ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి [[1989]],[[సెప్టెంబర్ 13]] న స్వర్గస్తులయ్యారు.
== జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు ==
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, [[శృంగారం|శృంగార]] భావములుగల అర్థాలున్నాయి. [[సినిమా]] పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.<ref>[{{Cite web |url=http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389 |title=ఆత్రేయ మనసు కవి] |website= |access-date=2017-04-02 |archive-url=https://web.archive.org/web/20170929085711/http://10tv.in/content/Acharya-Atreya-Death-Anniversary-Today-11389 |archive-date=2017-09-29 |url-status=dead }}</ref>
== గొప్ప వేదాంతి ==
ఆత్రేయ గొప్ప [[వేదాంతశాస్త్రం|వేదాంతి]]. ప్రతివిషయాన్ని వాస్తవిక [[దృష్టి కోణం|దృష్టి]]<nowiki/>తో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.
 
==ఆత్రేయ పాటలు గురించి==
'[[దీక్ష (1951 సినిమా)|దీక్ష]]' (1950) చిత్రానికి తొలిసారి ఆయన పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన '[[సంసారం (1950 సినిమా)|సంసారం]]' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. '[[అర్ధాంగి (1955 సినిమా)|అర్థాంగి]]' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', '[[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడి కోడళ్ళు]]' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', '[[శ్రీ వెంకటేశ్వర మహత్యం|శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]]'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', '[[మంచి మనసులు (1962 సినిమా)|మంచి మనసులు]]'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', '[[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]]' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' '[[డాక్టర్ చక్రవర్తి|డాక్టర్‌ చక్రవర్తి]]'లో 'నీవులేక వీణ ...', '[[అంతస్తులు]]'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', '[[ప్రేమనగర్|ప్రేమ్‌నగర్‌]]'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', '[[మరో చరిత్ర|మరోచరిత్ర]]'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', '[[ఇంద్రధనుస్సు (1978 సినిమా)|ఇంద్రధనస్సు]]'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', '[[అంతులేని కథ]]'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', '[[మరో చరిత్ర|మరోచరిత్ర]]'లో 'విధి చేయు వింతలన్నీ...', '[[ఇది కథ కాదు]]'లో 'సరిగమలు గలగలలు...', '[[స్వాతిముత్యం]]'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు '[[తేనె మనసులు (1965 సినిమా)|తేనే మనసులు]]', '[[ప్రైవేటు మాస్టారు|ప్రైవేట్‌ మాస్టర్‌]]', '[[బ్రహ్మచారి (సినిమా)|బ్రహ్మాచారి]]', '[[మట్టిలో మాణిక్యం]]', '[[బడిపంతులు (1972 సినిమా)|బడి పంతులు]]', '[[పాపం పసివాడు]]', '[[భక్త తుకారాం|భక్త తుకారం]]', '[[బాబు (1975 సినిమా)|బాబు]]', '[[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి]]', 'అందమైన అనుబంధం', '[[గుప్పెడు మనసు]]', '[[ఆకలి రాజ్యం]]', '[[అభిలాష (సినిమా)|అభిలాష]]', '[[కోకిలమ్మ]]', '[[అభినందన (సినిమా)|అభినందన]]', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.<ref>[http://10tv.in/Telugu-poet-scenarist-lyricist-Atreya-Acharya-44387 మనసు కవి 'ఆత్రేయ'...]{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==ఆత్రేయ గురించి==
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు