మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంస్కృతి: భాషాదోషాల సవరణ, typos fixed: సంస్కృతిక → సాంస్కృతిక (2) using AWB
చి clean up, replaced: , మరియు → , (9)
పంక్తి 66:
}}
 
'''మలేషియా''' ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియాలో 13 రాష్ట్రాలు, మరియు మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, [[దక్షిణ చైనా]] సముద్రంచే మలేషియా [[ద్వీపకల్పం]] (పెన్స్యులర్ మలేషియా) మరియు మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, మరియు బ్రునై దేశాలు, మరియు సముద్ర సరిహద్దులు [[సింగపూర్]], [[వియత్నాం]], మరియు [[ఫిలిప్పీన్స్]] దేశాలు. రాజధాని నగరం [[కౌలాలంపూరు]] మరియు పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, [[బోర్నియో]]లో 28,33 మిలియన్లు.
ప్రస్తుత మలేషియాకు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 1957 ఆగష్టు 31 న స్వాతంత్ర్యం పొందినది. 1963 సెప్టెంబరు 16 న సభ, సారవాక్, మరియు [[సింగపూరు]] ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియాగా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరును సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య మరియు వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.
 
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. [[వెస్ట్ మినిష్టర్]] పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు ( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
 
[[యురేషియాఖండం]] దక్షిణ కొనలో, ఉష్ణమండలంలో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు [[ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ]], [[కామన్వెల్త్ దేశాల సమాఖ్య]], మరియు [[అలీనోద్యమము]] మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
 
==పేరు వెనుక గాధ==
"మలయు" అనే పేరు "మలయ్" మరియు "ఊర్" అనే [[తమిళ]] పదములనుండి పరిణామం చెందిన శబ్దంగా భావిస్తారు. మలయ్ అంటే పర్వతము, ఊర్ అంటే తెలుగు మరియు తమిళాలలో ఊరు లేదా నగరము అని అర్ధము. తరువాత 7 నుండి 13వ శతాబ్దం వరకు సుమత్రాలో కొనసాగిన సామ్రాజ్యాన్ని మలయు అని వ్యవహరించేవారు. ప్రాచీన భారతదేశపు వ్యాపారులు మలేషియాను "మలయాద్వీపం" అను పేరుతో వ్యవహరించేవారు.1826 సంవత్సరంలో ఫ్రెంచి నావికుడు జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ తన సముద్రయానంలో మలేషియా, మైక్రోనేషియా మరియు మెలనేషియ అనే పేర్లతో పిలువబడే ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు; 1831 సంవత్సరంలో "Société de Géographie "కు ఈ పేర్లను ప్రతిపాదించాడు. జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ మలేషియాను పూర్వం ఈస్టిండీస్ అని వ్యవహరించేవారని అభివర్ణించాడు. 1850 సంవత్సరంలో ఇంగ్లాండుకు చెందిన మావనజాతి చరిత్ర శాస్త్రవేత్త జార్జ్ శామ్యూల్ విండ్సర్ ఎర్ల్ ఇండియా ద్వీపాలు మరియు తూర్పు ఆసియా జర్నల్ లో ఈ ఆగ్నేయ ఆసియా ద్వీపాలకు మేలయునేషియా మరియు ఇండూనేషియా అను పేర్లను ప్రతిపాదించాడు. మలేషియా 31 ఆగష్టు 1957 న మలయ సమాఖ్య స్వాతంత్ర్యం పొందినది. 16 సెప్టెంబర్ 1963 న సభ, సారవాక్, మరియు సింగపూరు ప్రాంతాలు మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరు మలేషియాగా మార్చబడింది.
 
== చరిత్ర ==
పంక్తి 154:
 
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్, ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి. 1996 లో మలేషియా మొదటి ఉపగ్రహ ప్రయోగం చేసింది. మీశాట్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి. ఎన్. బి.హెచ్.డి (ముందుగా ఈ సంస్థ బినారియాంగ్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి.ఎన్. బి.హెచ్.డి) అనే ప్రైవేట్ సంస్థ బోయింగ్ శాటిలైట్ సిస్టం నుండి మీశాట్-1, మీశాట్-2, మీశాట్-3 మరియు మీశాట్-3ఎ. మలేషియా ప్రభుత్వం వీటిని వరుసగా 2006 మరియు 2009 లో రోదసీలో ప్రవేశపెట్టింది. మలేషియా స్వయంగా టియుంగ్‌శాట్-1 పేరుతో రిమోట్ సెంసింగ్ శాటిలైటును విజయవంతంగా రూపొందించింది. ఈ శాటిలైట్ రూపకల్పనకు మలేషియా ఆస్ట్రో టెక్నాలజీ ఎస్.డి.ఎన్ బి.హెచ్.డి (ఏ.టి.ఎస్.డి) (మలేషియా), మరియు సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్‌డం) సహకారంతో రూపొందించింది. 2000 లో ఈ శాటిలైటును భూమి దిగువ కక్ష్యలో బైకనుర్ కాస్మోడ్రోం (కజకిస్థాం) వద్ద ప్రవేశపెట్టారు. మలేషియా రెండవ సెంసిటివ్ ఉపగ్రహం " రజాక్ శాట్ "ను 2009 జూలై 14 న రోదసీలో ప్రవేశపెట్టారు. రజాక్‌శాట్-2 ఉపగ్రహం 2015న రోదసీలో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేయబడింది. 2002 లో తన స్వంత రోదసీ పరిశోధనను ఆరంభించింది. 2006 న రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ తో జరుగిన పలు బిలియన్ల వ్యాపారానికి బదులుగా రష్యా ప్రభుత్వం ఒక మలేషియన్ పౌరుడిని అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి పంపింది. 1970లో మలేషియా స్వీయ రక్షణ సామర్థ్యం సాధించడానికి కొన్ని సైనిక వసతులను ప్రైవేటీకరణ చేసింది. ఇందు వలన మలేషియా స్వయం రక్షణశక్తిని సాధించడానికి తోడ్పడింది. ప్రభుత్వం ఈ పరిశ్రమలకు నిరంతర సహకారం అందిస్తూ మార్కెటింగ్ ఏక్టివిటీ, పోటీ తత్వం ప్రోత్సహిస్తుంది.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు