గరికపాటి రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
'''గరికపాటి రాజారావు''' ([[ఫిబ్రవరి 5]], [[1915]] - [[సెప్టెంబరు 8]], [[1963]]) [[తెలుగు సినిమా]] దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర [[ప్రజానాట్యమండలి]] వ్యవస్థాపకుడు.
 
ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో [[దేవిక]], [[అల్లు రామలింగయ్య]], సంగీత దర్శకులు [[మోహన్ దాస్]] మరియు, [[టి.చలపతిరావు]]లు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ మరియు, వాసిరెడ్డి భాస్కరరావు మరియు, బుర్రకథ కళాకారుడు [[షేక్ నాజర్]] ఉన్నారు.<ref>http://www.idlebrain.com/research/anal/anal-tc4.html</ref>
 
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన [[రాజమండ్రి]]లో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కాకినాడలోని [[ఆదిభట్ల నారాయణదాసు]] హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందాడు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, [[హరిశ్చంద్ర]] నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు. తరువాత [[విజయనగరం]]లో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. తండ్రి ఉద్యోగం చేసిన [[సికిందరాబాదు]] లాలాగూడ వర్క్‌షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తూ, పై ఉద్యోగి పీడన భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో [[మద్రాసు]] చేరాడు. మద్రాసులో ఎల్‌.ఐ.యం చదువుతున్న రోజులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు) డాక్టర్‌ రామదాసు ఈయనకు ప్రాణ [[మిత్రుడు|స్నేహితులు]]. అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వలన రాజారావు మార్క్సిస్ట్సు రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు<ref>[http://www.prajasakti.com/kurnool/article-20971 ప్రజాకళాకారుడు డాక్టర్‌ గరికపాటి రాజారావు - ప్రజాశక్తి కర్నూలు సంచిక 2009, సెప్టెంబరు 8]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
పంక్తి 46:
వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి [[విజయవాడ]]లోని [[పోరంకి]]లో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు. కొంతకాలం [[రాజమండ్రి]]లోనూ ప్రజావైద్యశాల నిర్వహించాడు.<ref>[http://www.prabhanews.com/remember/article-274394 కళారాధన వైద్యసేవలకు గరికపాటి రాజారావు - ఆంధ్రప్రభ 2012, ఫిబ్రవరి 2]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
రాజారావు 1953లో [[పుట్టిల్లు]] సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు [[జమున]] మరియు, [[అల్లు రామలింగయ్య]]ను వెండితెరకు పరిచయం చేశాడు. [[పుట్టిల్లు]] సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దానితో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యాడు. కానీ వృత్తిరీత్యా వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు. పేదవారికి ఉచితం వైద్యం చేస్తుండేవాడు.
 
ఆ తరువాత ఈయన 1962లో విడుదలైన [[ఆరాధన]] వంటి సినిమాల్లో చిన్నాచితక పాత్రలు కూడా పోషించాడు. ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశాడు<ref>{{Cite web |url=http://www.cinegoer.com/aradhana.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-08-09 |archive-url=https://web.archive.org/web/20070104221921/http://www.cinegoer.com/aradhana.htm |archive-date=2007-01-04 |url-status=dead }}</ref>.
"https://te.wikipedia.org/wiki/గరికపాటి_రాజారావు" నుండి వెలికితీశారు