లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పూర్వపు చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 10:
 
ఈ ఊరు [[శ్రీకృష్ణ దేవరాయల]] కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు [[కూర్మశైలము]]. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. [[అగస్త్యుడు]] ఇతనిని ప్రతిష్ఠించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది. మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు. ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట [[జటాయువు]] పడియుండెననీ, [[శ్రీరాముడు]] ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు.
పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.
ఇచ్చటి [[వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి|వీరభద్రుని ఆలయాన్ని]] క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనము వెచ్చించి [[రామదాసు]]కు చాలాముందే ఈవీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట.ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు.ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనె పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్.
ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు