పంక్తి 62:
 
మధుగారూ! మీరు అప్ లోడ్ చేసే కొన్ని బొమ్మల కాపీ హక్కులు సందిగ్ధంలో ఉన్నాయి. ఉదాహరణకు సోగ్గాడు లో శోభన్ బాబు, అలాగే చిరంజీవి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ - ఇవి మీ స్వంతకృతులని లైసెన్సు ట్యాగ్ పెడుతున్నారు. మీరు స్వయంగా గీసినవి, స్వయంగా ఫొటో తీసినవి, లేదా స్వయంగా చేసినవారు మీకు అనుమతి ఇచ్చినవి అయితేనే ఇలాంటి ట్యాగ్ లు పెట్టవచ్చు. అదె గనుక అయితే స్పష్టంగా "నేను చేసిన లేదా ఫలానా సందర్భంలో తీసిన బొమ్మ" అని వ్రాయండి. అలా కాకుంటే ఇటువంటి బొమ్మలు మీరు అప్ లోడ్ చేసినా గాని త్వరలో తొలగింపబడుతాయి గనుక వృధా ప్రయాస అవుతుంది. దయచేసి గమనించి సరైన వివరాలు తెలియజేయండి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 18:45, 28 మార్చి 2008 (UTC)
:మధు గారూ! (1) బొమ్మల గురించి మీరు తీసుకొన్న జాగ్రత్తలు గమనించాను. కాని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. సహజంగా (ఇంగ్లీషు గాని, వేరే భాష గాని) వికీపీడియాలో Text మాత్రమే GFDL లైసెన్సు క్రిందికి వస్తుంది. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప బొమ్మలకు ఆ లైసెన్సు వర్తించదు. Telugupedia లో contenet under GFDL అని ఒక సాధారణ కాపీహక్కుల సూచన ఇచ్చారు కాని వారు ఈ విషయంపై స్పష్టంగా చెప్పలేదు. వారి బొమ్మలకు కాపీహక్కులు గాని, అవి ఎక్కడినుండి తీసుకొన్నారో గాని వివరాలు జత పరచడం లేదు. కనుక మనం కాపీ చేసినట్లయితే వారి ఉల్లంఘనను మనం ప్రతిబింబిస్తున్నట్లు అవుతుంది. మరింత స్పష్టత కోసం Telugupedia వారికి ఒక జాబు వ్రాయడం మంచిది. మీరు వ్రాయ గలరా? (2) మీరు మూసలు చేసే పని తీసుకోవడం చాలా సంతోషం. వాటి వల్ల తెలుగు వికీ చాలా మెరుగుపడుతుంది. Telugupedia లో మూసలు, పేజీ డిజైను చాలా అందంగా ఉన్నాయి. దానినుండి కొన్ని విషయాలు నేర్చుకొని తెలుగు వికీలో వాడితే బాగుంటుంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 06:10, 30 మార్చి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Madhusurapaneni" నుండి వెలికితీశారు