సందీప్ కిషన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎కెరీర్: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 18:
 
==కెరీర్==
'స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌ [[బాలీవుడ్|బాలీవుడ్‌]]<nowiki/>లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. [[చిరంజీవి]], నాగార్జున, [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్‌]] తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌లో హీరోగా అవకాశం తెచ్చుకున్న సందీప్‌ తెలుగు వాడు. తెలుగులో 'ఎల్‌.బి.డబ్యూ'ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో మిక్కీ.జే.మేయర్‌ [[సంగీతము|సంగీత]] దర్శకత్వంలో రూపోందుతున్న రోటీన్‌ లవ్‌స్టోరిలో సోలో హీరోగా చేస్తూ తమిళంలో రెడ్‌పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుటున్న 'యారుడ మహేష్‌' అనే చిత్రం కూడా చేస్తుండడం విశేషం. ఈ రెండు చిత్రాలు 70% చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
 
మంచు లక్ష్మి నిర్మాతగా మాస్ట్రో [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'గుండెల్లో గోదారి' అనే మల్టీ స్టారర్‌ చిత్రంలో సందీప్‌కిషన్‌తో పాటు ఆది పినిశెట్టి, తాప్సీ మరియు మంచు లక్ష్మి నటిస్తున్నారు. ఇందులో మాస్‌ యాక్షన్‌ హీరోగా తన పాత్ర వుండడం విశేషం. అలాగే 'ఓరు' ఫేం ఆనంద్‌రంగా నిర్మిసున్న ద్విభాషా చిత్రంలో కూడా సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
"https://te.wikipedia.org/wiki/సందీప్_కిషన్" నుండి వెలికితీశారు