Madhusurapaneni
Madhusurapaneni గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 07:48, 23 మార్చి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
infobox creation
మార్చుసహాయ అభ్యర్ధన
మార్చుplease tell me how to create an infobox. I am making one for actors! u can mail me at smadpr@gmail.com
మధు గారూ! మీరు ఆంగ్ల వికీలో ఉన్న మూసను తెలుగులో మార్చేటప్పుడు కొన్ని పెరామీటర్ల విషయంలో పొరపాటు చేస్తున్నట్లు అనిపిస్తన్నది. నాకు మూసల గురించి తెలియదు గాని మీ సహాయ అభ్యర్ధన చూశానని చెప్పడానికి ఈ జవాబు వ్రాస్తున్నాను. మరొకరెవరినైనా మీకు సహాయపడమని కోరుతాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:53, 24 మార్చి 2008 (UTC)
మరొక విషయం. మీరు బొమ్మ:Chiranjeevi.JPG అప్‌లోడ్ చేశారు. ఇది కాపీ హక్కుల నియమాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదు.
ఈ బొమ్మకు మీరు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసనట్లయితే, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో లేదా నా చర్చా పేజీలో అడగండి.
లైసెన్సు వివరాలు లేని బొమ్మల తొలగింపు
మార్చుమీరు అప్లోడ్ చేసిన క్రింది బొమ్మలకు సరైన లైసెన్సు వివరాలు ఇవ్వడం మరిచారు. లేదా ఇచ్చిన వివరాలు సందిగ్ధంగా ఉన్నాయి.
నిర్వహణలో భాగంగా ఇటువంటి బొమ్మలన్నీ 15/4/2008 తరువాత తొలగించబడుతాయి.
కనుక సరైన వివరాలు జోడించి నిర్వహణలో తోడ్పడమని మనవి.
- ఒక వేళ మీరు అప్లోడు చేసిన బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా లోంచి సరైన కాపీ హక్కు ట్యాగ్‌ను ఎంచుకొని ఆ బొమ్మకు చేర్చండి. - {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటివి.
- మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు {{PD-India}} అనే ట్యాగు చేర్చి ఆ బొమ్మను ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో వ్రాయండి.
- ఒకవేళ మీరు అప్లోడు చేసిన బొమ్మ ఉచితం కాకున్నా "సముచిత వినియోగం" (FAir Use) క్రిందికి వస్తే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా) వాటికి {{Non-free film screenshot}} లేదా {{పుస్తక ముఖచిత్రం}} లేదా {{డీవీడీ ముఖచిత్రము}} లేదా {{సినిమా పోస్టరు}} వంటి ట్యాగులను చేర్చండి.
- అలా కాకుండా ఆ బొమ్మపై వేరే వారికి కాపీ హక్కులున్నాగాని ఆ వ్యాసంలో ఆ బొమ్మ వాడడం చాలా అవుసరమనీ, ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా వేరే ఉచిత లైసెన్సు బొమ్మ లభించడం సాధ్యం కాదనీ మీరు అనుకొంటే FairUse కింద ఆ బొమ్మకు {{Non-free fair use in|వ్యాసంపేరు}} అనే ట్యాగును పెట్టండి. ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి.
- ఇదివరకు మీరు ఉత్సాహంగా అప్‌లోడ్ చేసినా ఆ బొమ్మ సరైన కాపీ హక్కు నియమాలను అనుగుణంగా లేదనుకుంటే అబొమ్మ సారాంశంలో {{తొలగించు|కాపీహక్కుల సందిగ్ధం}} అనే మూసను ఉంచండి.
- మరి కొన్ని వివరాలకు ఈ లింకులు చూడండి: బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా
ఏమయినా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక అడగండి.
- కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు క్రింద ఇవ్వబడ్డాయి.
కాపీ హక్కులు సరిగా లేని బొమ్మలు చేర్చకండి
మార్చుమధుగారూ! మీరు అప్ లోడ్ చేసే కొన్ని బొమ్మల కాపీ హక్కులు సందిగ్ధంలో ఉన్నాయి. ఉదాహరణకు సోగ్గాడు లో శోభన్ బాబు, అలాగే చిరంజీవి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ - ఇవి మీ స్వంతకృతులని లైసెన్సు ట్యాగ్ పెడుతున్నారు. మీరు స్వయంగా గీసినవి, స్వయంగా ఫొటో తీసినవి, లేదా స్వయంగా చేసినవారు మీకు అనుమతి ఇచ్చినవి అయితేనే ఇలాంటి ట్యాగ్ లు పెట్టవచ్చు. అదె గనుక అయితే స్పష్టంగా "నేను చేసిన లేదా ఫలానా సందర్భంలో తీసిన బొమ్మ" అని వ్రాయండి. అలా కాకుంటే ఇటువంటి బొమ్మలు మీరు అప్ లోడ్ చేసినా గాని త్వరలో తొలగింపబడుతాయి గనుక వృధా ప్రయాస అవుతుంది. దయచేసి గమనించి సరైన వివరాలు తెలియజేయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:45, 28 మార్చి 2008 (UTC)
- మధు గారూ! (1) బొమ్మల గురించి మీరు తీసుకొన్న జాగ్రత్తలు గమనించాను. కాని నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. సహజంగా (ఇంగ్లీషు గాని, వేరే భాష గాని) వికీపీడియాలో Text మాత్రమే GFDL లైసెన్సు క్రిందికి వస్తుంది. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప బొమ్మలకు ఆ లైసెన్సు వర్తించదు. Telugupedia లో contenet under GFDL అని ఒక సాధారణ కాపీహక్కుల సూచన ఇచ్చారు కాని వారు ఈ విషయంపై స్పష్టంగా చెప్పలేదు. వారి బొమ్మలకు కాపీహక్కులు గాని, అవి ఎక్కడినుండి తీసుకొన్నారో గాని వివరాలు జత పరచడం లేదు. కనుక మనం కాపీ చేసినట్లయితే వారి ఉల్లంఘనను మనం ప్రతిబింబిస్తున్నట్లు అవుతుంది. మరింత స్పష్టత కోసం Telugupedia వారికి ఒక జాబు వ్రాయడం మంచిది. మీరు వ్రాయ గలరా? (2) మీరు మూసలు చేసే పని తీసుకోవడం చాలా సంతోషం. వాటి వల్ల తెలుగు వికీ చాలా మెరుగుపడుతుంది. Telugupedia లో మూసలు, పేజీ డిజైను చాలా అందంగా ఉన్నాయి. దానినుండి కొన్ని విషయాలు నేర్చుకొని తెలుగు వికీలో వాడితే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:10, 30 మార్చి 2008 (UTC)
- (1) మధ్యలో మాట్లాడున్నందుకు క్షమించండి. ఇండియా లో కాపిహక్కులంటే ఎక్కవ లెక్క చేయరు. కాని ఇతర దేశాలలో ఇది ఒక పెద్ద సమస్య. కాపిహక్కులు చట్టాల ప్రకారం కాపిరైట్ ఉన్న బొమ్మలను ఏ పనికి అనుమతి లేకుండా వాడకూడదు. అది బిసినెస్ ఐనా సరే, not for profit సంస్థలైనా సరే. అసలు వికీపీడియా ఉన్నందే ఉచిత సమాచారాన్ని పంచడానికి. కాబట్టి కాపి హక్కులు ఉన్న బొమ్మలు వాడటం వికీ పాలసీ కి వ్యతిరేకం. (2) నేను చేస్తాను మూసలు మీతో పాటు. సాయీ(చర్చ) 12:56, 1 ఏప్రిల్ 2008 (UTC)
