పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), డిసెంబర్ → డిసెంబరు (2), పట్టనా → using AWB
చి clean up, replaced: మరియు → , (15), typos fixed: ె → ే (3), , → , (14)
పంక్తి 19:
[[Image:CottonPlant.JPG|thumb|300px|కోతకు తయారుగా వున్న పత్తి.]]
[[Image:Cotton picking in India.jpg|left|thumb|నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము]]
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా ''''పత్తి'''' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది [[అమెరికా]], [[ఆఫ్రికా]] మరియు, భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
 
=చరిత్ర=
ప్రత్తి మొదటగా 7 వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ.5 మరియు, 4 వ శతాబ్దాలలో) సాగు చేయబడింది. అలా సాగు చేసిన వారు భారత ఉపఖండములో నైరుతి భాగాన, అంటే ఇప్పటి [[పాకిస్థాన్]] లోని తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో విలసిల్లిన [[సింధూ నాగరికత]]కు చెందిన వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళు ప్రత్తిని గుడ్డలుగా నేయటంలో అద్భుతమైన ప్రతిభగల వాళ్ళు. ఆ విధానాలు భారత దేశం పారిశ్రామీకరించటానికి ముందుదాకా కూడా వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గరనుండే ఆ విజ్ఞానం క్రీస్తుపూర్వమే [[మధ్యధరా నాగరికత]]కు, ఇంకా ముందుకు వెళ్ళింది.
 
అరబ్బులకిగాని, గ్రీకులకిగాని ప్రత్తి అంటే ఏమిటో [[అలెగ్జాండరు]] భారతదేశం మీద దండెత్తేదాకా కూడా తెలియదు. [[అలెగ్జాండరు]] సమకాలీనుడైన [[మెగస్తనీసు]], [[సెల్యూకస్]]కు [[భారత దేశం]]లో చెట్లపై ఉన్ని పెరుగుతుంది అని చెప్పినట్లు తన [[ఇండికా]] గ్రంథంలో వ్రాసుకున్నాడు.
పంక్తి 33:
పౌష్ఠికాహార సర్వస్వం ప్రకారం అమెరికా ఖండంలో మెక్సికోలో 8000 సంవత్సరాలకు పూర్వమే ప్రత్తి సాగుచేయబడింది. వాళ్ళు సాగుచేసిన ప్రత్తి రకం పేరు గాస్సిపియమ్ హిర్సూటం. ఈ రకాన్నే ప్రస్తుతం ప్రపంచమంతా సాగు చేస్తోంది. దాదాపు 90 శాతం సాగులోఉన్న ప్రత్తి ఈ రకమే. కానీ అడవి ప్రత్తి రకాలు చూడాలంటే ఎక్కువ రకాలు మెక్సికోలో, తరువాత [[ఆస్ట్రేలియా]], [[ఆఫ్రికా]]లో చూడవచ్చు. [[ఇరాన్]] లోని ప్రత్తి చరిత్ర చూడాలంటే, క్రీ.పూ.5వ శతాబ్దం అఖాయమెనిద్ శకానికి వెళ్ళాలి. అయినా ప్రత్తి సాగు గురించి గట్టి ఆధారాలు లేవు. ఇరాన్ లోని మెర్వ్, రే, పార్స్ ప్రాంతాల్లో ప్రత్తి పండించేవారని తెలుస్తోంది. పర్షియా కవుల గ్రంథాలలో ప్రత్తిని గురించి ఎన్నో ద్రుష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు [[ఫిరదౌసి]] [[షానామా]]. 13వ శతాబ్దానికి చెందిన [[మార్కోపోలో]] అనే [[స్పెయిన్]] యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తుల గురించి వ్రాసుకున్నాడు. వాటిల్లో ప్రత్తిని గురించి కూడా ఉంది. 17వ శతాబ్దంలో పర్షియాని సందర్శించిన జాన్ ఖార్డిన్ అనే ఫ్రెంచి యాత్రికుడు కూడా పర్షియా లోని విస్తారమైన ప్రత్తి పండించే క్షేత్రాల గురించి వ్రాసుకున్నాడు. ప్రత్తి
 
పెరూ దేశంలో కోస్తా నాగరికతలైన నార్టెనార్టే చికో, మోచె, నాజ్క వంటివి అభివృద్ధి చెందటానికి, ప్రత్తి సాగు వెన్నెముక లాగా నిలిచింది. వారు దేశీయమైన గాసిపియమ్ బార్బడెన్సెబార్బడెన్సే అనే ప్రత్తి రకాన్ని సాగు చేసేవారు. ప్రత్తిని నది మొదటి భాగంలో పండించి, వలలు అల్లి, ఆ వలల్ని, తీరప్రాంతం వెంబడి గల మత్శ్యకార పల్లెలతో వారికి కావలసిన చేపల కోసం మార్పిడి చేసుకునేవారు. 15వ శతాబ్దం మొదట్లో మెక్సికో వచ్చిన స్పెయిన్ దేశస్థులు, అక్కడి ప్రజలు ప్రత్తి పండించడం, వాటితో నేసిన నూలు దుస్తులు ధరించటం కనుగొన్నారు.
[[Image:Vegetable lamb (Lee, 1887).jpg|thumb|left|టార్టారీ యొక్క గొర్రె మొక్క]]
మధ్యయుగాల్లో ఉత్తర యూరోపులో పత్తిని ఒక దిగుమతి చేసుకున్న మొక్కల పీచు లాగా చూశారేకానీ అది ఏమిటి, ఎట్లా వచ్చింది, అనే విషయాల గురించి కనీస జ్ఞానం కూడాలేదు.పైగా నూలు చెట్లకి పెరిగే గొర్రెల బొచ్చు అనే మూఢ నమ్మకం ఉండేది. 1350వ సంవత్సరంలో జాన్ మాండవిల్లెమాండవిల్లే అనే రచయిత ఈ విధంగా వ్రాసుకున్నాడు. భారత దేశంలోఒక అద్భుతమైన చెట్టు ఉంటుందని, దానికి కొమ్మల చివర చిన్న గొర్రె పిల్లలు కాస్తాయని, ఆ గొర్రె పిల్లలకి ఆకలి వేస్తే ఆ కొమ్మలు బాగా కిందకి వంగి గొర్రె పిల్లలు గడ్డి తినడానికి వీలు కల్పిస్తాయని అనుకునేవారు. ఈ విషయం ఎంత నిజమంటే, యూరోపు దేశాల్లో ప్రత్తిని పిలిచే పేర్లలో చూడచ్చు. జెర్మను భాషలో ప్రత్తిని బౌమ్ వూల్ అంటారు. అంటే, చెట్లకి కాసే బొచ్చు అని అర్ధం. 16వ శతాబ్దం చివరకి కానీ ఆసియా, అమెరికాలలోని ఉష్ణ మండలాల్లో ప్రత్తి విస్తారంగా పండించడం మొదలు కాలేదు.
 
భారతీయ ప్రత్తి పరిశ్రమ ఆంగ్లేయుల కంపనీ పరిపాలన మొదలైన తరువాత అంటే 18 వ శతాబ్దము చివర, 19వ శతాబ్దం మొదట్లో, క్రమంగా తగ్గుముఖం పట్టణారంభించింది. ఇది పూర్తిగా బ్రిటీషు ఈస్టిండియా కంపనీ పరిపాలనలో వారు అవలంబించిన వలసవాద వ్యాపార ధోరణి వల్లనే.భారతీయ మార్కెట్లను ముడి ప్రత్తి మాత్రమే సరఫరా చెయ్యాలని, తయారైన నూలు దుస్తులు బ్రిటీషు వారివే కొనాలనీ బలవంతం చెయ్యటంవల్లనే.
 
బ్రిటన్ లోవచ్చిన పారిశ్రామిక విప్లవము నూలు తయారీకి గొప్ప ఊపునిచ్చింది. ఎంతలా అంటే నూలు అంటే తెలియని బ్రిటన్ ఎగుమతులలో నూలు మొదటి స్థానాన్ని ఆక్రమంచింది. 1738లోఇంగ్లాండు లోని బర్మింగ్ హామ్ కు చెందిన, లూయిస్ పాల్, జాన్ వ్యాత్ లు రోలర్ స్పిన్నింగు మిషనుకు, దారాన్ని ఒకే లావుతో వడకడానికి ఉపయోగపడే ఫ్లైయర్ ‍‍మరియు‍‍, బాబిన్ పద్ధతికి గుత్త హక్కులు పొందారు. ఇవే కాక 1764లో కనుగొన్న స్పిన్నింగ్ జెన్ని, 1769లొ రిఛర్ద్ ఆర్క్ రైట్ కనుగొన్న స్పిన్నింగ్ ఫ్రేము, బ్రిటీషు నేతగాళ్ళు నూలు, దుస్తులు తక్కువ సమయంలో కావల్సినంత తయారు చేసుకునేలా ఉపయొగపడ్డాయి. 18వ శతాబ్దం చివరలో నూలు పరిశ్రమ కేంద్రీక్రుతమవ్వడం వల్లా, ప్రపంచ నూలు పరిశ్రమకి కేంద్రబిందువు కావడం వల్లా బ్రిటన్ లోని మాంఛెస్టర్ నగరాన్ని, కాటనోపోలిస్ అని పిలవటం మొదలుపెట్టారు. 1793లో ఎలి విట్ని అనే అమెరికా దేశస్థుడు, కనిపెట్టిన కాటన్ జిన్ వల్ల నూలు ఉత్పత్తి ఇంకా పెరిగింది. ప్రపంచ మార్కెట్లపై గల గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్లా బ్రిటీషు వర్తకులు అభివృద్ధిని పొందారు. వలస రాజ్యాల్లో నుంచి ముడి ప్రత్తి బ్రిటన్ తీసుకుపోవడం, లాంకుషైరు పట్టణంలో దాన్ని బాగుచేసి, దుస్తులునేసి, మళ్ళీ అదే వలస మార్కెట్లు అయిన, పశ్చిమ ఆఫ్రికా, భారత దేశం, ఛైనా (వయా షేంఘాయ్, హాంగ్ కాంగ్) లలో అమ్మటం.
 
1840కి భారత దేశం ప్రపంచానికంతా కావలసిన దుస్తులు నేసే బ్రిటీషు మరమగ్గాలకి కావలసిన ప్రత్తిని ఉత్పత్తి చెయ్యలేకపోతోంది. అతి తక్కువ ధరలో దొరికే భారత ప్రత్తిని, ఓడల్లో బ్రిటన్ కి తీసుకువెళ్ళడం, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా ఆలస్యమవుతోంది. ఇంతలో అమెరికాలో పండే ప్రత్తి, ఇంతకన్నా బావున్నదని తెలిసింది. (పొడుగు పింజ, గట్టిదనం ఎక్కువ. అవి అమెరికా దేశవాళీ విత్తనాలైన, గాస్సిపియమ్ హిర్సూటం, గాస్సిపియమ్ బార్బడెన్సె). దాంతో బ్రిటీషు వర్తకులు, అమెరికాలో, కరేబియన్ దీవుల్లో ప్రత్తి క్షేత్రాల్ని కొనుగోలు చెయ్యడం మొదలుపెట్టారు. అక్కడ ఇంకా చవక, ఎందుకంటే పనివాళ్ళంతా [[బానిస]]లు. 19వ శతాబ్దం మధ్యకల్లా, కింగ్ కాటన్ అనేది దక్షిణ అమెరికా ఆర్థికావసరాలకి వెన్నెముక అయ్యింది. యునైటెడ్ స్టేట్స్ లో బానిసల ముఖ్యమైన పని, ప్రత్తి పండించడమే.
పంక్తి 59:
 
=టాంగూయిస్ ప్రత్తి=
[[పెరూ]] దేశంలో కాటన్ విల్ట్, ఫ్యుసేరీయమ్ విల్ట్ అనబడే [[ఫంగస్]] వ్యాధుల వలన ప్రత్తి పంట పూర్తిగా దెబ్బతింది. ఈ వ్యాధి పెరూ దేశమంతా వ్యాపించింది. ఈ వ్యాధి మొక్క వేళ్ళ ద్వారా వ్యాపించి, కాండంలోకి చొరబడి మొక్కని పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది. ప్యూర్టోరికో దేశానికి చెందిన ఫెర్మిన్ టాంగూయిస్ అనే వ్యవసాయదారుడు పెరూ దేశంలో నివసించేవాడు. ఇతను ఈ వ్యాధుల దాడికి గురయ్యి కూడా పెద్దగా దెబ్బతినని కొన్ని మొక్కలని గమనించి వాటిని అనేక రకాల ప్రత్తి మొక్కలతొ అంటుకట్టించడం లాంటి ప్రయోగాలు చేశాడు. చివరకి, 1911 లో 10 సంవత్సరాల కృషి ఫలించి పై వ్యాధులని తట్టుకుని నిలబడగల కొత్త వంగడాన్ని సృష్టించాడు. అంతే కాక ఆ వంగడాల నుంచి వచ్చిన ప్రత్తి 40 శాతం పొడవు మరియు, మందమైన దూదినిచ్చింది. పైగా అంత తొందరగా తెగదు, తక్కువ నీరు వాడుకుంటుంది. ఇంకే పేరు దేశంలోని నూలు మిల్లులన్నీ ఈ వంగడాన్ని ఆదరించడం మొదలు పెట్టాయి. పెరూ దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 75 శాతం ఈ ప్రత్తి రకమే.ఆ సంవత్సరం పెరూ దేశం ప్రత్తి ఉత్పత్తి, 2 లక్షల 25 వేల బేళ్ళు. అందుకే ఆ వంగడానికి టాంగూయిస్ ప్రత్తి అని నామకరణం చేశారు.
 
=సాగుబడి=
పంక్తి 66:
ప్రత్తి ఉత్పత్తి వసంతం వెళ్ళంగానే మొదలవుతుంది. విత్తే సమయం సాధారణంగా ప్రాంతాలని బట్టి మారుతుంది. ఫిబ్రవరి నుంచి జూను దాకా ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని దక్షిణ పీఠభూమి అనేది ప్రపంచంలో అతి విస్తారమైన ప్రత్తి పండే ప్రాంతం. నీటిఎద్దడి ప్రత్తి సాగు ఇక్కడ సాధారణంగా చేస్తారు. ఉత్పత్తి పక్కన ఉన్న ఒగల్లాలా గుట్టల నుంచి వచ్చే నీటిపై అధారపది ఉంటుంది.
 
మొక్కజొన్న లాంటి మిగతా పంటలకి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ప్రత్తి అనేది కొంతమేర నీటిఎద్దడిని, చౌడునేలల్ని తట్టుకుంటుంది కాబట్టి ప్రత్తి పంట, పాక్షిక, పూర్తి నీటి ఎద్దడిగల ప్రాంతాలకు బాగా ఉపయోగ పడుతుంది. నానాటికీ ప్రపంచంలో నీటివనరులు తగ్గుతున్న నేపథ్యంలో, వాటి మీద అధారపడ్డ ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు, కష్టాలనీ, ఘర్షణలనీ మరియు, ప్రాకృతిక సమస్యలనీ ఎదుర్కొంటాయి. ఉదాహరణకి సరైన నీటిపారుదల, సాగుపద్ధతులు లేనందు వలన, ఉజ్బెకిస్థాన్ లోని ప్రత్తి పండించే క్షేత్రాలు ఎడారి ప్రాంతాలుగా మారిపోయాయి. సోవియట్ రష్యా రోజుల్లో ఆరాల్ సముద్రాన్ని ప్రత్తి వ్యవసాయానికి కావలసిన నీటి పారుదల కోసం నిర్బంధిచటం వల్ల ఇప్పుడు చాలా భూభాగం ఉప్పుడు నేలగా మారింది.
 
=జన్యుపరంగా మార్పిడి చేసిన ప్రత్తి=
పంక్తి 88:
 
=యాంత్రిక సేద్యము=
అమెరికా, యూరోపు మరియు, ఆస్ట్రేలియాలలో ప్రత్తి పంట మొత్తము యంత్రాల ద్వారానే జరుగుతుంది. ఈ యంత్రాలు రెండు రకాలు. కాటన్ పికర్, అంటే గింజల చుట్టూ ఉన్న ప్రత్తిని చక్కగా వేరుచేస్తుంది. కాటన్ స్ట్రిప్పర్, కాయలో ఉన్న ప్రత్తి మొత్తాన్ని గింజలతో సహా వేరుచేస్తుంది. కాటన్ స్ట్రిప్పర్ అనేది బాగా గాలి ఉండే ప్రదేశాల్లో వాడతారు. కాని దీన్ని రసాయనాలని ఉపయోగించి ఆకులు మొత్తాన్ని రాల్చిన తరువాత గాని, లేదా ఆకురాలు కాలంలో సహజసిద్ధంగా ఆకులు రాలిన తరువాత గాని వాడతారు. కాని ప్రత్తి ఈనాటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేతితోనే తీయబడుతోది.
 
=కృత్రిమ నూలు నుండి పోటీ=
1890లో ఫ్రాన్స్ లో రెయాన్ తయారీతో కృత్రిమంగా తయారుచేయబడే నూలు చరిత్ర మొదలయ్యింది. [[రెయాన్]] అనేది పూర్తిగా కృత్రిమం కాదు, కానీ దాని తయారీలో ఉన్న ఇతర కష్టాలు అంతకంటే చవకైన కృత్రిమ నూలు తయారీకి బీజం వేశాయి. తరువాతి దశాబ్దాలలో రకరకాల కృత్రిమ నూలు రసాయన పరిశ్రమలు ఆవిష్కరించాయి. నూలు రూపంలో ఉన్న ఎసిటేట్ ని 1924 లో అభివృద్ధి చేశారు.1936లో కుట్టు దారంగా డ్యూపాంట్ కంపనీ [[నైలాన్]]ని తయారు చేసింది. వాళ్ళే 1944లో ఆక్రిలిక్ ని తయారుచేశారు. ఈ నూలు ఉపయోగించి కొన్ని స్త్రీల దుస్తులు తయారు చేశారు.కాని 1950లో మార్కెట్లోకి పాలిస్టర్ వచ్చిన తరువాత ప్రత్తి నూలుకి నిజమైన దెబ్బ తగిలింది. పాలిస్టర్ దుస్తుల గిరాకీ ఒక్క సారిగా పెరిగేసరికి ప్రత్తి పంట మీద ఆధారపడిన ఆర్థికవ్యవస్థలు గల దేశాలకి ఇబ్బంది మొదలయ్యింది. ముఖ్యంగా చవకైన పురుగుమందుల లభ్యతతో 1950 నుంచి 1965 లమధ్య ప్రత్తి ఉత్పత్తిని పదింతలు పెంచుకున్న [[నికరాగువా]] లాంటి మధ్య అమెరికా దేశాలు. ప్రత్తి ఉత్పత్తి 1970ల్లో కొంచెం పుంజుకున్నా, 1990లో మళ్ళీ 1960 కన్నా ముందు స్థాయికి పడిపోయింది. 1960 మధ్యల్లో క్రమంగా పడిపోతున్న ప్రత్తి స్థాయిని చూసి అమెరికా ప్రత్తి రైతులు స్వయం సహాయక విధానాలని మొదలుపెట్టారు. ప్రతి బేలుకి ఇంత అనే విధానానికి, అందరూ మొగ్గుచూపారు. అందుకు కారణాలు ఒకటి నిధులు సేకరించటానికి, రెండు తమకు నష్టం రాకుండా ఉండటానికి. 1996 లో ప్రత్తి పరిశోధన, ప్రోత్సాహం అనే చట్టం వచ్చిన తరువాత ప్రత్తికి కృత్రిమ నూలు పోటీదారులతో పోటీపడటానికి, తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవటానికి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ విధానం యొక్క ప్రగతి, అమెరికాలో ప్రత్తి నూలు అద్భుతమైన అమ్మకాలు సాధించటానికి, ప్రపంచంలో తన స్థానం తిరిగి నిలబెట్టుకోవటానికి ఉపయోగపడింది.
 
ప్రత్తి బోర్డు ద్వారా, ప్రత్తి ఇంకార్పొరేటేడ్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రత్తి పరిశోధన మరియు, ప్రోత్సాహము అనే సంస్థ ప్రత్తి పండించే రైతుల ప్రయోజనాలకై అహర్నిశలూ శ్రమిస్తుంది. ప్రత్తి రైతులు, దిగుమతిదారులు ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్నారు.
 
=ఉపయోగాలు=
ప్రత్తిని [[వస్త్ర పరిశ్రమ]]లో అనేకమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా టెర్రిక్లాత్, అంటే బాగా నీళ్ళు పీల్చుకునే తుండుగుడ్డలు, దుస్తులు తయారుచేస్తారు. నీలం జీన్సు తయారీకి కావల్సిన డెనిమ్ గుడ్డని తయారుచేస్తారు. పనివాళ్ళువాడే నీలంరంగు గుడ్డలు, కార్డ్యురాయ్, ట్విల్ అనే మందపాటి గుడ్డలు, సీర్ సకర్ అనే పలుచని బల్ల గుడ్డలు కూడా చేస్తారు. సాక్సులు, లోదుస్తులు, చాలా రకాల టి-షర్టులు, దుప్పట్లు ప్రత్తి నూలు తోనే చేస్తారు. అల్లికలలో ఉపయోగించే ప్రత్యేకమైన నూలు ప్రత్తి తోనే తయారవుతుంది. వస్త్రపరిశ్రమలో మిగిలిన నూలుతోకూడా గుడ్డలు నేయవచ్చు. పూర్తి నూలుతోనే కాకుండా నూలుని ఇతర పాలిస్టర్తో కాని, రెయాన్తోకాని కలిపికూడా గుడ్డలు తయారు చెయ్యొచ్చు. రబ్బరు దారాలతో కలిపి, అల్లే గుడ్డలకి కావలసిన నూలు చెయ్యచ్చు. వాటితో సాగే జీన్స్ తయారు చేస్తారు. వస్త్ర పరిశ్రమే కాకుండా ప్రత్తిని చేపల వలలు, కాఫీ వడకట్టే గుడ్డలు, గుడారాలు, తుపాకిమందు, గుడ్డకాగితం మరియు, పుస్తకాల బైడింగులలో వాడతారు.
 
ప్రత్తిని ఉపయోగించిన తరువాత మిగిలే [[ప్రత్తి గింజ]]లని [[పత్తిగింజల నూనె]] తీయడానికి వాడతారు. శుద్ధి చేసిన తరువాత ఆ నూనెని మనుషులు మామూలు ఇతర నూనెలలాగా వాడుకోవచ్చు. మిగిలిన పిప్పిని పశువులకి దాణాగా ఉపయోగించవచ్చు. కాని అందులో ఉండే [[గాసిపోల్]] అనే విష పదార్థం కొన్ని పశువులకు హానికారి. ప్రత్తి గింజల పొట్టు పశువుల దాణాలో కలుపుతారు. అమెరికాలో బానిసత్వం అమలులో ఉన్నప్పుడు ప్రత్తి వేళ్ళ మీద ఉండే పొట్టు గర్భస్రావాలకై వాడేవారు.
పంక్తి 106:
[[Image:2005cottonseed.PNG|thumb|right|350px|[[:en:Cottonseed|ప్రత్తిగింజలు]] 2005లో ఉత్పత్తి]]
 
ఈనాడు ప్రపంచంలో పత్తి యొక్క అతిపెద్ద ఉత్పత్తి దారులు మొదట [[చైనా]] మరియు, [[భారత్]]. వీరి సాలుసరి ఉత్పత్తి రమారమి 34 లక్షల బేళ్ళు, 24 లక్షల బేళ్ళు వరుసగా. ఈ ఉత్పత్తి అయిన ప్రత్తి అంతా స్వదేశాల్లోని నూలు మిల్లులే వాడుకుంటాయి. అతిపెద్ద ఎగుమతిదారులు మొదట అమెరికా (4.9 బిలియన్ డాలర్లు), ఆఫ్రికా (2.1 బిలియన్ డాలర్లు).
 
మొత్తం ప్రపంచ సాలుసరి వాణిజ్యం సుమారు 12 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఆఫ్రికా వాటా 1980 తరువాత రెట్టింపు అయ్యింది. ఎందుకంటే వారికి దేశీయ వస్త్ర పరిశ్రమ లేదు.ఉన్నా అవి తూర్పు, దక్షిణ ఆసియాకి అంటే భారత్, ఛైనా లాంటి అభివృద్ధి చెందుతున్నదేశాలకి వలస పోయాయి.
పంక్తి 148:
'''దిగుమతి'''
మొదటి అయిదు స్థానాల్లోని ప్రత్తి పండించని దిగుమతిదారులు (1) [[కొరియా]] (2) [[రష్యా]] (3) [[తైవాన్]] (4) [[జపాన్]] (5) [[హాంగ్ కాంగ్]].
భారత దేశంలో [[మహారాష్ట్ర]] (26.63%), [[గుజరాత్]] (17.96%), [[ఆంధ్ర ప్రదేశ్]] (13.75%) మరియు, [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్న ప్రత్తి ఉత్పత్తి దారులు. ఈ రాష్ట్రాల్లో వాతావరణం ప్రత్తికి సరిగ్గా సరిపోయిన ఉష్ణ మండల తడి, పొడి వాతావరణం ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో [[టెక్సాస్]] రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటే, [[కాలిఫోర్నియా]] రాష్ట్రం ఒక ఎకరాలో పండించే ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది.
 
'''గిట్టుబాటు వాణిజ్యం'''
పంక్తి 155:
* 2004 సెప్టెంబరు 8న పానెల్ చేసిన సిఫార్సుల ప్రకారం అమెరికా తన స్వదేశీ వినియోగదారులకి, ఎగుమతిదారులకి ఇచ్చేఋణ హామీలు, చెల్లింపులు నిలిపివేయాలనీ, కనీస మద్దతు ధరలకి ఇచ్చే మినహాయింపుల వల్ల కలిగే దుష్ఫలితాలను రూపుమాపాలని చెప్పింది.
* రాయితీల విషయమే కాక కొన్ని దేశాలని వారి ప్రత్తి పొలాల్లో, పరిశ్రమలలో బాలకార్మికులని ఉపయోగిస్తూ వారి ఆరోగ్యాల్ని, పురుగుమందులుతో నాశనం చేస్తున్నారని విమర్శించాయి.పరిసరాల న్యాయ ఫౌండేషన్ ఉజ్బెకిస్థాన్లో బాలకార్మికులని ఉపయోగించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది.
* అంతర్జాతీయ ఉత్పత్తి మరియు, వాణిజ్యం, నూలు దుస్తులు మరియు, పాదరక్షలని గిట్టుబాటు వాణిజ్యానికి చేరువగా చేశాయి.
 
=వాణిజ్యం=
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రత్తిని అమ్మడం, కొనడం మరియు, వ్యాపార వస్తువుగా ధర ఊహాగానాలు రెండుచోట్ల చేస్తారు.
 
# ప్రత్తి భవిష్యత్ ఒప్పందాలు వాణిజ్యం న్యూయార్క్ లోని మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో టికర్ గుర్తు TT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబరు మరియు, డిసెంబరు లలో విడుదల చేస్తారు.
# భవిష్యత్ ఒప్పందాల వాణిజ్యం న్యూయార్క్ వాణిజ్య బోర్డ్ లో టికర్ గుర్తు CT క్రింద చేయబడుతుంది. ఈ ఒప్పందాలు ప్రతి సంవత్సరం మార్చి, మే, జూలై, అక్టోబరు మరియు, డిసెంబరు లలో విడుదల చేస్తారు.
 
=క్లిష్టమైన ఉష్ణోగ్రతలు=
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు