నేదురుమల్లి జనార్ధనరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 26:
'''నేదురుమల్లి జనార్థన్ రెడ్డి''' (Nedurumalli Janardhana Reddy) [[1935]], [[ఫిబ్రవరి 20]]న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[వాకాడు]]లో జన్మించాడు.<ref>{{Cite web |url=http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap16.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-03-18 |archive-url=https://web.archive.org/web/20110615094351/http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap16.htm |archive-date=2011-06-15 |url-status=dead }}</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] నేతలలో ఒకడైన జనార్థన్ రెడ్డి [[1992]]-[[1994|94]] కాలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా పనిచేశాడు. [[2004]] లోకసభ ఎన్నికలలో [[విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. ఇటీవల [[2009]], [[మార్చి 16]]న [[రాజ్యసభ]]కు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-03-2009</ref> ఇతని భార్య [[నేదురుమల్లి రాజ్యలక్ష్మి]] 2004 శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందింది.
 
==బాల్యం మరియు, వ్యక్తిగత జీవితం==
నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న శేషమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా [[వాకాడు]] గ్రామంలో జన్మించాడు. నెల్లూరులో బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించాడు. [[1962]], మే 25న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. భార్య రాజ్యలక్ష్మి 2004లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినది.
==రాజకీయ ప్రస్థానం==
పంక్తి 32:
 
==ముఖ్యమంత్రిగా==
[[1991]]లో [[హైదరాబాదు]]లో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ [[మర్రి చెన్నారెడ్డి]] రాజీనామా చేయగా ఆయన స్థానంలో కాంగ్రేస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని [[ముఖ్యమంత్రి]]గా నియమించింది. పార్టీలో వివిధ ముఠాలను అదుపులో పెట్టడంలో సమర్ధుడైన జనార్ధనరెడ్డి పార్టీలో అసమ్మతిని అదుపుచేయటానికి అనేక చర్యలు చేపట్టాడు. శాసనసభా సభ్యుల మద్దతు కూడగట్టుకోవటానికి వాళ్ళకు హైదరాబాదులోని సంపన్న ప్రదేశాలలో స్థలాలు మంజూరు చేశాడు. టెలిఫోను బిల్లులకై ప్రత్యేక అలవెన్సులు, కార్లు కొనుక్కొవడానికి సులువైన ఋణాలు ఇప్పించాడు. 1992 జూన్ లో సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే ప్రైవేటు యాజమాన్యంలోని 20 ఇంజనీరింగు మరియు, వైద్య కళాశాలలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విధంగా కళాశాలలను స్థాపించడానికి పర్మిట్లు పొందిన అనేక సంస్థలు సారా వ్యాపారులు, ఎక్సైజు కాంట్రాక్టర్లు మరియు, మంత్రులు పెట్టుబడి పెట్టినవే. వీటికి అనుమతులు మంజూరు చేయడానికి జనార్ధనరెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని వదంతులు వ్యాపించాయి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తీర్పుగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కళాశాలకు అనుమతులు మంజూరు చేయడంలో అనేక అవకతవకలు జరిగినట్టు నిర్ణయించి, అనుమతి జారీ చేస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును రాజ్యంగ విరుద్ధమని కొట్టివేసింది.<ref>Parties, elections, and mobilisation By K. Ramachandra Murty, D. Suran Naidu పేజీ.59 [http://books.google.com/books?id=x7pD5oTDw0IC&pg=PA90&dq=nedurumalli&client=firefox-a#PPA59,M1]</ref>
 
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో కోట్ల విజయభాస్కరరెడ్డిని కాంగ్రేసు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది.