సుబాబుల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
[[File:Leucaena leucocephala MHNT.BOT.2011.3.71.jpg|thumb|''Leucaena leucocephala'']]
 
'''సుబాబుల్''' [[వృక్ష శాస్త్రీయ నామం]] Leucaena leucocephala. చిన్న మిమొసాయిడ్ చెట్టు రకానికి చెందిన దీని మూలాలు దక్షిణ మెక్సికో మరియు, ఉత్తర మధ్య అమెరికా (బెలిజ్ మరియు, గ్వాటెమాల) కు సంబంధించినవి. కానీ ఈ చెట్టు ఇప్పుడు అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో white leadtree, jumbay, and white popinac అంటారు. ఈ పేర్లను తెలుపు రంగు తల అనే అర్థాల నిచ్చే [[గ్రీకు]] పదాల నుండి స్వీకరించారు. ఈ చెట్టుకి పూసే [[పువ్వు]]లు తెల్లని కేశరములతో తల వలె గుండ్రంగా ఉంటాయి. దీనిని [[వంటచెరకు]]గా, [[నార]]గా మరియు, [[పశువుల మేత]]గా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీని [[కలప]] పనిముట్లకు మరియు, కాగితపు గుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు. విత్తనాలలో 24 శాతం మాంసకృత్తులు కల్గి ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. గాలిలో ఉన్న [[నత్రజని]]ని ఉపయోగించుకునే శక్తిగల బాక్టీరియాను వేరుబుడిపెలందు కలిగి ఉంటుంది. ఎక్కువసార్లు పిలకపంట తీసుకోవచ్చు. ఉష్ణమండలాల్లో బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మీ.మీ. ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది.
 
==నేలలు==
అన్నిరకాల తటస్థ నేలల్లో పెరుగుతుంది. క్షార మరియు, ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు, ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన పెంచవచ్చు. అటవీ వ్యవసాయంగా పంటపొలాల్లో కూడా పెంచవచ్చు.
 
==నారు మొక్కల పెంపకం==
"https://te.wikipedia.org/wiki/సుబాబుల్" నుండి వెలికితీశారు