లేపాక్షి

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా, లేపాక్షి మండలం లోని గ్రామం

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595570[1].పిన్ కోడ్: 515 331.

ఏకశిలా నంది

ఇతిహాసముసవరించు

రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయింది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి ’లే-పక్షి’ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

పూర్వపు చరిత్రసవరించు

ఈ ఊరు శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. అగస్త్యుడు ఇతనిని ప్రతిష్ఠించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది. మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు. ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగింది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చాడు. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనము వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈవీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా,రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట.ఆలయ నిర్మాణము మూడింట ఒక వంతు ఆగిపోవడము ఇందువల్లనే అంటారు.ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనే పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అంటారు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయ్. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడుతారు . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని ఛూపులు నేరుగా ఊరి మీద పదకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనము ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.లేపాక్షి ఒక మంచి దర్షనీయ ప్రదేశం. అక్కడ కొలువైఉన్న వీరబద్రస్వామి చాలా మహిమ కలవాడు.

మందిర వర్ణనసవరించు

 
లేపాక్షి దేవాలయంలోని 16వ శతాబ్దపు వర్ణచిత్రం

లేపాక్షి దేవాలయమున చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు లను ఉపయోగించి అబ్ధుతమగు చిత్రములు గీయించిరి. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనము యొక్క గొప్పదనము- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనమును కూడా చూడవచ్చును. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపము పైకప్పు లోభాగమున మహాభారత, రామాయణ పౌరాణిక గాథల పెక్కుగా వ్రాసినను, వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలు అచ్చెరెవు గొల్పునట్లు అలంకరించారు. పార్వతీ పరిణయము, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారము, శివ తాండవము లోనిఆఖ్యాయికలు గాథా విషయములుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు శివుడు పార్వతి చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపము, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారము, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలము పెట్టి రుద్రుడు మొఖము, శివుని భిక్షాటనము, నటేశుని ఆనందతాండవము, దక్షిణామూర్తి మొదలగు చిత్రములు చూచువారిని ముగ్ధులు గావించెను. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించిరి. లేపాక్షి శిల్పములు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపములోని స్తంభముల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. బ్రహ్మ మద్దెలను, తుంబురుడు వీణెను, నందికేశ్వరుడు హుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప రంభ నాట్య మాడుట ఒకచోట చిత్రించెను.

ఇచ్చట గుట్టవంటి రాతి నిచ్చట బసవేశ్వరుడుగా తీర్చిదిద్దినారు. ఇంత పెద్ద బసవడు మనికెన్ని చోట్లలనో దొరకడు.ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ కూడాకలదు.దేవాలయాలకు కల్యాణమండపాలుండడము మన మెరుగుదుము. ఈ ఆలయములో కల్యాణమండపము ఉన్నది (అసంపూర్ణము) ఉన్నదీ,లతా మండపమున్నది.పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపము ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపము విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో ప్రాకరములో వైపున పశ్చిమ భాగంలో ఉంది. శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి.రెడ్డిరాజులు కోరుకొండ, దక్షరామము, పలివెల దేవాలయములలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురముమీద శిల్పి విగ్రహమూ, తిమ్మరసు విగ్రహమూఉన్నాయి.అయితే, మందవ స్తంభాలకు చేరా చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతరచోట్ల కానరావు.ఈ ఉదాహరణమును చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలూ, సోమపాలెము చావడిలో పెద్ది నాయకుడూ పెద్ద విగ్రహాలూ చెక్కించారు, మధుర మీనాక్షి దేవళములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయములోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశములో మరిలేవు. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రము భారతదేశములో మరిలేదు. కళాకారులు జైనులే అయినా, శిల్పమూ చిత్రకళా బృహద్రూపాలలో కోడము విజయనగర కళా ప్రభావమే.కళాకారులు జైనులనుటకు పలు నిదరసనములు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వము చాలా అరుదు లేపాక్షిలో. పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానము.ఈనాటికీ రెండు జైన ఆలయములు పూజలందుకుంటున్నవి.విరుపణ్ణ పెనుగొండ నాయంకరము పొందినవాడు.కళాకారులు అక్కడివారే కావడము వింతకాదు.లేపాక్షిలో శిల్పమూ చిత్రకళా సమ సంప్రదాయాలతోనే నడచినవి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణ.

లేపాక్షి వర్ణచిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి.అవి కేవలము సంప్రదాయక చిత్రాలేకావు.సమకాలిక చిత్రాలని అనవచ్చును.స్త్రీల పాపిటసరములూ, శిరోజములలో విడిపోవులూ, రెండు పొరల పైటలూ, కైవార హస్తములూ, ఉద్యోగుల, నాయకులూ-,శిల్పాలూ-, చిత్రకారులూ-,ఉష్ణీషాలూ, దుస్తులూ ఆనాటివే.

వరుపణ్ణి తండ్రిపేరు నంది లక్కిసెట్టి.లేపాక్షిలో ఒక రాతిగుట్టను 30 అడుగుల పొడవూ, 18 అడుగుల ఎత్తూ గల నందిని చెక్కించాడు.విరుపణ్ణ ఆతని సోదరుడు వీరణ్ణ గొరవనహళ్ళిలో లక్ష్మీ ఆలయము కట్టించాడు.విరుపణ్ణ వీరభద్రాలయము అర్ధ మండపము ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని- రంభా నలకుబేరులను చెక్కించాడు.రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది.నలకుబేరుడు విష్ణు ధ్రమోత్తరములో చెప్పినట్లు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు అరుదు.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి.

నవోదయ పాఠశాలసవరించు

ప్రతిభ ఉన్నా చదువుకోలేని గ్రామీణ విద్యార్థుల్లో వెలుగులు నింపుతోంది జవహర్ నవోదయ విద్యాలయం. ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య ఉచితంగా అందించడంతో పాటు నైతిక విలువలు పెంపొందించడం ఈ పాఠశాల ప్రత్యేకత. అంతేగాక విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, ప్రతి విద్యార్థికి కంప్యూటర్ శిక్షణ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. జిల్లాలో లేపాక్షిలో ఈ విద్యాలయాన్ని 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్థాపించాడు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన సాగుతోంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు. అందుకే ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

లేపాక్షిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

లేపాక్షిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగు తున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 378 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 321 హెక్టార్లు
 • బంజరు భూమి: 781 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 395 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1077 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 421 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

లేపాక్షిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 417 హెక్టార్లు
 • చెరువులు: 4 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

లేపాక్షిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వేరుశనగ, మొక్కజొన్న, వరి

మూలాలుసవరించు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

లేపాక్షి చిత్ర మాలికసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లేపాక్షి&oldid=3130286" నుండి వెలికితీశారు