కాసుబాబు గారూ, (1) మీ జవాబు ఒక రకంగా బాగున్నా, మీరు మరీ ఎక్కువ జాగ్రత్త తీస్కుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి ఫొటో కాపీ హక్కులతో దొరకాలి అంటే జరిగే పని కాదండీ. మీరు ఇలా పర్టికులర్ గా ఉండకుండా కొంచెం liberal గా ఉండడం బెటర్. ఒక వేళ మనం తెలుగు వారి ఫొటోలకు కాపీహక్కులు సంపాదించినా, వేరే వారి హక్కులు ఎలా సంపాదిస్తాము? ఆలోచించండి! "మనం వాడుకున్న ఫొటొని ఎవరూ క్లెయిం చెయ్యకుండా ఉంటే చాలు అని నా అభిప్రాయం." మనం ఏమీ వాల్పేపర్ బిజినెస్ చెయ్యట్లేదు కదా, ఎవరన్నా కంప్ల్ చెయ్యడానికి??? (2) ఇంకా, నాకు మూసలు చెయ్యడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఐతే, నాతో పాటు ఇంకా ఎవరన్నా ముందుకొస్తే, నాకు సహకరించమని చెప్పగలరు! మూసల విషయమై కొన్ని అక్కర్లేని పేజీలు, కొన్ని డూప్లికేట్లు ఉన్నాయి. వాటిని తొలగించడానికి నాకు హక్కులు ఇవ్వగలరేమో చూడగలరు.
సెలవు. --సూరపనేని 22:03, 30 మార్చి 2008 (UTC)
- మధుగారూ! మీరు చెప్పిన కారణాలన్నీ మొదట్లో నేను చెప్పినవే! అత్యుత్సాహంతో నేను అప్‌లోడ్ చేసిన అనుచిత బొమ్మలను నేనే ఇప్పుడు తొలగిస్తున్నాను. నాకు క్రమంగా అర్ధమయ్యిందేమంటే (1) కాపీ హక్కుల విషయంలో ఖచ్చితంగా ఉండడానికి వికిపీడియా ప్రయత్నిస్తుంది. (2) ఎడాపెడా బొమ్మలు పోగుచేసినంత మాత్రాన వికీ స్థాయి మెరుగు పడదు. (3) సరైన బొమ్మ దొరకకపోతే బొమ్మలేకుండా కూడా వ్యాసం వ్రాయవచ్చును. అది పెద్ద లోటేమీ కాదు. (4) కాపీ హక్కుల పేజీలను తెలుగులోకి సరిగా అనువదించలేకపోయాము. కనుక మార్గదర్శకాల కోసం ఆంగ్ల వికీలోని en:Wikipedia:Copyrights మరియు అక్కడినుండి ఉన్న లింకులు చూడవచ్చును (5) అన్నింటికంటే ముఖ్యమైన విషయం - పాలిసీ చేసేది నేను కాను కనుక సడలింపు చేసే అర్హత కూడా నాకు లేదు. నేను కాకపోతే మరొకరు తొలగించేస్తారు.
- అనవసరమైన శ్రమ పడకుండా ఉండాలని ఇంత సుదీర్ఘమైన జవాబు ఇస్తున్నాను. మూసలు చేయడానికి సందేహించకండి. ఏదైనా పాతది తొలగించాలంటే ఆ పెజీలో {{తొలగించు|కారణం}} అని వ్రాయండి. ఎవరో ఒకరు తొలగిస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:40, 1 ఏప్రిల్ 2008 (UTC)
సరే. నేను బొమ్మలు అప్లోడ్ చెయ్యడం మానుకుంటున్నాను. --71.68.25.37 17:34, 2 ఏప్రిల్ 2008 (UTC)
- అది తప్పు మధూ గారు. ఉచిత బొమ్మలు కామన్స్ లోకి అప్లోడ్ చేయండి. అవసరమైన్ non-free బొమ్మలను ఫెయిర్ యూస్ క్రింద అప్లోడ్ చేయండి. సాయీ(చర్చ) 18:30, 12 ఏప్రిల్ 2008 (UTC)