్రాసు]] వెళ్ళాడు. [[ఆంధ్ర పత్రిక]] ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. [[కాశీనాధుని నాగేశ్వర రావు|దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు]] పంతులు "నీకు తెలుగు వచ్చా" అని అడిగాడు. దానికి సమాధానంగా "మీకు తెలుగు రాదా" అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసాడు. [[నందనూరు]]లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
 
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.<ref>{{Cite web|title=కష్టాలనెదిరించి మల్లె పూదండ కూర్చిన శంకరంబాడి|last=ఎం|first=భాను గోపాల్‌రాజు|url=http://www.suryaa.com/features/article-6-115621|publisher=సూర్య|date= 2012-12-29|accessdate=2014-02-05}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సుందరాచారి [[1977]] [[ఏప్రిల్ 8]] న తిరుపతి, [[గంగుండ్ర మండపం]] వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
[[File:Statue of Samkarambadi sundaracarya. Tirupati (4).JPG|thumb|right|శంకరంబాడి సుందరాచార్య. తిరుపతి]]
[[2004]]లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది<ref>{{Cite web|title=YSR unveils Sankarambadi statue|url= http://www.hinduonnet.com/2004/11/17/stories/2004111703070500.htm|publisher=The Hindu|date=2004-11-17 |accessdate=2014-02-02}}</ref>. [[తితిదే|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.<ref>{{Cite web|title=Immortalising the greats |url= http://www.hindu.com/2007/07/26/stories/2007072650260200.htm|publisher=The Hindu|date=2007-07-26 |accessdate=2014-02-02}}</ref>