కొత్త ప్రపంచం: కూర్పుల మధ్య తేడాలు

"New World" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం వ్యాసాల అనువాదం ContentTranslation2
 
చి →‎వాడుక: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 9:
"కొత్త ప్రపంచం" గురించి ఏదైనా [[చరిత్ర|చారిత్రక]] సందర్భంలో మాట్లాడవచ్చు. ఉదా., [[క్రిస్టోఫర్ కొలంబస్]] చేసిన సముద్రయానాలు, స్పానిష్ వారు యుకాటాన్‌ను ఆక్రమించిన విషయం గురించి మాట్లాడేటపుడు, వలసరాజ్యాల కాలంలోని ఇతర సంఘటనల గురించి చర్చించేటప్పుడు ఈ పదాన్ని వాడవచ్చు. అమెరికాలు, సమీప [[ద్వీపం|ద్వీపాలైన]] [[బెర్ముడా]], క్లిప్పర్టన్ ద్వీపం వంటివాటిని సమిష్టిగా ఉదహరించేందుకు వేరే పదాలేమీ లేనందున కూడా ఈ పదం ఉపయోగపడుతుంది.
 
కొత్త ప్రపంచం అనే మాటను జీవశాస్త్ర సంబంధ చర్చల్లో విషయాలకూ వాడుతారు. పాత ప్రపంచానికి చెందిన జాతులను (పాలియార్కిటిక్, ఆఫ్రోట్రోపిక్ ), కొత్త ప్రపంచపు జాతులనూ (నియార్కిటిక్, నియోట్రోపిక్) ఉదహరిస్తారు. ప్రత్యేకించి అమెరికాలో మాత్రమే కనిపించే జీవజాతులను ఉదహరించేందుకు, వాటిని "పాత ప్రపంచం" లోని (యూరప్, ఆఫ్రికా మరియు, ఆసియా) లోని వాటి నుండి వేరు చేయడానికీ జీవ వర్గీకరణ శాస్త్రవేత్తలు ఈ పదాన్ని వాడుతారు. ఉదా: కొత్త ప్రపంచపు కోతులు, కొత్త ప్రపంచపు రాబందులు, కొత్త ప్రపంచపు వార్బ్‌లర్లు.
 
వ్యవసాయంలోనూ ఈ మాటను తరచుగా ఉపయోగిస్తారు. కొత్తరాతియుగ విప్లవం నుండి ఉత్పన్నమైన వ్యవసాయపు చరిత్ర ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో ఒకేలా ఉంటుంది. ఒకే పెంపుడు జంతువులు, మొక్కలూ వేల సంవత్సరాల క్రితం ఈ మూడు ఖండాల్లో వ్యాపించాయి. దీంతో వీటన్నిటినీ కలిపి "పాత ప్రపంచం" గా వర్గీకరించడానికి వీలుగా ఉంది. పాత ప్రపంచంలో సామాన్యంగా కనిపించే పంటలు (ఉదా., [[బార్లీ]], కాయధాన్యాలు, [[వోట్|ఓట్లు]], [[బఠానీ|బఠానీలు]], రై, [[గోధుమ|గోధుమలు]]), పెంపుడు జంతువులూ (ఉదా., [[పశువు|పశువులు]], [[కోడి|కోళ్లు]], [[మేక|మేకలు]], [[గుర్రము|గుర్రాలు]], పందులు, [[పొట్టేలు|గొర్రెలు]]), కొలంబస్ అమెరికాను కనిపెట్టిన తరువాత (కొలంబియన్ పరిచయం) ఐరోపా నుండి తీసుకువెళ్ళేంత వరకు అమెరికాలో లేవు. అలాగే, అమెరికాల్లో పెంచిన కొన్ని పంటలు కొలంబియన్ పరిచయం తరువాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. వాటిని కొత్త ప్రపంచపు పంటలు అని అంటారు; చిక్కుళ్ళు ''(ఫాసియోలస్),'' [[మొక్కజొన్న]], స్క్వాష్ (ముగ్గురు సోదరీమణులు), అలాగే [[అవకాడో|అవోకాడో]], [[టమాటో|రామములగ]], వివిధ రకాల [[కాప్సికమ్]] ([[కూరమిరప]], [[మిరపకాయ]] మొదలైనవి). [[టర్కీ (పక్షి)|టర్కీలను]] మధ్య అమెరికా లోని కొలంబియా ప్రజలు మొదట మచ్చిక చేసుకున్నారు. దక్షిణ అమెరికాలోని [[ఆండీస్ పర్వతాలు|ఆండియన్]] ప్రాంతంలోని వ్యవసాయదారులు [[కర్ర పెండలము|కర్ర పెండలం]], [[వేరుశనగ|వేరుశెనగ]], [[బంగాళదుంప|బంగాళాదుంప]], క్వినోవా, అల్పాకా వంటి పంటలను గినియా పిగ్, లామా వంటి పెంపుడు జంతువులనూ సాకారు. ఇతర కొత్త ప్రపంచపు పంటల్లో [[జీడి|జీడిపప్పు]], కోకో, రబ్బరు, పొద్దుతిరుగుడు, పొగాకు, వనిల్లా, [[జామ]], [[బొప్పాయి]], [[అనాస|పైనాపిల్]] వంటి పండ్లూ ప్రసిద్ధమైనవి. రెండు ప్రపంచాల్లోనూ వేరువేరుగా పెంచిన పంటలు, జంతువులూ కూడా ఉన్నాయి. ఉదా: [[సొర కాయ|సొరకాయ]], [[పత్తి]], యామ్, [[కుక్క]]. బహుశా వీటిని పురాతన మానవులు గత గ్లేసియల్ కాలంలో ఆసియా నుండి వెళ్ళినపుడు తీసుకెళ్ళి ఉండవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కొత్త_ప్రపంచం" నుండి వెలికితీశారు