రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.<ref>{{cite web|title=Perceptions’ on ‘misuse of article 356|url=http://www.janardhanprasaddvs.com/article-356.html|website=|access-date=2019-03-17|archive-url=https://web.archive.org/web/20181215121347/http://www.janardhanprasaddvs.com/article-356.html|archive-date=2018-12-15|url-status=dead}}</ref> ఈ అధికారాలను ఉపయోగించి, తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి.<ref>{{cite news|title=Limitations of Article 356|url=http://www.hindu.com/thehindu/op/2003/05/06/stories/2003050600010200.htm|newspaper=The Hindu}}</ref> అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది. <ref>Ahmadi J., S.R. Bommai v. Union of India, (1994) 3 SCC 1, 296–297, ¶ 434 cited in http://www.ejcl.org/81/art81-4.html</ref>
 
1954 లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI : Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014|website=|archive-url=https://web.archive.org/web/20140820195906/http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|archive-date=20 ఆగస్టు 2014|url-status=dead}}</ref> ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య [[ఇందిరా గాంధీ]] 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, [[జనతా పార్టీ]] తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.
 
ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్‌ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే.<ref>{{cite web|url=http://lawmin.nic.in/ncrwc/finalreport/v2b2-5.htm|title=National Commission to Review the Working of the Article 356 of the constitution|year=2001|accessdate=29 July 2015|website=|archive-url=https://web.archive.org/web/20150509030437/http://lawmin.nic.in/ncrwc/finalreport/v2b2-5.htm|archive-date=9 మే 2015|url-status=dead}}</ref> కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని "తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునస్థాపించేందుకు అవసరమైన అన్ని వికల్పాలనూ ప్రయత్నించాక, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాల"ని పేర్కొంది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI: Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014|website=|archive-url=https://web.archive.org/web/20140820195906/http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|archive-date=20 ఆగస్టు 2014|url-status=dead}}</ref>
 
== రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు